BigTV English

Jigra OTT: ఓటీటీలోకి ‘జిగ్రా’ మూవీ.. ఎప్పుడు, ఎక్కడంటే?

Jigra OTT: ఓటీటీలోకి ‘జిగ్రా’ మూవీ.. ఎప్పుడు, ఎక్కడంటే?

Jigra OTT: బాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్ 1 హీరోయిన్‌గా చలామణీ అవుతోంది ఆలియా భట్. ప్రస్తుతం స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో, భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ఆలియా భట్‌కు పోటీగా బీ టౌన్‌లో అసలు హీరోయిన్సే లేరు అని ఫ్యాన్స్ అంటున్నారు. తాజాగా ‘జిగ్రా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆలియా.. ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇంతలోనే ఈ సినిమా ఓటీటీ రైట్స్ గురించి, స్ట్రీమింగ్ గురించి సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. అసలు ఆలియా భట్ నటించిన ‘జిగ్రా’ మూవీ ఏ ఓటీటీలో వస్తుంది? ఎప్పటినుండి స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది అనే విషయాలు హాట్ టాపిక్‌గా మారాయి.


ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే

ఆలియా భట్ హీరోయిన్‌గా నటించిన ‘జిగ్రా’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మూవీ విడుదలకు ముందే భారీ మొత్తాన్ని ఇచ్చి మరీ దీని ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుందట నెట్‌ఫ్లిక్స్. ఇక బాలీవుడ్‌లో ఏ సినిమా విడుదలయినా కూడా దానిని వెంటనే ఓటీటీలో వదలడానికి మేకర్స్ అంగీకరించడం లేదు. ముఖ్యంగా ఆ సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కనీసం రెండు నెలల వరకు ఓటీటీ విడుదలను లేట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. దాన్నిబట్టి చూస్తే ‘జిగ్రా’కు బ్లాక్‌బస్టర్ టాక్ వస్తుంది కాబట్టి కచ్చితంగా కనీసం రెండు నెలలు అయినా దీని ఓటీటీ స్ట్రీమింగ్ లేట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి.


Also Read: ‘జిగ్రా’ కలెక్షన్స్ అంతా ఫేక్, ప్రేక్షకులను ఫూల్ చేస్తున్నారు.. ఆలియా భట్‌పై హీరోయిన్ అటాక్

కలెక్షన్స్ పెరిగాయి

అక్టోబర్ 11న ‘జిగ్రా’ మూవీ థియేటర్లలో విడుదలయ్యింది కాబట్టి నవంబర్ ఎండింగ్ అయినా, డిసెంబర్ స్టార్టింగ్ అయినా ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అంటే థియేటర్లలో ఈ మూవీ మిస్ అయ్యేవారు అప్పటివరకు ‘జిగ్రా’ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూడాల్సిందే. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ విషయానికొస్తే.. రూ.4.55 కోట్లతో ‘జిగ్రా’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఓపెన్ అయ్యాయి. రెండోరోజు ఈ మూవీ రూ.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక మొదటిరోజు నుండే పాజిటివ్ టాక్ రావడంతో ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ విషయంలో ‘జిగ్రా’ రెచ్చిపోయింది. మూడోరోజు ఈ సినిమాకు రూ.9 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.

బెస్ట్ పర్ఫార్మెన్స్‌లు

వసన్ బాలా దర్శకత్వం వహించిన చిత్రమే ‘జిగ్రా’. ‘మోనికా ఓ మై డార్లింగ్’ మూవీతో దర్శకుడిగా మంచి గుర్తింపు సాధించాడు వసన్ బాలా. మొదటి సినిమా డార్క్ కామెడీ థ్రిల్లర్ కాగా రెండో సినిమా ప్రిజన్ బ్రేక్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాడు. ఇందులో ఆలియా భట్‌తో పాటు ‘ది ఆర్కైవ్స్’ ఫేమ్ వేదాంగ్ రైనా లీడ్ రోల్‌లో నటించాడు. అక్క పాత్రలో ఆలియా భట్, తమ్ముడి పాత్రలో వేదాంగ్ రైనా.. తమ బెస్ట్ పర్ఫార్మెన్స్‌లతో ఆకట్టుకున్నారు. అంతే కాకుండా సౌత్ యాక్టర్ రాహుల్ రవీంద్రన్ కూడా ‘జిగ్రా’తోనే బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ప్రిజన్ బ్రేక్ జోనర్ సినిమాలు హాలీవుడ్‌లో ఫేమస్ అయినా.. బాలీవుడ్‌లో మాత్రం ఇలాంటివి అరుదుగా వచ్చాయి. ‘జిగ్రా’ కూడా ఇప్పుడు ఆ లిస్ట్‌లో యాడ్ అయ్యింది.

Related News

Sundarakanda OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన నారా రోహిత్‌ ‘సుందరకాండ’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

OTT Movie : పెళ్ళైన ట్యూషన్ టీచర్ పై ప్రేమ… సీక్రెట్ లెటర్ తో బండారం బట్టబయలు… IMDbలో 7.5 రేటింగ్

OTT Movie : తవ్వకాల్లో బయటపడే శవపేటిక… దుష్ట శక్తి విడుదలవ్వడంతో దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు డోంట్ వాచ్

OTT Movie : బాబోయ్ చావడానికెళ్లి ఇలా బుక్కయ్యాడేంటి… 12 జన్మలు, 12 సార్లు చావు… కల్లో కూడా చావు గురించి ఆలోచించరు

OTT Movie : బీచ్ ఒడ్డున బట్టల్లేకుండా… రెండేళ్ల పాటు రెస్ట్ లేకుండా… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

Big Stories

×