OTT Movie : మలయాళం సినిమాలకు ఓటీటీలో మంచి డిమాండ్ ఉంది. ఈ ఇండస్ట్రీ నుంచి వస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాయి. తెలుగు వాళ్ళు కూడా ఈ సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకో బోయే మూవీలో ఒక అపరిచిత వ్యక్తి కొంతమంది వ్యక్తులను బంధించి ఆ పనికి పనికి రాకుండా ఆపరేషన్ చేస్తూ ఉంటాడు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రిమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘యాసిడ్‘ (Acid). ఈ మూవీకి దీపక్ .కే దర్శకత్వం వహించాడు. ఒక భయంకరమైన యాసిడ్ దాడికి గురైన తర్వాత, రుహానా అనే యువతి తన జీవితాన్ని పునర్నిర్మించుకుని, తన కలలన్నింటినీ సాధించడానికి ప్రయత్నిస్తుంది. అలా అమ్మాయిలపై ఇటువంటి దాడులు చేస్తున్న వ్యక్తులపై, ఒక సైకో వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ కోసి వెళ్తూ ఉంటాడు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రిమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
ఒక అజ్ఞాత వ్యక్తి కొంతమందిని బంధించి ఆ పనికి, పనికి రాకుండా వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ కోసి ఆపరేషన్ చేస్తుంటాడు. వాళ్లను ఎవరైనా హాస్పిటల్ కి తీసుకు వెళ్తేనే బతుకుతారు. లేకపోతే తీవ్ర రక్తస్రావంతో చనిపోతారు. మరోవైపు సంధ్య అనే ఒక అమ్మాయి ఒక పొలిటికల్ లీడర్ కొడుకుని ప్రేమిస్తుంది. అతనితో ప్రేమతో పాటు అన్ని సమర్పించుకుంటుంది. ఆ తర్వాత ఆ పొలిటికల్ లీడర్ కొడుకు సంధ్యని దూరం పెడతాడు. అయితే సంధ్య స్నేహితురాలు నీతూ ఆమెకు ధైర్యం చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటుంది. ఇలా వీళ్ళిద్దరూ ఒక లాయర్ ని మీట్ అవుతారు. అయితే ఆ లాయర్ న్యాయం చేస్తానంటూ, పొలిటికల్ లీడర్ కొడుక్కి విషయం చెప్తాడు. ఆ తర్వాత నీతు మీద వాళ్ళు యాసిడ్ దాడి చేస్తారు. ఇలా అమ్మాయిలపై యాసిడ్ దాడి చేస్తున్న వాళ్ళను, ఆడవాళ్ళపై అఘాయిత్యం చేసే వాళ్లపై ఒక అజ్ఞాత వ్యక్తి, ఆ వ్యక్తుల ప్రైవేట్ పార్ట్ ను డ్యామేజ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఆ తర్వాత ఆ పనికి, పనికి రాకుండా పోతారు. పోలీసులు ఈ వ్యక్తిని పట్టుకోడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. అయితే ఆ వ్యక్తి పోలీసులకు దొరక్కుండా తన పని తానూ చేసుకుపోతూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఆ పొలిటికల్ లీడర్ కొడుకుని కూడా బంధిస్తాడు. చివరికి ఆ పొలిటికల్ లీడర్ కొడుక్కి బుద్ధి చెప్తాడా? పోలీసులు ఆ పని చేస్తున్న వ్యక్తిని పట్టుకుంటారా? అజ్ఞాత వ్యక్తి ఎందుకు ఇలాంటి పని చేస్తున్నాడు. ఈ విషయాల తెలుసుకోవాలి అనుకుంటే, ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రిమింగ్ అవుతున్న ‘యాసిడ్’ (Acid) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.