BigTV English

Cat’s Eyes: రాత్రి వేళ రోడ్డుపై మెరిసే ఈ లైట్లు కరెంటు లేకుండా ఎలా పనిచేస్తాయో తెలుసా?

Cat’s Eyes: రాత్రి వేళ రోడ్డుపై మెరిసే ఈ లైట్లు కరెంటు లేకుండా ఎలా పనిచేస్తాయో తెలుసా?

BIG TV LIVE Originals: చాలా మంది రాత్రిపూట ప్రయాణాలు చేస్తుంటారు. ఆ సమయంలో రోడ్డు మీద చిన్న చిన్న మెరిసే లైట్లు కనిపిస్తాయి. కారు, ఇతర వాహనాల లైట్లు వాటికి తగిలినప్పుడు ఒక్కసారిగా వెలుగుతాయి. వీటిని క్యాట్ ఐస్ లేదంటే రిప్లెక్టివ్ రోడ్ స్టడ్స్ అంటారు. చీకటిలో, వాతావరణం సరిగా లేని సమయంలో ఈ లైట్లు బాగా ఉపయోగపడుతాయి. రోడ్డు మార్గాన్ని స్పష్టంగా చూపించడానికి సాయం చేస్తాయి. ఇంతకీ ఈ క్యాట్ ఐస్ కరెంట్ లేకుండా ఎలా పని చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..


క్యాట్ ఐస్ నిర్మాణం:

⦿ రిఫ్లెక్టివ్ లెన్స్: క్యాట్ ఐస్ లో గ్లాస్ లేదంటే ప్లాస్టిక్‌ తో చేసిన రిఫ్లెక్టివ్ లెన్స్‌ ఉంటాయి. ఇవి కాంతిని ప్రతిబింబించేలా రూపొందించబడతాయి. వీటి మీద లైట్ పడగానే, అదే వెలుతురు రిఫ్లెక్ట్ అయ్యేలా చేస్తాయి.


⦿ బేస్ మెటీరియల్: సాధారణంగా రిప్లెక్టివ్ స్టడ్స్‌ను రబ్బర్, ప్లాస్టిక్ లేదంటే మెటల్‌ తో తయారు చేస్తారు. ఇవి రోడ్డుపై గట్టిగా ఫిక్స్ చేయబడతాయి. వాహనాల బరువును తట్టుకునేలా వీటిని రోడ్డు మీద ఏర్పాటు చేస్తారు.

ఒక్కో రంగు.. ఒక్కో గుర్తు..

రిప్లెక్టివ్ స్టడ్స్ పలు రకాల రంగుల్లో కనిపిస్తాయి. ఒక్కో రంగు వాహనదారులకు ఒక్కో విషయాన్ని వెల్లడిస్తాయి.

⦿ తెలుపు: ఇది లేన్ మార్కింగ్ ను చూపిస్తుంది.

⦿ ఎరుపు: రాంగ్ సైడ్ లేదంటే రోడ్డు ముగింపు విషయాన్ని గుర్తు చేస్తుంది.

⦿ పసుపు: ఇవి రోడ్డు మధ్యలో ఉంటాయి.

⦿ ఆకుపచ్చ: ఇవి ఎంట్రీ, ఎగ్జిట్ విషయాలను సూచిస్తాయి.

రిప్లెక్టివ్ రోడ్ స్టడ్స్ ఎలా పనిచేస్తాయి?

⦿ రిఫ్లెక్షన్ సూత్రం: వాహనాల హెడ్‌ లైట్ల నుంచి వచ్చే కాంతి ఈ స్టడ్స్‌ లోని రిఫ్లెక్టివ్ లెన్స్‌ పై పడుతుంది. ఈ లెన్స్‌ లైట్ ను తిరిగి డ్రైవర్ వైపు ప్రతిబింబిస్తాయి. దీని వల్ల రోడ్డు మార్కింగ్‌ లు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ సూత్రాన్ని రెట్రో రిఫ్లెక్షన్ గా పిలుస్తారు.

⦿ సెల్ఫ్ క్లీనింగ్: లేటెస్ట్ రోడ్ స్టడ్స్ రబ్బర్ బేస్‌ తో తయారవుతాయి. ఇవి వాహనాలు  మీద నుండి వెళ్ళినప్పుడు కొద్దిగా కదులుతాయి. ఈ కదలిక దుమ్ము, ధూళిని తొలగించి, లెన్స్‌ ను శుభ్రంగా ఉంచుతుంది.

⦿ సోలార్-పవర్డ్ స్టడ్స్: కొన్ని ఆధునిక రోడ్ స్టడ్స్‌ లో సోలార్ ప్యానెల్స్, LED లైట్లు ఉంటాయి. ఇవి పగటిపూట సౌరశక్తిని గ్రహించి, రాత్రిపూట స్వయంగా మెరుస్తాయి. ఇవి ఎక్కువగా హైవేలు, పొగమంచు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉపయోగిస్తారు.

రిప్లెక్టివ్ రోడ్ స్టడ్స్ ప్రయోజనాలు

⦿ రాత్రి సమయంలో రోడ్డు క్లియర్ గా కనిపించేందుకు సాయపడుతాయి.

⦿ పొగమంచు, వర్షం లాంటి పరిస్థితుల్లో కూడా రోడ్డు స్పష్టంగా కనిపించేలా చేస్తాయి.

⦿ డ్రైవర్లకు లేన్ డిసిప్లిన్, రోడ్డు బౌండరీస్ ను అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి.

పిల్లి కళ్లను ఆదర్శనంగా తీసుకుని..  
క్యాట్స్ ఐస్ ను 1934లో బ్రిటిష్ పరిశోధకుడు పెర్సీ షా రూపొందించారు. రాత్రిపూట పిల్లి కళ్ళు కాంతిని ప్రతిబింబించడం చూసి ఆయనకు ఈ ఆలోచన వచ్చింది.

హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.

Read Also: ఐఆర్సీటీసీ ఇ-వాలెట్.. స్వరైల్ యాప్ లో పనిచేస్తుందా? ఎలా వాడాలి?

Related News

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Hill Stations: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!

Big Stories

×