OTT Movies: ఇటీవల థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాల కంటే ఓటీటీ లో రిలీజ్ అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అందుకే ఎక్కువ మంది సినిమాలను ఓటీటీలో వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక మూవీ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం కొత్త సినిమాలను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు. ఈ మధ్య ఎక్కువగా వచ్చే అడ్వెంచర్, థ్రిల్లర్ సినిమాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కొన్ని వెబ్ సిరీస్ లు సైతం ఓటీటీ దూసుకుపోతున్నాయి. భారీ వ్యూస్ ను వసూల్ చేస్తున్నాయి. తాజాగా ఓ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చిన కొద్ది రోజులకే భారీ వ్యూస్ ను రాబడుతూ దుమ్ము దులిపేస్తుంది.. ఆ వెబ్ సిరీస్ పేరేంటో? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి తెలుసుకుందాం..
వెబ్ సిరీస్ & ఓటీటీ..
‘అడాల్‌సెన్స్’ అనే వెబ్ సిరీస్ ఈ మధ్య నెట్ ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అయితే ఇక్కడ స్ట్రీమింగ్ కు వచ్చిన మొదటి రోజు నుంచి మంచి వ్యూస్ ను రాబడుతుంది. స్టోరీ బాగుండడం తో ఈ సిరీస్ పై వరసగా ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా మరో రికార్డ్ ను బ్రేక్ చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన సిరీస్‌ల జాబితాలో టాప్‌లో నిలిచింది. ఇప్పటివరకూ 96.7 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఇప్పటివరకు టాప్‌లో కొనసాగుతోన్న స్ట్రేంజర్ థింగ్స్3 మరియు బ్రిడ్జర్టన్ సీజన్2 సిరీస్ ల వ్యూస్ ను ఇది బీట్ చేసిందనే చెప్పాలి..
ఇప్పటివరకు ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో టాప్ లో ఉన్న వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ టాప్‌లో ఉంది. మరికొన్ని రోజుల్లోనే ‘అడాల్‌సెన్స్’ దీన్ని అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.. గత నెల మార్చి 24న స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సిరీస్ కేవలం వారం లోపల మిలియన్ రాబట్టడం మామూలు విషయం కాదు. 93 దేశాల్లో టాప్‌లో కొనసాగడం విశేషం. సాధారణంగా 91 రోజుల్లో వచ్చిన వ్యూస్ ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ పాపులర్ సిరీస్‌ల జాబితాను సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్న ఈ సిరీస్ అతి కొద్ది రోజుల్లోనే నెంబర్ వన్ స్థానంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది..
స్టోరీ విషయానికొస్తే..
స్కూల్ లో ఓ బాలిక అత్యంత దారుణంగా హత్యకు గురవుతుంది. శరీరం పై ఏడు కత్తిపోట్లు ఉంటాయి. ఈ హత్యా నేరం కింద 13 ఏళ్ల జామీ ని పోలీసులు అరెస్టు చేస్తారు.. అతని రిమాండ్ తరలించి విచారిస్తారు. నిజంగానే అమ్మాయిని ఆ కుర్రాడు హత్య చేశాడా? ఎందుకు చేశాడు? చివరికి నిజం చెప్పాడా అనేది స్టోరీ… ఈ స్టోరీ కాస్త ఆసక్తికరంగా ఉండడం తో మంచి వ్యూస్ ని రాబడుతుంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ ట్రెండింగ్ లో ఉంది. ఇప్పటికే మిలియన్ వ్యూస్ ను అందుకున్న ఇది. ముందు ముందు ఎలాంటి వ్యూస్ ను రాబడుతుందో చూడాలి..