All We Imagine As Light : కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సత్తా చాటిన భారతీయ సినిమా ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ (All We Imagine As Light) ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా మేకర్స్ స్ట్రీమింగ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు.
ప్రముఖ ఇండియన్ లేడీ డైరెక్టర్ పాయల్ కపాడియా దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ (All We Imagine As Light). అంతర్జాతీయ వేదికలపై పలు అవార్డులను గెలుచుకున్న ఈ మూవీ తాజాగా ఓటిటి స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఈ సినిమాలో కని కుశ్రుతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రను పోషించారు. దర్శకురాలు పాయల్ కపాడియా విభిన్నమైన కథతో డ్రామా ఫిలింగా దీన్ని తీర్చిదిద్దారు. ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన ఫస్ట్ ఫీచర్ ఫిలిం కూడా ఇదే.
ఇటీవల 82వ గోల్డెన్ క్లోబ్స్ పురస్కారాలకు ఈ సినిమా నామినేట్ అయింది. బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ విభాగాల్లో ఈ మూవీ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ కేటగిరీల్లో ఈ సినిమా నామినేట్ అయింది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా సత్తా చాటింది. ఈ ఏడాది జరిగిన 77వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ ఫిక్స్ అవార్డును సొంతం చేసుకుంది ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ మూవీ. అంతేకాదు దాదాపు 30 ఏళ్ల తర్వాత భారతీయ చిత్రానికి కేన్స్ లో ఈ గౌరవం దక్కడం విశేషం.
అంతేకాకుండా ఈ సినిమాను ఇప్పటికే వీక్షించిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ (All We Imagine As Light) మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. పైగా ఈ ఏడాది తనకి నచ్చిన సినిమాలలో ఈ మూవీని ఫస్ట్ ప్లేస్ లో ఉంచి, చూడమంటూ సజెస్ట్ కూడా చేశారు. ఇలా ఇంటర్నేషనల్ రేంజ్ లో సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది.
తాజాగా ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది అంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసి జనవరి 3 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోందని వెల్లడించారు. దీంతో ఎప్పటి నుంచో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఓటిటి మూవీ లవర్స్ పండగ చేసుకుంటున్నారు.
ఇక ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ (All We Imagine As Light) మూవీ విషయానికి వస్తే… ముంబై నర్సింగ్ హోమ్ లో పని చేసే ఇద్దరు కేరళ నర్సుల కథ ఇది. ఈ నర్సులు ఇద్దరూ కలిసి బీచ్ టౌన్ లో ఉన్న ఓ రోడ్ ట్రిప్పుకు వెళ్తారు. ఆ తర్వాత వీరి జీవితాల్లో ఏం జరిగింది? అన్నదే ఈ మూవీ స్టోరీ.