BigTV English

Harihara Veeramallu: పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్.. త్వరలో ఫస్ట్ సింగిల్..!

Harihara Veeramallu: పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్.. త్వరలో ఫస్ట్ సింగిల్..!

Harihara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకవైపు సినిమాలు మరొకవైపు రాజకీయాలలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత ఆయన బాధ్యతలు మరింత పెరిగిపోయాయి. ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా పనిచేస్తూనే మరొకవైపు తాను సైన్ చేసిన మూడు ప్రాజెక్టులను కంప్లీట్ చేసే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగానే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లను త్వరలోనే కంప్లీట్ చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం.


500 మంది ఆర్టిస్టులతో ప్రత్యేక యుద్ధ సన్నివేశం..

ఈ క్రమంలోనే ముందుగా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు పార్ట్ -1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగానే ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతిని అందించాలనే లక్ష్యంతో నిర్మాతలు కూడా ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రజాసేవకు అధిక ప్రాధాన్యతనిస్తూ చిత్రీకరణకు విరామం ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తిరిగి షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ దర్శకత్వంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారని , అందులో భాగంగా పవన్ కళ్యాణ్ తో పాటు దాదాపు 400 నుండి 500 మంది ఆర్టిస్టులు ఈ యుద్ధ సన్నివేశంలో పాల్గొనబోతున్నట్లు సమాచారం.


హరిహర వీరమల్లు నుంచి ఫస్ట్ సింగిల్..

ఈ నేపథ్యంలోనే దసరా పండుగ సందర్భంగా నిర్మాతలు ఒక శుభవార్తను అభిమానుల కోసం ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా నుంచి మొదటి గీతం విడుదల కానుంది అని స్పష్టం చేశారు. అంతేకాదు ఇక్కడ తెలుగు అభిమానులు ఆనందపడే మరో విషయం ఏమిటంటే.. తెలుగులో ఈ పాటను స్వయంగా పవన్ కళ్యాణ్ పాడగా ఇతర భాషలలో ఈ గీతాన్ని ఇతర గాయకులు పాడినట్లు సమాచారం. దసరా సందర్భంగా విడుదల చేసిన ఆసక్తికరమైన పోస్టర్లో పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులపై శక్తి త్రిశూలాన్ని ప్రయోగించినట్లుగా మూడు బాణాలను కూడా గురిపెట్టారు. ఈ పోస్టర్ చూశాక అభిమానులలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈసారి తమ హీరో బ్లాక్ బాస్టర్ హిట్టు కొడతాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వచ్చే ఏడాది సినిమా రిలీజ్..

ఇకపోతే అక్టోబర్ 14వ తేదీన సినిమా షూటింగ్ ప్రారంభించి , నవంబర్ 10 నాటికి చిత్రీకరణ పూర్తి చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే సామ్రాజ్యవాదులు.. అణిచివేతదారులకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం ఒక యోధుడు అలుపెరుగని పోరాటమే ఈ సినిమా అంటూ నిర్మాతలు కూడా స్పష్టం చేశారు. ఇందులో బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తూ ఉండగా అనుపమ్ ఖేర్, సునీల్, అనసూయ భరద్వాజ్ , సుబ్బరాయ శర్మ , కబీర్ దుహాన్, నాజర్, సుబ్బరాజు, రఘుబాబు, పూజిత పొన్నాడ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీగా హరిహర వీరమల్లు..

ఇకపోతే పవన్ కళ్యాణ్ అభిమానుల అంచనాలను దృష్టిలో పెట్టుకొని యువ డైరెక్టర్ జ్యోతి కృష్ణ భారీ యాక్షన్ ఎపిక్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. టీజర్ తోనే అభిమానులను ఆనందించేలా చేసిన ఈయన ఎప్పటికప్పుడు సినిమాపై అప్డేట్ లు ఇస్తూ హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే యేడాది 28వ తేదీన తెలుగు, తమిళ్, కన్నడ , హిందీ, మలయాళం భాషలో విడుదల కాబోతోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×