Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా రానున్న నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. రుతుపవన ద్రోణి, వాయుగుండం, ఉపరితల చక్రవాత ఆవర్తనం కారణంగా.. రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్స్ జారీ చేసింది.
శనివారం కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెదర్ ఆఫీసర్లు తెలిపారు. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను వాతావరణశాఖ జారీ చేసింది. గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉంది. అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం.
ఆదివారం మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట,హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. సోమవారం సైతం పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
మరోవైపు రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదన్నారు. రానున్న రెండు రోజులు వాతావరణం క్రింది విధంగా ఉండనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు.
ఇవాళ శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురంమన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు,కృష్ణా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
Also Read: హైదరాబాద్ కార్ల షోరూంలోకి వరదనీరు.. చిక్కుకున్న 80 మంది.. రంగంలోకి హైడ్రా!
రేపు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఆఫీసర్లు. మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.