Indian Railway Viral Video: రైల్వేకు సంబంధించిన పలు వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. రైలు ఎక్కే సమయంలో, దిగే సమయంలో, పట్టాలు దాటుతున్న వేళ.. తృటిలో ప్రాణాలతో బయటపడిన పలు వీడియోలను తరచుగా చూస్తుంటాం. తాజాగా అలాంటిదే మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓ మహిళ క్షణం వ్యవధిలో ప్రాణాలతో బయటపడింది. సదరు మహిళ పట్టాలు దాటుతుండగా ఈ ఘటన జరిగింది.
రైలు హారన్ కొట్టడంతో అలెర్ట్ అయిన మహిళ
ఓ మహిళ ఎప్పటిలాగే మార్నింగ్ వాక్ చేస్తున్నది. ఆమె వెళ్లే మార్గంలో రైల్వే ట్రాక్ దాటాల్సి ఉంటుంది. రోజూ కామన్ గా ఆ ట్రాక్ దాటుతూ వెళ్తుంది. ఎప్పటి లాగే తాజాగా రైల్వే ట్రాక్ దాటుతుండగా, ఊహించని ఘటన ఎదురయ్యింది. నిత్యం వెళ్లే దారి కావడంతో పరధ్యానంలో ఉండి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నది. పక్కన ఏం జరుగుతుంది? అనే విషయాన్ని కూడా గమనించకుండా వాకింగ్ చేస్తూ ముందుకు కదువులుతున్నది. పట్టాలు దాటే సమయంలో అటు నుంచి రైలు వేగంగా దూసుకొచ్చింది. అయినప్పటికీ తను గమనించలేదు. దగ్గరికి వచ్చినా చూసుకోలేదు. చివరకు రైలు డ్రైవర్ హారన్ కొట్టడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పరిగెత్తుకుంటూ రైల్వే ట్రాక్ క్రాస్ చేసింది. కొద్దిక్షణాలు లేట్ అయినా, సదరు మహిళ ప్రాణాలు పోయేవి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
ఇక ఈ తతంగం అంతా అక్కడే ఉన్న కొంతమంది వీడియో తీశారు. దాన్న సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం తృటిలో ప్రాణాలతో తప్పించుకున్న మహిళ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది ఫన్నీగా కామెంట్స్ చేస్తుంటే, మరికొంత మంది ఆమె నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “అయ్యో.. ఆంటీ చక్కగా మార్నింగ్ వాకింగ్ చేస్తుంటే, అనవసరంగా రైలు వచ్చి డిస్టర్బ్ చేసింది కదా?” అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. “చావును దగ్గరగా చూడటం అంటే ఇదే కావచ్చు” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “రైల్వే ట్రాక్ మీద నడిచేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. రైలు దగ్గరికి వచ్చినప్పటికీ ఆమె గమనించడం లేదంటే ఎంత కేర్ లెస్ గా ఉందో అర్థం అవుతుంది” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “లోకో పైలెట్ హారన్ కొట్టాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే, ఆంటీ ఆయిపోయేది” అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. “ఈ వీడియోను చూసిన తర్వాత అయినా, రైల్వే ట్రాక్ క్రాస్ చేసే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది” అని మరో వ్యక్తి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వీడియో లక్షల వ్యూస్ అందుకుంది. వేలకు పైగా లైక్స్ పొందింది.