BigTV English

Aishwarya Rajesh Suzhal:The Vortex2: పోస్టర్ తోనే క్యూరియాసిటీ పెంచేసిన ఐశ్వర్య.. ఈసారి అంతకుమించి..!

Aishwarya Rajesh Suzhal:The Vortex2: పోస్టర్ తోనే క్యూరియాసిటీ పెంచేసిన ఐశ్వర్య.. ఈసారి అంతకుమించి..!

Aishwarya Rajesh Suzhal:ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh ).. ఈ హీరోయిన్ పేరు చెబితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమానే గుర్తు చేసుకుంటున్నారు. భాగ్యం వంటి ఒక అద్భుతమైన పాత్రలో నటించిన ఐశ్వర్య రాజేష్ కి ఈ సినిమాతో టాలీవుడ్ లో ఒక మంచి హిట్ పడిందని చెప్పుకోవచ్చు.అయితే ఇప్పటికే కొన్ని తెలుగు సినిమాల్లో ఐశ్వర్య రాజేష్ నటించినప్పటికీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా అంత హిట్ అయితే రాలేదు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఐశ్వర్య రాజేష్ కి మంచి పేరు వచ్చింది.ఐశ్వర్య రాజేష్ తెలుగు హీరోయిన్ అయినప్పటికీ తమిళంలోనే చాలా పాపులర్ అయింది. అయితే అలాంటి ఐశ్వర్య రాజేష్ గురించి తాజాగా ఒక గుడ్ న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే ఐశ్వర్య రాజేష్ నటించిన హిట్ వెబ్ సిరీస్ కి సీక్వెల్ తీస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విషయాన్ని వెబ్ సిరీస్ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.


సుజల్: ది వోర్టెక్స్ 2 తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఐశ్వర్య..

మరి ఇంతకీ ఐశ్వర్య రాజేష్ నటించి, హిట్ కొట్టిన వెబ్ సిరీస్ ఏంటి? అంటే.. సుజల్: ది వోర్టెక్స్ (Suzhal:The Vortex).. ఐశ్వర్య రాజేష్, కథిర్ కీలక పాత్రలో శ్రియా రెడ్డి, పార్తిబన్, నివేదిత,హరీష్ ఉత్తమన్ వంటి సెలబ్రిటీలు ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలు పోషించారు. మురుగేయన్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ను వాల్ వాచర్ ఫిలిం బ్యానర్ పై గాయత్రి పుష్కర్ నిర్మించారు. అలా 2022 జూన్ 17న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిన సుజల్ : ది వోర్టెక్స్ సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ వెబ్ సిరీస్ ఏకంగా 30 భాషల్లో విడుదలై సంచలనం సృష్టించింది. అయితే ఈ మధ్యకాలంలో హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్, ప్రీక్వెల్స్ తీయడం బాగా ట్రెండ్ అయిపోయింది. అయితే దాదాపు 30 భాషల్లో హిట్ అయిన సుజల్ : ది వోర్టెక్స్ వెబ్ సిరీస్ కి కూడా తాజాగా సీక్వెల్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. సుజల్:ది వోర్టెక్స్ -2 పేరుతో ఈ వెబ్ సిరీస్ రాబోతోంది.


పోస్టర్ తో క్యూరియాసిటీ పెంచేసిన మేకర్స్..

ఈ మేరకు తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్లో.. ఒక జాతర లాంటి లొకేషన్ కనిపిస్తూ వుండగా అందులో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh ), కథిర్ (Kathir) ఇద్దరూ చాలా కోపంగా చూస్తున్న పోస్టర్ ని రిలీజ్ చేశారు.ఇక ఈ పోస్టర్లో ఐశ్వర్య రాజేష్, కథిర్ వెనుక నలుపు, ఎరుపు రంగు బొట్లు పెట్టుకొని కళ్ళకు కాటుక పెట్టుకొని అచ్చం కాంతారా లాంటి గెటప్ తో ఉన్న మొహాన్ని కూడా చూపించారు.అలా తాజాగా సుజల్:ది వోర్టెక్స్ -2(Suzhal:The Vortex -2) కి సంబంధించి పోస్టర్ ని రిలీజ్ చేయడంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ వెబ్ సిరీస్ తెలుగు, మలయాళ, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో ఫిబ్రవరి 28 నుండి స్ట్రీమింగ్ కాబోతున్నట్టు తెలుస్తోంది.ఇక తాజాగా విడుదల చేసిన సుజల్ ది వోర్టెక్స్ -2 వెబ్ సిరీస్ పోస్టర్ భయంకరంగా ఉండడంతో చాలామందిని ఆకట్టుకుంటుంది. ఈ వెబ్ సిరీస్ లో ముందు ఉన్న పాత్రలను కొనసాగిస్తూ వీరికి తోడుగా కాయల్ చంద్రన్, మంజిమా మోహన్ వంటి సెలబ్రిటీలు కూడా గెస్ట్ పాత్రలు పోషించబోతున్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనప్పటికీ సుజల్: ది వోర్టెక్స్ -2 పోస్టర్ (Suzhal: The Vortex-2 Poster) తోనే అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచేశారు.

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×