BigTV English

Prabhas: ఆ దర్శకుడికి ఫిదా అయిన ప్రభాస్.. సినిమా సెట్స్ పై ఉండగానే మరో ఛాన్స్?

Prabhas: ఆ దర్శకుడికి ఫిదా అయిన ప్రభాస్.. సినిమా సెట్స్ పై ఉండగానే మరో ఛాన్స్?

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి (Bahubali) తర్వాత ప్రభాస్ సినిమాలు భారీ అంచనాలతో వస్తున్నాయి. కానీ ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ ఫ్లాప్స్ చూడాల్సి వచ్చింది. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన సాహో మూవీ నార్త్‌ బెల్ట్‌లో ఆడిన.. తెలుగుతో పాటు మిగతా భాషల్లో ఫ్లాప్ అయింది. ఆ తర్వాత వచ్చిన రాధకృష్ణ డైరెక్షన్‌లో చేసిన ‘రాధేశ్యామ్’ కూడా నిరాశ పరిచింది. ఈ సినిమాల దర్శకులిద్దరు కూడా అంతకుముందు ఒక్క సినిమా చేసిన అనుభవం ఉన్న వారే. బాహుబలి సెట్స్ పై ఉండగానే.. సుజీత్, రాధాకృష్ణకు మాటిచ్చాడు డార్లింగ్. అందుకే బాహుబలి లాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత వారితో సినిమాలు చేశాడు. ఇక ఓం రౌత్‌ను నమ్ముకొని బాలీవుడ్‌లో చేసిన ‘ఆదిపురుష్’ ఏ మాత్రం మెప్పించలేకపోగా.. విమర్శలకు దారితీసింది. ఇక ట్రోలింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక ప్రశాంత్ నీల్‌తో చేసిన సలార్ సినిమాతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు రెబల్ స్టార్. ఆ తర్వాత ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో మరోసారి వెయ్యి కోట్ల సినిమా ఇచ్చాడు. నెక్స్ట్ రానున్న అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్నాయి. అలాగే.. వరుస పెట్టి సినిమాలు కమిట్ అవుతున్నాడు ప్రభాస్. ఈ క్రమంలో ఓ దర్శకుడికి ఫిదా అయిన డార్లింగ్.. సినిమా సెట్స్ పై ఉండగానే.. ఆయనకు మరోసారి ఛాన్స్ ఇచ్చినట్టుగా సమాచారం.


మరోసారి ఫౌజీ కాంబినేషన్?

ప్రస్తుతం ప్రభాస్ కమిట్ అయిన సినిమాల్లో ది రాజా సాబ్ (The Raja Saab)తో పాటు.. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ (Spirit), సలార్: పార్ట్ 2 – శౌర్యాంగ పర్వం (Salaar: Part 2 – Shouryanga Parvam), కల్కి 2898 ఏడీ పార్ట్ 2 (Kalki 2898 AD Part 2) ఉన్నాయి. అలాగే.. సీతారమం దర్శకు హను రాఘవపూడితో ఓ సినిమా చేస్తున్నాడు. రాజాసాబ్ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. దీంతో.. ప్రస్తుతం ప్రభాస్ ఫోకస్ అంతా ఫౌజీ మీదే ఉంది. కుదిరితే ఇదే ఏడాదిలో హను సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ఒక పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఇది 1940ల నేపథ్యంలో సాగే కథ అని సమాచారం. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఒక సైనికుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇది యద్ధంలో పుట్టిన ప్రేమకథ అనే టాక్ కూడా ఉంది. ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. కానీ అప్పుడే.. హను రాఘవపూడికి ప్రభాస్ మరో ఛాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.


అడ్వాన్స్ కూడా..?

ప్రభాస్‌కు హను రాఘవపూడి వర్కింగ్ స్టైల్ బాగా నచ్చిందట. తనని హ్యాండిల్ చేస్తున్న విధానాని ఫిదా అయ్యాడట. అలాగే.. ఫౌజీ అవుట్‌పుట్‌ను చూసి ప్రభాస్ చాలా హ్యాపీగా ఉన్నాడట. దీంతో.. హనుతో మరో సినిమా చేయడానికి ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. అసలు ఈ ప్రాజెక్ట్‌ను సెట్ చేసింది కూడా ప్రభాసేనని అంటున్నారు. అంతేకాదు, ఒక అగ్ర నిర్మాతతో హనుకు అడ్వాన్స్ కూడా ఇప్పించాడని సమాచారం. అయితే, ఈ నిర్మాత ఎవరనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. కానీ ఇప్పట్లో ఈ సినిమా సాధ్యమేనా? అనేది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే.. ఫౌజీ అయిపోయిన వెంటనే ఇమ్మీడియేట్‌గా స్పిరిట్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు డార్లింగ్. ఆ తర్వాత కల్కి 2 స్టార్ట్ కానుంది. నెక్స్ట్ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమా పూర్తి చేసి సలార్ 2 మొదలు పెట్టే ఛాన్స్ ఉంది. ఇక ఈ లిస్ట్‌లో లోకేష్ కనగరాజ్ సినిమాతో పాటు.. ప్రశాంత్ వర్మ ‘బ్రహ్మరాక్షస్’ కూడా ఉంది. కాబట్టి.. ఇప్పట్లో ప్రభాస్-హను కాంబినేషన్ ఉండే ఛాన్స్ లేదు. అయితే.. ఇక్కడ మరో డౌట్ ఏంటి అంటే? ఫౌజీ సినిమాకు ఏమైనా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా.. ప్రభాస్‌కు దర్శకుడు నచ్చితే మాత్రం వదిలిపెట్టడనే చెప్పాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×