E-Paper
Advertisement

భర్తలకు తెలియకుండా భార్యల రహస్య పార్టీలు… ఓటీటీలో సంచలన సిరీస్

భర్తలకు తెలియకుండా భార్యల రహస్య పార్టీలు… ఓటీటీలో సంచలన సిరీస్
Advertisement

The Hunting Wives Season 2 on OTT: గతేడాది ఓటీటీలో విడుదలై బోల్డ్ సీన్స్, ఊహించని ట్విస్టులతో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘ది హంటింగ్ వైవ్స్’ (The Hunting Wives). మొదటి సీజన్ క్లైమాక్స్‌లో అందరినీ షాక్‌కు గురిచేసిన ఈ కథ, ఇప్పుడు అంతకుమించిన రచ్చతో సీజన్ 2 రూపంలో నేటి నుంచే ఓటీటీలో సందడి చేస్తోంది. రెబెక్కా కట్టర్ రూపొందించిన ఈ కొత్త సీజన్‌లో బ్రిటనీ స్నో (Brittany Snow), మాలిన్ అకెర్‌మాన్ (Malin Akerman), డెర్మోట్ ముల్రోనీ, జైమీ రే న్యూమాన్ మళ్లీ మెయిన్ రోల్స్ చేయగా, వీరికి తోడుగా జాన్ స్టామోస్ (John Stamos), కామ్ గిగాండెట్, డేల్ డిక్కీ, స్టార్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ ఏంజెల్ రీస్ కొత్త క్యారెక్టర్లలో ఎంట్రీ ఇచ్చారు. ట్విస్టులు, మర్డర్ మిస్టరీలు ఇష్టపడే వాళ్లకు వీకెండ్‌లో మంచి టైమ్‌పాస్ అవుతుంది. మొదటి సీజన్‌లో ఆడవాళ్ల సీక్రెట్ పార్టీలు, హత్య చుట్టూ సాగే ఈ స్టోరీ సెకండ్ సీజన్లో మరిన్ని మలుపులు తిరుగుతుంది. అయితే ఇందులో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో దీనిని ఒంటరిగా చూడటమే మంచిది.

కథ విషయానికి వస్తే..

మొదటి సీజన్ చివర్లో జరిగిన భయంకరమైన సంఘటనల తర్వాత, ఒకప్పుడు ప్రాణస్నేహితుల్లా ఉన్న సోఫీ (బ్రిటనీ స్నో), మార్గో (మాలిన్ అకెర్‌మాన్) ఇప్పుడు బద్ధ శత్రువుల్లా విడిపోతారు. అయితే మార్గో భర్త జెడ్ బ్యాంక్స్ (డెర్మోట్ ముల్రోనీ) గవర్నర్ ఎన్నికల బరిలోకి దిగడంతో ఆ టౌన్‌లో రాజకీయ వేడి రాజుకుంటుంది. ఇదే సమయంలో వాళ్ల గతంలో పాతిపెట్టిన పాత రహస్యాలు మళ్లీ బయటకు రావడం మొదలుపెడతాయి.
మరోవైపు ఒక డేంజరస్ బైకర్ గ్యాంగ్ మార్గోను టార్గెట్ చేయడంతో పాటు, ఒక రియాలిటీ షో కెమెరా క్రూ ఆ ఊరిలోని వాళ్ల సీక్రెట్ అఫైర్స్ అన్నింటినీ బయటపెట్టే పనిలో పడుతుంది. చుట్టూ ముంచుకొస్తున్న కొత్త శత్రువుల నుంచి, పోలీసుల ఉచ్చు నుంచి తప్పించుకోవడానికి ఇష్టం లేకపోయినా సోఫీ, మార్గో మళ్లీ చేతులు కలపాల్సి వస్తుంది. ఈసారి వాళ్లు వేటగాళ్లుగా నిలిచారా లేక వేరే వాళ్ల చేతిలో బలయ్యారా అనేది ఒళ్లు గగుర్పొడిచే ట్విస్టులతో సాగుతుంది.

నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ 

Advertisement

ఐయండిబిలో 6.8/10 రేటింగ్ ఉన్న ‘ది హంటింగ్ వైవ్స్’ (The Hunting Wives) క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో నేటి నుంచే (2026 నవంబర్ 26) స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్న ఈ రెండో సీజన్ అన్ని భాగాలు ఒకేసారి అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో ఎపిసోడ్ సుమారు 50 నిమిషాల నిడివితో ఉండే ఈ సిరీస్ ప్రస్తుతం ఇంగ్లీష్ ఆడియో, సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. ఇందులో బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల కేవలం పెద్దవాళ్లు మాత్రమే (18+) చూడదగ్గ సిరీస్ ఇది.విశేషమేమిటంటే, దీనికి ఇప్పటికే సీజన్ 3 కూడా కన్ఫర్మ్ అయింది.

Read Also: 36 ఏళ్ల క్రితం చనిపోయిన శవం… ప్రతి పౌర్ణమికి రాక్షసుడిగా… ఓటీటీలో వణికించే హారర్ థ్రిల్లర్

Tags

Related News

స్పైడర్‌మ్యాన్, హల్క్, పనిషర్ ఒకే స్క్రీన్‌పై… థియేటర్లలో పూనకాలు తెప్పించిన మూవీ నేటి నుంచే ఓటీటీలో

స్కూల్‌కు వెళ్లాలంటేనే వణికిపోయే పిల్లాడు… మామయ్య ఎంట్రీతో హీరోగా మారితే… ఓటీటీలో సూపర్ హిట్ మూవీ

చావు అంచున ఆడిన చివరి ఆట… గుండెను బరువెక్కించే వార్ డ్రామా ఓటీటీలోకి

5 భాషలలో ఓటీటీలోకి ‘గరివిడి లక్ష్మి’.. అఫీషియల్ అనౌన్స్మెంట్!

మనుషుల్లా కనిపించే రెప్లికెంట్స్‌… తెలుగులో ఓటీటీలోకి వచ్చిన ఫ్యూచరిస్టిక్ సైఫై థ్రిల్లర్

తోడు కావాలంటూ బుట్ట బొమ్మ తో ప్రేమ పెళ్లి… ఇదెక్కడి విచిత్రమైన కథరా బాబూ

మందలించిందని తల్లికి పిల్లలను దూరం చేసే ప్రభుత్వం… వాస్తవ సంఘటనల ఆధారంగా వచ్చిన లీగల్ డ్రామా

Big Stories

Advertisement
×