OTT Movie : మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఒక మలయాళం సినిమా డిఫరెంట్ స్టోరీతో అనేక అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమా 2023 ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజిల్స్‌లో గ్రాండ్ జ్యూరీ అవార్డ్ గెలుచుకుంది. 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (గోవా)లో ఓపెనింగ్ ఫీచర్ ఫిల్మ్‌గా ఎంపికైంది. 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ చలనచిత్రంగా అవార్డు గెలుచుకుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
ఈ మలయాళ థ్రిల్లర్ మూవీ పేరు “ఆట్టం” (Aattam). 2023లో విడుదలైన ఈ సినిమాకి ఆనంద్ ఏకర్షి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అజిత్ జోయ్ ద్వారా జాయ్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించబడింది. ఈ చిత్రంలో జరీన్ షిహాబ్ (అంజలి), వినయ్ ఫోర్ట్ (వినయ్), కలభవన్ షాజోన్ (హరి) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 140 నిమిషాల నిడివి కలిగి ఉన్న ఈ సినిమాకి IMDbలో 8.1/10 రేటింగ్ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
“ఆట్టం” కథ అరంగు అనే థియేటర్ గ్రూప్ చుట్టూ తిరుగుతుంది. ఇందులో 12 మంది పురుషులు, అంజలి అనే ఒక మహిళ ఉంటారు. . అంజలి ఈ గ్రూప్‌లో 16 ఏళ్ల వయసు నుండి ఉంటుంది. ఆమె ఒక ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తూనే థియేటర్ పట్ల మక్కువతో నటిస్తుంది. అయితే అంజలి తన పాత్రలో ప్రతిభావంతురాలైనప్పటికీ, ఆమెను సమాన నటిగా గుర్తించకుండా, కుట్టు పనులు, మేకప్ వంటి పనులకు పరిమితం చేస్తారు. ఆమె వినయ్ తో ప్రేమలో ఉంటుంది. అతను గ్రూప్‌లో చురుకుగా ఉంటాడు. కానీ అతని విడాకుల గురించి రహస్యంగా ఉంచుతాడు. ఒక విజయవంతమైన ప్రదర్శన తర్వాత, ఈ గ్రూప్ ఒక పార్టీని నిర్వహిస్తుంది. అక్కడ అంజలి నిద్రిస్తున్న సమయంలో, ఒక సభ్యుడు వేధించాడని ఆరోపిస్తుంది. ఆమె ఈ విషయం వినయ్‌తో పంచుకుంటుంది.
గ్రూప్‌లో కొత్తగా చేరిన హరి అనే వ్యక్తి దీనికి కారణమని ఆమె నమ్ముతుంది. ఈ ఆరోపణ గ్రూప్‌ను షాక్‌కు గురిచేస్తుంది. హరిని మినహాయించి, మిగిలిన 11 మంది సభ్యులు ఒక అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ సమావేశం, “12 ఆంగ్రీ మెన్” స్టైల్‌లో, న్యాయం, శిక్ష గురించి చర్చించడానికి ఒక రౌండ్‌టేబుల్ చర్చ జరుగుతుంది. మొదట, చాలామంది అంజలి వైపు నిలబడి, దోషిని బహిష్కరించాలని అంగీకరిస్తారు. కానీ గ్రూప్‌కు యూరప్‌లో ప్రదర్శన కోసం ఒక ఆఫర్ రావడంతో, పరిస్థితి గందరగోళంగా మారుతుంది.
చర్చలు ముందుకు సాగుతున్నప్పుడు, సభ్యులు అంజలి ఆరోపణలను ప్రశ్నిస్తూ, ఆమె జ్ఞాపకశక్తి, దుస్తులు, ఆమె ప్రవర్తనను విమర్శిస్తారు. ఈ చర్చలు గ్రూప్‌లోని ఈగోలు, ద్వేషాలు, పక్షపాతాలతో నడుస్తుంది. అంజలి సమావేశంలో చేరినప్పుడు, ఆమె తనకు జరిగిన గాయాన్ని వ్యక్తపరుస్తుంది. కానీ ఆమె గొంతు తరచుగా అణచివేయబడుతుంది. ఆమె ప్రియుడు వినయ్ కూడా ఆమెకు మద్దతు ఇవ్వడంలో వెనకడుగు వేస్తాడు. క్లైమాక్స్‌లో, అంజలి ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది. ఆమె తీసుకున్న నిర్ణయం ఏమిటి ? నిందితుడు ఎవరు ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.
Read Also : పీకలదాకా తాగి పిచ్చి పనులు… ఐఎండీబీలో 9.1 రేటింగ్… రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన తమిళ థ్రిల్లర్