E-Paper
Advertisement

ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో హీరో సత్తా.. ఏకంగా ఓలాను దాటేసిందిగా!

ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో హీరో సత్తా..  ఏకంగా ఓలాను దాటేసిందిగా!
Advertisement

Hero vs Ola Electric:  భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్‌ లో పోటీ బాగా పెరుగుతోంది. ఒకప్పుడు అమ్మకాలతో దూసుకెళ్లిన ఓలా ఎలక్ట్రిక్‌కు ఇప్పుడు గట్టి పోటీ ఎదురవుతోంది. మరోవైపు హీరో మోటోకార్ప్ తన VIDA ఎలక్ట్రిక్ స్కూటర్లతో అమ్మకాలను పెంచుకుంటోంది. తాజాగా విడుదలైన FADA గణాంకాల్లో హీరో నాలుగో స్థానంలో నిలవగా, ఓలా ఐదో స్థానానికి పరిమితమైంది.

ఓలాను వెనక్కి నెట్టిన హీరో VIDA

ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) తాజా లెక్కల ప్రకారం, అక్టోబర్ 2026లో హీరో మోటోకార్ప్ మొత్తం 29,923 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో నమోదైన 16,499 యూనిట్లతో పోలిస్తే అమ్మకాలు ఏకంగా 81.36 శాతం పెరిగాయి. సెప్టెంబర్ 2026లో 24,321 యూనిట్లను విక్రయించిన హీరో, అక్టోబర్‌లో మరో 23 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీంతో దేశీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో నాలుగో స్థానాన్ని నిలబెట్టుకుంది.

విడా స్కూటర్లకు పెరుగుతున్న ఆదరణ

Advertisement

హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ స్కూటర్లను విడా బ్రాండ్ పేరుతో విక్రయిస్తోంది. ఈ శ్రేణిలో VX2, V2 మోడళ్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. పలు ధరలు, బ్యాటరీ ఆప్షన్లతో కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న ఆదరణ హీరో అమ్మకాల వృద్ధికి కారణం అయ్యింది.

ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు ఎంత తగ్గాయంటే?

మరోవైపు ఓలా ఎలక్ట్రిక్‌కు అక్టోబర్ 2026లో కూడా ఆశించిన ఫలితాలు దక్కలేదు. ఈ నెలలో కంపెనీ 12,098 యూనిట్లను మాత్రమే అమ్మింది. గత ఏడాది అక్టోబర్‌లో నమోదైన 16,439 యూనిట్లతో పోలిస్తే అమ్మకాలు 26.41 శాతం తగ్గాయి. సెప్టెంబర్ 2026లో 13,451 యూనిట్లను విక్రయించిన ఓలా, అక్టోబర్‌లో మరో 10.06 శాతం అమ్మకాలను కోల్పోయింది. దీంతో హీరో కంటే వెనుకబడి ఐదో స్థానంలో నిలిచింది.

EV మార్కెట్లో మారుతున్న లెక్కలు

Advertisement

అక్టోబర్ 2026లో ఎలక్ట్రిక్ టూ వీలర్ విక్రయాల్లో TVS మోటార్ 60,490 యూనిట్లతో మొదటి స్థానంలో నిలిచింది. బజాజ్ ఆటో 49,126 యూనిట్లతో రెండో స్థానంలో, ఏథర్ ఎనర్జీ 31,833 యూనిట్లతో మూడో స్థానంలో ఉన్నాయి. హీరో VIDA నాలుగో స్థానాన్ని దక్కించుకోగా, ఓలా ఐదో స్థానానికి పరిమితమైంది.

ఈ లెక్కలు చూస్తే భారత EV మార్కెట్లో పోటీ ఎంతగా పెరిగిందో అర్థమవుతోంది. రాబోయే నెలల్లో ఓలా తన అమ్మకాలను తిరిగి పెంచుకుంటుందా? హీరో VIDA ఇదే జోరును కొనసాగిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

Read Also: ఆంపియర్ నుంచి కొత్త EV.. 3 నెలల్లో ఐస్‌బ్రేకర్ లాంచ్!

Tags

Related News

హ్యుందాయ్ నుంచి రెండు కొత్త SUVలు.. ఒకటి ఎలక్ట్రిక్, మరొకటి హైబ్రిడ్!

పండుగ సీజన్‌ లో లక్ష దాటిన ట్రాక్టర్ల అమ్మకాలు.. ఏ కంపెనీ ఎన్ని యూనిట్లు అమ్మిందంటే?

ఆంపియర్ నుంచి కొత్త EV.. 3 నెలల్లో ఐస్‌బ్రేకర్ లాంచ్!

థార్ రాక్స్ To ఫార్చ్యూనర్.. లాంగ్ జర్నీలకు బెస్ట్ డీజిల్ SUVలు!

TVS జుపిటర్ 125 కొత్త వేరియంట్.. త్వరలోనే లాంచ్!

డిసెంబర్‌ లో కొత్త కార్ల పండగ.. జస్ట్ రెండు వారాల్లో ఏకంగా 6 మోడల్స్ విడుదల!

ఎలక్ట్రిక్ స్కూటర్లకు పండుగ సీజన్‌లో భారీ డిమాండ్.. ఏకంగా 61 శాతం పెరిగిన అమ్మకాలు!

Big Stories

Advertisement
×