Nayanthara: మలయాళ లేడీ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ (Geethu Mohan Das) దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) హీరోగా కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా, నయనతార (Nayanthara), తారా సుతారియా (Tara sutharia), రుక్మిణి వసంత్(Rukmini Vasanth), హుమా ఖురేషి (Huma Qureshi) తదితరులు కీలకపాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం టాక్సిక్(Toxic). కే జి ఎఫ్ 2 లాంటి బ్లాక్ బాస్టర్ సక్సెస్ తర్వాత యశ్ ప్రకటించిన సినిమా కావడంతో రెండేళ్ల నుంచి ఈ సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఊహించని బజ్ క్రియేట్ చేశాయి. కానీ సినిమా విడుదలైన తర్వాత ఎవరు ఊహించని విధంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం గమనార్హం.
ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్స్ కారణంగానే ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో ప్రీ సేల్ బుకింగ్స్ జరిగాయి. దానికి తగ్గట్టుగానే తొలిరోజు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. కానీ మొదటి షో నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో తర్వాతే రోజుల్లో ఈ సినిమాకు కలెక్షన్లు ఆ రేంజ్ లో లభించడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమాలో గంగ పాత్రతో అందరి దృష్టిని ఆకట్టుకున్న నయనతార.. రీసెంట్ గా టాక్సిక్ ఫ్లాప్ పై క్రేజీ రియాక్షన్ ఇచ్చింది.
also read:రకుల్ కొత్త ఫిలాసఫీ.. ట్రెండీ ఔట్ఫిట్ తో ఆకట్టుకునే లుక్స్!
ప్రస్తుతం ఈమె హాయ్ అనే చిత్రంలో హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా.. అందులో తనకు టాక్సిక్ ఫ్లాప్ పై ప్రశ్న ఎదురయింది. ఈ నేపథ్యంలోనే టాక్సిక్ సినిమా డిజాస్టర్ గా నిలవడంపై స్పందిస్తూ.. “ప్రతిదీ మనకు ఒక ప్రాథమిక అవగాహనే.. ముఖ్యంగా ఒక సినిమాను ఎలా తీస్తారు అనే దానిపై ఇండస్ట్రీలో ఉండే అనుభవం మనకు ఒక ప్రాథమిక అవగాహనను కలిగిస్తుంది. సినిమా అనేది ఎంతో భావోద్వేగభరితమైనది. అలాగే ఊహించని మలుపులతో కూడుకున్నది కూడా.. నిజానికి నా కెరియర్ లో నేను ఎన్నో ఆశలు పెట్టుకొని ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది అని నమ్మిన కొన్ని సినిమాలు నేను ఆశించినంత విజయం అందుకోలేకపోయాయి. అదే సమయంలో కొన్ని చిత్రాల ఫలితాలపై నాకే అనుమానం ఉండేది. కానీ అవి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచాయి. కాబట్టి ఇప్పటివరకు నేను అనుకున్నది ఏది అంత ఈజీగా జరగలేదు” అంటూ చెప్పుకొచ్చింది.
“చిత్ర పరిశ్రమలో సంవత్సరాల తరబడి సాగిన నా అనుభవం నాకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పించింది. ఒక సినిమా విజయం అయినా పరాజయం అయినా సరే రెండింటిని ఒకే విధంగా చూడమని.. వినయంతో స్వీకరించడం నేర్చుకుంటేనే జీవితంలో ముందడుగు వేయగలవు అని నేర్పించింది” అంటూ తెలిపింది. మొత్తానికైతే ఎన్నో ఆశలు పెట్టుకున్న టాక్సిక్ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ఓటమిని అంతే హుందాగా స్వీకరించి మరోసారి లేడీ సూపర్ స్టార్ అని నిరూపించుకుంది ఈ ముద్దుగుమ్మ.
మరోవైపు నయనతార విష్ణు దర్శకత్వంలో కవిన్ హీరోగా నటించిన తమిళ రొమాంటిక్ డ్రామా చిత్రం హాయ్ లో కూడా నటించింది. కామెడీ, డ్రామా , రొమాంటిక్ జానర్ లో వచ్చిన ఈ చిత్రానికి జెన్ మార్టిన్ సంగీతం అందించారు.