BigTV English

Prudhvi Raj: హాస్పిటల్ బెడ్ పై పృథ్వీ రాజ్.. డ్రామా మొదలు

Prudhvi Raj: హాస్పిటల్  బెడ్ పై పృథ్వీ రాజ్.. డ్రామా మొదలు

Prudhvi Raj: చేసిందంతా చేసి.. ఏమి తెలియనట్లు హాస్పిటల్ బెడ్ పై ఉన్నాడు నటుడు 30 ఇయర్స్ పృథ్వీ రాజ్. మూడు రోజుల క్రితం లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వైసీపీ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యేలా చేశాడు. మేకల సత్తిగా నేను చేశాను. మేకలు ఎన్ని ఉన్నాయని షార్ట్ మధ్యలో అడిగితే 150 ఉన్నాయని చెప్పారు. యాదృచ్ఛికమో ఏమో కానీ సినిమా చివర్లో లెక్కిస్తే కరెక్ట్ గా 11 గొర్రెలే ఉన్నాయని తెలిపారు. ఇదేంటో అర్థం కాలేదని, అన్నీ సినిమాల్లో బ్రహ్మాండంగా పెట్టారు అంటూ మాట్లాడి.. వైసీపీ నేతలకు, అభిమానులకు కోపం తెప్పించాడు. అనుకున్నట్లుగానే  వైసీపీ అభిమానులు.. బాయ్ కాట్ లైలా అంటూ కొత్త ట్రెండ్ ను మొదలుపెట్టారు.


ఇక పృథ్వీ చేసిన  పనికి విశ్వక్ సేన్ సారీ చెప్పాడు. తన సినిమాను చంపేయకండి అంటూ ఎమోషనల్ అయ్యాడు. “మా ఈవెంట్ లో జరిగిన దానికి మేము క్షమాపణలు చెబుతున్నాము. సినిమాలో ఎవరో ఒకరు తప్పు చేస్తే మిగిలిన వాళ్ళు కూడా తప్పు చేసినట్టేనా.. పృథ్వీ మాట్లాడిన మాటల గురించి మాకు తెలియదు. ఆయన మాట్లాడిన మాటలకు, మా సినిమాకు ఎటువంటి సంబంధం లేదు. పృథ్వీ మాట్లాడిన దానికి సోషల్ మీడియాలో 25 వేల ట్వీట్స్ పెట్టారు. సినిమా బ్రతకాలా? వద్దా..? మేము చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడాడు. అది మా కంట్రోల్లో జరగలేదు” అంటూ చెప్పుకొచ్చాడు.

Laila: లైలానే నా కొత్త పిన్ని.. వెంకటేష్ రీల్ కొడుకు రచ్చ


అయితే  వైసీపీ అభిమానులు మాత్రం అస్సలు తగ్గేదేలే అని ఇంకా మంకు పట్టు పట్టుకొని కూర్చున్నారు. దమ్ముంటే చిత్రబృందం మొత్తం పృథ్వీని తీసుకొచ్చి బహిరంగంగా క్షమాపణలు చెప్పించమని  డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పృథ్వీ హాస్పిటల్ పాలవ్వడం మరింత సంచలనంగా మారింది. హైబీపీ కారణంగా  పృథ్వీని హాస్పిటల్ లో చేర్పించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.ప్రస్తుతం ఆయన  ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం.

పృథ్వీ హాస్పిటల్ లో ఉన్నా కనికరించేది లేదని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.   అదంతా డ్రామా  అని చెప్పుకొస్తున్నారు. మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు అడగాల్సి వస్తుందని పృథ్వీ ఇలా డ్రామాలు మొదలుపెట్టాడని  అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది  తెలియాల్సి ఉంది.

ఇక లైలా సినిమా విషయానికొస్తే.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న చిత్రం  లైలా. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై  సాహు గారపాటి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో విశ్వక్ సరసన  ఆకాంక్ష శర్మ నటిస్తోంది. ఫిబ్రవరి 14 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై విశ్వక్ చాలా ఆశలను పెట్టుకున్నాడు. పృథ్వీ చేసిన కామెంట్స్  వలన..  లైలా  సినిమాకు నెగిటివిటీ ఏర్పడింది. ఈ ఎఫెక్ట్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మరి ఈ సినిమా విశ్వక్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×