Jabardasth : బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్.. టాప్ కామెడీ షోలో జబర్దస్త్ ని బీట్ చేసిన షో ఇంతవరకు రాలేదు. టాప్ కమెడియన్లు, జడ్జిలు వెళ్లిపోయినప్పటికీ జబర్దస్త్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సినిమాల్లో అవకాశాలు రావడంతో చాలామంది కమెడియన్లు షోకి దూరమాయ్యారు. రేటింగ్ తగ్గింది కానీ జబర్దస్త్ కి పోటీ మాత్రం రాలేదు. ఇప్పటివరకు బుల్లితెరపై ఎన్ని కామెడీ షో లు వచ్చినా ఈ షో కి సాటి రాదు. ఈమధ్య ప్రసారమవుతున్న షోలో టాప్ కమెడియన్లు మళ్లీ సోలో కనిపిస్తున్నాడంతో జనాలు జబర్దస్త్ చూడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా జబర్దస్త్ ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే…
జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో..
నూకరాజు స్కిట్ లో సీనియర్ యాక్టర్లు అన్నపూర్ణమ్మ, వై విజయలు తమ టైమింగ్‌తో నవ్వులు పూయించారు. ముఖ్యంగా అన్నపూర్ణమ్మ తన పంచ్‌లు, సామెతలతో అదరగొట్టారు. మనకంటే చిన్నోళ్లు జడ్జిలు, మనకంటే పెద్దోళ్లు యాంకర్లు అంటూ సెటైర్లు విసిరారు. అలాగే స్కిట్‌లో భాగంగా నూకరాజు ఓ బస్తా నిండా మల్లెపూలు తీసుకుని భార్య దగ్గరికి వెళ్తాడు. ఆషాడం మొదలైంది కొత్త జంటలు దూరంగా ఉండాలని అన్నపూర్ణమ్మ, వై విజయ అంటారు. నీలాగే మీ తాత కూడా మల్లెపూలు బస్తాడు మిఠాయిలు మోసుకొని వచ్చి అరిసిపోయి పడుకుంటాడని గాలి తీసేస్తారు. ఆ తర్వాత యాదమ్మ రాజు టైటానిక్ స్కిట్ తో వస్తాడు. చంటి రాంప్రసాద్ లు కుబేర దీంతో ప్రేక్షకులను అలరించడానికి స్కిట్ని చేస్తారు.
Also Read: మరో కొత్త బిజినెస్ ను స్టార్ట్ చేసిన సమంత..!
భర్త పై అనుమానంతో ఫైమా పైశాచికం..
బుల్లెట్ భాస్కర్, ఫైమా ఒక స్కిట్ చేస్తారు. అందులో ఫైమాకు భర్త పై అనుమానం ఎక్కువగా ఉంటుంది. వర్ష భాస్కర్ ఫ్రెండ్ గా నటిస్తుంది.. భాస్కర్ కి వర్ష కి ఏదన్న నడుస్తుందని అనుమానంతో ఉంటుంది. వర్షను ఫైమా లాగికొట్టడంతో ఆమె వెళ్లి యాంకర్ మానస్ ఒడిలో పడుతుంది. దాంతో సాంప్రదాయిని సుద్ధపూసని, ఇద్దరినీ అని వర్షను పక్కకి లాక్కొస్తుంది ఫైమా.. ఈ స్కిట్లు షకలక శంకర్ ఎంట్రీ ఇస్తాడు. వాడిదేనా నా ప్రమేయం లేని చేయడు అని అంటాడు. ఆ మాట వినగానే రెచ్చిపోయిన ఫైమా రాత్రి నాకు ముద్దు ఇవ్వమంటే ఇవ్వలేదు అంతా నీవల్లేనా అని రివెంజ్ తీర్చుకుంటుంది.. శంకర్ ప్యాంటు లాగే పని చేస్తుంది. అందరూ చూస్తున్నారు వదిలే నన్ను అంటున్న కూడా ఫైమా వెంటపడి మరి శంకర్ ప్యాంట్ ని లాగుతుంది. ఈ ప్రోమో కి ఇదే హైలైట్ గా నిలిచింది. మొత్తానికి అయితే ప్రోమో సరదాగా ఉంది. ఎపిసోడ్లో ఎంత రచ్చ చేస్తారో చూడాలి.. జబర్దస్త్ షోలో మళ్లీ పాత కమెడియన్ రావడం ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందని అర్థమవుతుంది. ఇక ముందు ఎవరు ఎంట్రీ ఇస్తారో చూడాలి..