BigTV English

Alia Bhatt: ‘జిగ్రా’ కలెక్షన్స్ అంతా ఫేక్, ప్రేక్షకులను ఫూల్ చేస్తున్నారు.. ఆలియా భట్‌పై హీరోయిన్ అటాక్

Alia Bhatt: ‘జిగ్రా’ కలెక్షన్స్ అంతా ఫేక్, ప్రేక్షకులను ఫూల్ చేస్తున్నారు.. ఆలియా భట్‌పై హీరోయిన్ అటాక్

Alia Bhatt: ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోతున్న నటి ఎవరంటే చాలామంది ఆలియా భట్ పేరే చెప్తారు. దీపికా, ప్రియాంక లాంటి సీనియర్ హీరోయిన్లు ఫ్యామిలీ లైఫ్‌లో బిజీ అయిపోవడంతో బీ టౌన్‌లో టాప్ 1 హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఆలియాకు దక్కింది. అంతే కాకుండా తనకు ఇతర ఇండస్ట్రీల నుండి కూడా చాలా సపోర్ట్ ఉంది. అందుకే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘జిగ్రా’ను ప్రమోట్ చేయడానికి కూడా మేకర్స్ చాలానే ఖర్చుపెట్టారు. ఫైనల్‌గా భారీ ఎత్తున అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘జిగ్రా’. తాజాగా ఈ మూవీకి వస్తున్న కలెక్షన్స్ అన్నీ ఫేక్ అని ఒక బాలీవుడ్ భా ఇచ్చిన స్టేట్‌మెంట్ వైరల్ అవుతోంది.


ఓపెన్ స్టేట్‌మెంట్

తన తమ్ముడు ఒక ఫేక్ కేసులో జైలుకు వెళ్తాడు, తనకు ఉరిశిక్ష కూడా వేస్తారు. తనను ఆ ప్రమాదం నుండి కాపాడడం కోసం తన అక్క ఏం చేస్తుంది అనేది ‘జిగ్రా’ కథ. ఈ సినిమాలో అక్కగా ఆలియా భట్ నటించగా.. తమ్ముడిగా వేదాంగ్ రైనా నటించాడు. కేవలం హిందీలోనే కాకుండా సౌత్ భాషల్లో కూడా ఈ సినిమా విడుదలయ్యింది. విడుదలయిన మొదటిరోజు నుండే ‘జిగ్రా’కు పాజిటివ్ టాక్ వస్తుందని మేకర్స్ అంతా సంతోషంగా ఫీలయ్యారు. అంతే కాకుండా మొదటిరోజే ఈ మూవీకి రూ.4.5 కోట్ల నెట్ కలెక్షన్స్ దక్కాయని కూడా ప్రకటించారు. అయితే ఈ కలెక్షన్స్ అంతా ఫేక్ అని మరో బాలీవుడ్ హీరోయిన్.. సోషల్ మీడియాలో ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చింది.


Also Read: ఆ వింత సమస్యతో ఇబ్బంది పడుతున్న అలియాభట్..?

మొత్తం ఖాళీ

బాలీవుడ్‌లో నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకుంది దివ్య కోస్లా కుమార్. ఇటీవల తాను కూడా ప్రిజన్ బ్రేక్ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘సావీ’ అనే మూవీలో నటించింది. ‘జిగ్రా’ కూడా ప్రిజన్ బ్రేక్ కాన్సెప్ట్‌తోనే తెరకెక్కింది. ‘జిగ్రా’ విడుదలయిన రెండోరోజు ఈ సినిమాను థియేటర్లలో చూడడానికి వెళ్లిన దివ్య.. దీని గురించి సోషల్ మీడియాలో షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ‘జిగ్రాను చూడడానికి సిటీ మాల్‌లోని పీవీఆర్‌కు వెళ్లాను. థియేటర్ మొత్తం ఖాళీగా ఉంది. చాలావరకు థియేటర్లు అన్నీ ఖాళీ అయిపోతున్నాయి. ఆలియా భట్‌లో నిజంగానే చాలా దమ్ము ఉంది. తనే టికెట్స్ కొనుక్కుంది ఫేక్ కలెక్షన్స్ అనౌన్స్ చేసింది’’ అని చెప్పుకొచ్చింది దివ్య కోస్లా కుమార్.

ఇదే నిజం

‘జిగ్రా విషయంలో పెయిడ్ మీడియా కూడా ఎందుకు సైలెంట్‌గా ఉందో నాకు అర్థం కావడం లేదు. మనం ఆడియన్స్‌ను ఫూల్ చేయకూడదు. ఇదే నిజం’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్ చేసింది దివ్య కోస్లా కుమార్. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్‌లో ‘జిగ్రా’ ఫేక్ కలెక్షన్స్ గురించే హాట్ టాపిక్‌గా మారింది. చాలామంది ఇదే నిజమే అని నమ్ముతుండగా మరికొందరు మాత్రం దివ్య కోస్లా కుమార్‌ను విమర్శిస్తున్నారు. దివ్య భర్త భూషణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించిన ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’ సినిమా కూడా ‘జిగ్రా’కు పోటీగా విడుదలయ్యింది. దీంతో అదే విషయాన్ని మనసులో పెట్టుకొని దివ్య ఇలా చేసిందని ఆలియా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Divya Khossla Kumar
Divya Khossla Kumar

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×