E-Paper
Advertisement

ఏడాది తర్వాత ఓటీటీలో శబ్దం సందడి.. తెలుగులో కూడా స్ట్రీమింగ్

ఏడాది తర్వాత ఓటీటీలో శబ్దం సందడి.. తెలుగులో కూడా స్ట్రీమింగ్
Advertisement

Shabdham Movie:కరోనా వచ్చిన దగ్గర్నుంచి ఈ ఓటీటీ చిత్రాలకు ఆదరణ భారీగా పెరిగిపోయింది. అంటే దాదాపు 5 సంవత్సరాలుగా ఓటీటీ జమానా నడుస్తోంది అనడంలో సందేహం లేదు.. థియేటర్లలో విడుదల అవ్వడం ఆలస్యం నెల లేదా ఒకటిన్నర లోపే ఆ సినిమాలు ఓటీటీకి వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా జానర్ తో సంబంధం లేకుండా ప్రేక్షకుడికి కావలసిన ప్రతి చిత్రాన్ని ఈ ఓటీటీలు అందిస్తున్నాయి అనడంలో సందేహం లేదు. అందుకే భాషతో సంబంధం లేకుండా ప్రతి చిత్రానికి ప్రేక్షకుడి నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఇకపోతే సాధారణంగా సినిమా విడుదల అయిన తర్వాత కొన్ని వారాలకే ఓటీటీలోకి వస్తూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఏడాది గడిచినా ఓటీటీ అందుబాటులోకి రావు. కానీ సడన్గా ఏడాది తర్వాత మళ్లీ ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైతే మాత్రం అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. సరిగ్గా ఈ క్రమంలోనే ఒక సినిమా ఏడాది తర్వాత అందులోనూ తెలుగులో స్ట్రీమింగ్ అవ్వడానికి సిద్ధం అయిపోయింది.. అదేదో కాదు శబ్దం

ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన శబ్దం..

ప్రముఖ సినీ నటుడు ఆది పినిశెట్టి తమిళ నటుడు అయినప్పటికీ తెలుగులో తన చిత్రాలతో మంచి పేరు సొంతం చేసుకున్నారు. అలాంటి ఈయన చేసిన చిత్రం శబ్దం. గత ఏడాది 28న తెలుగు , తమిళ్లో ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది . కానీ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.. అప్పట్లో ఆది పినిశెట్టితో కలిసి వైశాలి సినిమా తీసిన అరివళగన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే సక్సెస్ ని మాత్రం రిపీట్ చేయలేకపోయింది ఈ కాంబో.. ఈ సినిమా తమిళ వెర్షన్ గత నెల 24వ తేదీన జీ 5 ఓటీటీ లోకి వచ్చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు హిందీ వెర్షన్ కూడా తీసుకొచ్చారు.ఇప్పుడు తెలుగులో అందుబాటులోకి తీసుకొచ్చారు.మొత్తానికైతే జీ5 వేదికగా ఆది పినిశెట్టి శబ్దం సినిమా ఓటీటీలలో సందడి చేస్తోంది.

Advertisement

ALSO READ:అరుదైన వ్యాధితో బాధపడుతున్న విశ్వ భార్య.. ట్రోల్స్ పై గట్టి కౌంటర్!

శబ్దం సినిమా స్టోరీ..

ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. మున్నార్ లో ఒక మెడికల్ కాలేజీ ఉంటుంది. అందులోని విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పద రీతిలో చనిపోతూ ఉంటారు. ఇక మీడియాకి , పోలీసులకు ఈ విషయం తెలిస్తే కాలేజీ పరువు పోతుందని యాజమాన్యం ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్ తో కాలేజీ మొత్తం పరిశోధన జరిపించి దెయ్యాలు ఆత్మలు లేవని నిరూపించాలని అనుకుంటుంది.ఇందుకోసం పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ వ్యూమా వైద్య లింగం (ఆది పినిశెట్టి) ను తీసుకొస్తుంది. మనుషులకు కూడా వినిపించని శబ్దాలను తన దగ్గర ఉన్న సాంకేతిక పరికరాలతో వింటూ ఆత్మలతో మాట్లాడి ఆ కేసులను పరిష్కరిస్తూ ఉంటాడు ఆది. అయితే ఈ కాలేజీలో పని చేసే లెక్చరర్ అవంతిక (లక్ష్మీ మీనన్) పై అనుమానం ఉంటుంది. వ్యూమా కి ఆ కాలేజీలోని సెంట్రల్ లైబ్రరీలోనే అవంతికపై ఒక ప్రయోగానికి సిద్ధపడగా.. అక్కడే 42 ఆత్మలు ఉన్నట్లు ఆయన కనిపెడతాడు.

ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే..

Advertisement

అయితే ఆత్మలుగా మారిన ఆ 42 మంది ఎవరు? వాళ్లకు కాలేజీలో జరుగుతున్న చావులకు సంబంధం ఏమిటి ?అనేది ఈ మిగతా స్టోరీ . థియేటర్లలో ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయిన ఈ సినిమా ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఇక్కడ ఎలాంటి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Related News

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

వచ్చేవారం నెట్ ఫ్లిక్స్ లో 3 సినిమాలు.. ఆ 2 మస్ట్ వాచ్!

అందరూ తక్కువ అంచనా వేసే లాయర్‌… కోర్టులో ఆమె వాదనలు వింటే మైండ్‌ బ్లాక్‌… మెంటలెక్కించే లీగల్‌ డ్రామా

థెరపీ కోసం వచ్చిన పేషెంట్‌తోనే సైకాలజిస్ట్‌కి తలనొప్పులు… నవ్వించే డార్క్ కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×