E-Paper
Advertisement

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చిన న్యూటన్స్ థర్డ్ లా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చిన న్యూటన్స్ థర్డ్ లా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Advertisement

Newtons 3rd Law OTT: ఈ మధ్యకాలంలో థియేటర్లలో విడుదలైన ఎన్నో చిత్రాలు నాలుగు వారాల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కి వస్తూ అభిమానులను సర్ప్రైజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా క్రైమ్, హార్రర్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలకు ఇప్పుడు ప్రేక్షకులలో ప్రత్యేకమైన ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఊహించని ట్విస్ట్ లు, మర్డర్ మిస్టరీలు , పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సాగే కథలకు కూడా ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు అలాంటి ఒక ఆసక్తికరమైన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘న్యూటన్స్ థర్డ్ లా’ సైలెంట్ గా ఓటీటీ లోకి వచ్చేసి అభిమానులను సర్ప్రైజ్ చేసింది.

రెండు ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లలో.. వేరువేరు తేదీలలో..

అక్కినేని సుమంత్ (Akkineni Sumanth) హీరోగా ఇటీవల థియేటర్లలో విడుదలైన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ న్యూటన్స్ థర్డ్ లా.. ఈ సినిమా తాజాగా నెల రోజుల్లోనే ఓటీటీ బాట పట్టింది. ముఖ్యంగా తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ లో ఆగస్టు 27న స్ట్రీమింగ్ కి రాగా, ఆగస్టు 28 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా తెలుగు, తమిళ్ ,మలయాళం , కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కి రావడం గమనార్హం.

న్యూటన్స్ థర్డ్ లా మూవీ నటీనటులు..

Advertisement

థియేటర్లలో మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. ఇలాంటి థ్రిల్లర్ కథలు ఓటీటీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందనే ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి రాజేష్ ఖన్నా దర్శకత్వం వహించగా.. సుమంత్ తో పాటు సీనియర్ నటుడు జగపతిబాబు, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు. రవి వర్మ, త్రినాథ్ వర్మ, నేహా పఠాన్, షెల్లీ ఎన్ కుమార్, రూపేష్, హరిని రావు, పండిట్ గౌతమ్ , అభినయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సింజిత్ ఎర్రమల్లి సంగీతం అందించగా, హరీష్ కొహిర్కర్ నిర్మించారు.

ALSO READ: టాక్సిక్’ ఫ్లాప్ పై నయనతార క్రేజీ రియాక్షన్!

సినిమా స్టోరీ..

Advertisement

ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఈ సినిమా కథ మొత్తం ఒక అనుమానాస్పద మరణం చుట్టూ తిరుగుతుంది. ఇంజనీరింగ్ విద్యార్థి వినయ్ (త్రినాథ్ వర్మ) ఒకరోజు ఇంటి పైనుంచి పడి మృతి చెందుతాడు. మొదట ఇది సాధారణ ప్రమాదమా? లేక ఆత్మహత్య ? అనే సందేహాలు వ్యక్తం అవుతాయి. అయితే కేసు దర్యాప్తులో ఊహించని మలుపు చోటు చేసుకుంటుంది. వినయ్ మృతదేహానికి నిర్వహించిన పోస్ట్ మార్టం నివేదికలో అతని తలలో బుల్లెట్టు ఉన్నట్లు బయటపడుతుంది. దీంతో ఈ కేసు సాధారణ ప్రమాదం కాదని స్పష్టం అవుతుంది. ఇక ఈ మిస్టరీని ఛేదించేందుకు పోలీస్ ఆఫీసర్ వాసుదేవ్ (సుమంత్) రంగంలోకి దిగుతాడు. దర్యాప్తు ప్రారంభించిన కొద్ది వినయ్ జీవితం వెనుక దాగివున్న రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే కొద్దీ మరో కొత్త ట్విస్ట్ బయటపడేలా దర్శకుడు ఈ కథను చాలా అద్భుతంగా రూపొందించారు. థియేటర్లలో మిశ్రమ స్పందన అందుకున్న ఈ సినిమా ఇటు ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.

Related News

వందల అడుగుల ఎత్తులో ప్రాణాలతో పోరాటం… ప్రాణాంతక వ్యాధికి మందు కనిపెడితే ఇదా బహుమతి ? ఈ సర్వైవల్ థ్రిల్లర్ నెక్స్ట్ లెవల్

ప్రాణంగా ప్రేమించిన వాడిని పొట్టన పెట్టుకునే వైరస్… కన్నీళ్ళు పెట్టించే ఎమోషనల్ లవ్ స్టోరీ

భూమిని నాశనం చేయాలని దిగివచ్చే దేవుడు… డ్రాగన్ బాల్ ఫ్యాన్స్‌కు కొత్త యానిమే ట్రీట్

ముప్పైల్లో హార్మోన్ల గోల… నవ్వలేక చస్తారు… నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్త స్టాండప్ స్పెషల్

లవర్ కి బ్రేకప్… కట్ చేస్తే మాజీ ప్రియుడితో మళ్లీ కనెక్షన్… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ లవ్ ట్రయాంగిల్

రేపు ఒక్కరోజే ఓటీటీలోకి 2 సినిమాలు, 1 వెబ్‌సిరీస్, మోస్ట్ అవైటెడ్ రియాలిటీ షో… అన్నీ తెలుగులోనే

ప్రెగ్నెన్సీ లోనూ తగ్గేదేలే.. సమంత కొత్త అవతారం అదుర్స్!

కారు వద్దు బాబోయ్.. ముందు నా చలాన్లు కట్టండి! దర్శకుడు బాబు కామెంట్స్ వైరల్

Big Stories

Advertisement
×