Kadapa Breaking : కడప జిల్లాలోని కోడూరు మండలంలోని ఓ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పొలం పనులు చేసుకుంటూ జీవనం సాధించే ఓ కుటుంబంపై విద్యుత్ మోటార్ రూపంలో మృత్యువు వెంటాడింది. చిన్నపాటి రిపేర్ అంటూ విద్యుత్ మోటారు ముట్టుకోవడంతో.. అప్పటి వరకు బాగానే ఉన్న తల్లీ కొడుకులు.. ఒక్కసారిగా విగత జీవులుగా మారిపోయారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పొలం గట్టుపైనే విగహ జీవులుగా పడి ఉన్న తల్లి కొడుకుల్ని చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎవరికీ ఎలాంటి దౌర్భాగ్యంగా రాకుండదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వారికి రోజూ పొలానికి వెళ్లడం, పంటలను బిడ్డల్లా సాధుకోవడంమే వచ్చు. రోజూ గంటల తరబడి పోలాల్లోనే శ్రమించే ఆ కష్టజీవులు.. ఎప్పుడో పొద్దుపోయాక కానీ ఇళ్లు చేరరు. ఏడాది చివర్లో వచ్చే ప్రతిఫలం కోసం ఏడాదంతా కష్టపడుతుంటారు. అలాంటి వారికి.. పొలాలే ప్రాణం, పంటలే ఆధారం. అందుకే.. ఆ పంట పొలాల్లోనే వారి ఆయువు తీసేయాలని భగవంతుడు అనుకున్నాడో ఏమో కానీ.. విద్యుత్ రూపంలో వారికి ఎదురై నిండు ప్రాణాలను బలిగొన్నాడు. వారి విషాధ విషయం తెలిసి.. ఆ గ్రామస్థులతో పాటు విషయం తెలిసిన వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కడప జిల్లాలోని బీ.కొడూరు మండలంలోని గుంతపల్లి గ్రామానికి చెందిన కూరాకు జయరాం రెడ్డి (48).. వ్యవసాయం చేస్తున్నాడు. సొంత గ్రామానికి దగ్గర్లోనే కొంత సాగు భూమి ఉంది. ఆ భూమిలో పంటలు పండించుకుని జీవనం సాగించే జయరాం.. దగ్గర్లోని తెలుగు గంగా కాలుల నుంచి మోటారు సాయంతో పొలానికి నీళ్లు పారిస్తున్నాడు. పంటలు చివరి దశకు వచ్చిన నేపథ్యంలో.. నీళ్లు పెడుతున్న జయరాం, అనుకోని ప్రమాదంలో చిక్కుకుపోయాడు. అతని కోసం వెళ్లిన తల్లి సైతం ఆ ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు విడిచింది.
కాలువలో విద్యుత్ మోటార్ సాయంతో నీళ్లు నడుపుతున్నాడు. అప్పటి వరకు భాగానే ఉన్న మోటార్ ఆగిపోవడంతో రిపేర్ చేసేందుకు జయరాం వెళ్లాడు. చిన్నపాటి రిపేర్ కావడంతో.. విద్యుత్ సిబ్బందిని పిలిస్తే ఆలస్యం అవుతుంది అని.. తానే బాగు చేసేందుకు సిద్దమయ్యాడు. సాధారణంగా.. సాగు చేస్తున్న వారికి ఇలాంటివి అవగాహన ఉంటుంది. అదే ధైర్యంతో చిన్నపాటి రిపేర్ ను సరిచేస్తున్న క్రమంలో.. జయరాం విద్యుత్ షాక్ కు గురయ్యాడు. హై వోల్టెజ్ విద్యుత్ కావడంతో.. మోటార్ కి అతుక్కుపోయి.. క్షణాల్లోనే గిలగిల కొట్టుకున్నాడు. అది చూసిన అతని తల్లి గురమ్మ( 60) అతన్ని కాపాడేందుకు వెళ్లింది. విద్యుత్ షాక్ తో విలవిలలాడుతున్న వ్యక్తిని పట్టుకోవడంతో.. ఆమె విద్యుత్ షాక్ కు గురయ్యింది.
నీళ్లుపెట్టేందుకు వెళ్లిన జయరాం.. విద్యుత్ షాక్ తో గిలగిల కొట్టుకోవడం చూసిన తల్లి గురమ్మ విలవిల్లాడిపోయింది. కళ్లముందే చెట్టంత కొడుకు కరెంట్ షాక్ తో ప్రాణాలు విడుస్తుంటే చూసి తట్టుకోలేకపోయింది. అతన్ని ఎలాగైనా కాపాడాలని వెళ్లి తాను మృత్యువు నోట్లో తలపెట్టింది. ఈ ఘటనలో తల్లి కొడుకులు ఇద్దరూ.. ప్రాణాలు విడిచి, విద్యుత్ మోటారు దగ్గరే ప్రాణాలు విడిచిపెట్టారు. తల్లి కొడుకులు ఇద్దరూ ఒకేసారి చినిపోవడంతో. ఆ పరిసర ప్రాణాల్లో తీవ్ర విషయం అలుముకుంది. కాగా.. ఘటనపై బీ. కోడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.