BigTV English

Ambati Rambabu: వైసీపీకి ‘సోఫాలు’ అందాయా? అంబటి కామెంట్స్ వెనుక అంత అర్థం ఉందా?

Ambati Rambabu: వైసీపీకి ‘సోఫాలు’ అందాయా? అంబటి కామెంట్స్ వెనుక అంత అర్థం ఉందా?

Ambati Rambabu – CM Revanth : ఊరందరిదీ ఓ దారి అయితే ఉలిపికట్టెది ఓ దారి అనే సామెత వినే ఉంటారు. అచ్చం అలాగే ఉంటుంది కొంత మంది నాయకుల ధోరణి. తెలిసీ తెలియని తనమో, అందరి దృష్టిలో పడాలనే తాపత్రయమో అర్థం కాదు కానీ.. కొంచెం వింతగా, మరికొంచెం మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి నేతల తీరుతో, వారు చేసే విమర్శలతో అసలు నేతలకే ఎసరు వస్తుంటుంది. వారి అర్థం పర్థం లేని విమర్శలు తిరిగి తిరిగి వాళ్ల దగ్గరకే వస్తుంటాయి. అలా.. తెలంగాణాకు చెందిన ఓ విషయంపై ఏపీకి చెందిన ఓ మాజీ మంత్రి చేసిన వాఖ్యలపై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సెటైర్లు మోగుతున్నాయి. అయ్యా.. అంతా మీలానే ఎందుకుంటారు మహాశయా అంటూ సుతిమెత్తని చివాట్లు పెట్టేస్తున్నారు.


ఇటీవల తెలంగాణలో సినిమా థియోటర్ దగ్గర జరిగిన ప్రమాదం నేపథ్యంలో రాష్ట్రంలో ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో.. సినిమా ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు, డైరెక్టర్లు సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్యమైన నాయకుల్ని, అధికారులతో భేటి అయ్యారు. అక్కడ పరిశ్రమ అభివృద్ధి, ప్రభుత్వం తరఫున అందాల్సిన పోత్సాహాలపై లోతుగా చర్చించారు. ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున కొన్ని కోరికలు కోరగా.. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసుకుందామంటూ సీఎం రేవంత్ ఆఫర్ చేశారు. ఆ కమిటీ సిఫార్సుల ప్రకారం నిర్ణయాలు తీసుకుందామని అన్నారు. ఇండస్ట్రీ ప్రముఖులు సైతం.. ప్రభుత్వ స్పందన, ప్రోత్సాహం బాగుందంటూ ఆనందం వ్యక్తం చేశారు. కానీ.. అసలు ఈ ఎపిసోడ్ తో ఏమాత్రం సంబంధం లేని ఓ ఏపీ నేత స్పందించారు. ఆయనకు ఏ పురుగు తిరిగిందో తెలియదు కానీ.. వింతైన కామెంట్లు చేశారు.

ఆ నేత ఎవరో కాదు.. వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు. పుష్ప-2 సినిమాలో స్మగ్లర్ తనకు ఎదురుతిరిగిన వారిని లొంగదీసుకునేందుకు సోఫాల్లో డబ్బులు పంపిస్తాడు. ఈ ఘటనను ఉదహరిస్తూ “పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేశారు. ఆయన ఉద్దేశంలో సినీ ఇండస్ట్రీ వాళ్లు తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు డబ్బులు లంచంగా ఇవ్వాలని. మిగతా వారికి భిన్నంగా వ్యంగంగా పోస్ట్ చేసానంటూ సంబరిపడిపోయినట్లుంది. కానీ.. అంతలోనే ఈ పోస్ట్ పై నెటిజన్ల నుంచి ఊహించని కామెంట్లు వచ్చాయి. దాంతో.. అనుకున్నదొక్కటి, అయ్యిందొకటి అంటూ అంబటి బిత్తరపోవాల్సి వచ్చింది.


గతంలో వైసీపీ హయంలో ఏకంగా రూ.5, రూ.10 లకే సినిమా టికెట్లు అంటూ నానా హంగామా చేశారు. వరుస జీవోలతో జనసేనా అధినేత పవన్ కళ్యాణ్ సినిమాకు డబ్బులు రాకుండా అడ్డుకునేందుకు పూర్తి ప్రభుత్వ వ్యవస్థను దుర్వినియోగం చేశారు. ఎంతో విలువైన ప్రభుత్వ అధికారుల సమయాన్ని పాడు చేస్తూ.. ఎమ్మార్వోలను సినిమా థియేటర్ల దగ్గర కాపాలాకు పెట్టారు. కలెక్టర్లతో తనిఖీల పేరుతో వారి సమయాన్ని వృథా చేశారు. జీవోలు, నివేదికలు అంటూ ఉన్నత యంత్రాంగాన్ని పనికిరాని పనిపై పరుగుపు పెట్టించారు. ఆ సంఘటనల్ని గుర్తుకు తెస్తున్న నెటిజన్లు.. వైసీపీ ని ఏకిపారేస్తున్నారు.

గతంలో మీ ప్రభుత్వ హయాంలోనూ సినిమా ఇండస్ట్రీ పెద్దలు సీఎం ను కలిశారు గుర్తుంతా అంటూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. మరి మీ అధినాయకుడికి ఎన్ని సోఫాలు అందాయో చెప్పగలరా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా, అందరికీ మీలాంటి ఆలోచనలు ఉండాలిగా అంటూ మరోకరు, మీకు వీలైనట్లు అందరికీ కుదరదు అంబటి అని ఇంకో నెటిజన్ కామెంట్లలో వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read : బన్నీని బద్నాం చేస్తున్న అంబటి? ఈ టైంలో సోఫాలేంటి?

సినిమా టికెట్ల విషయం పక్కన పెడితే.. రాజకీయ కామెంట్ల కోసమూ సినిమా వాళ్లును వాడుకున్నారుగా మరి వాళ్లకు ఎన్ని సోఫాలు పంపించారు అంటూ ఆగ్రహిస్తున్నారు. టికెట్ల విషయంలో బెదిరించి టాలీవుడ్ పెద్దల నుంచి వైసీపీ ప్రభుత్వం ‘సోఫాలు’ వసూలు చేసిందా అంటూ జోరుగా చర్చ జరుగుతోంది. వైసీపీ నేతలతో పాటు ఏకంగా వారి అధినాయకుడికి.. అంబటి కామెంట్లు పుణ్యమా అని చివాట్లు తప్పడం లేదు.

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×