BigTV English

Comedy Movie OTT : నాలుగు నెలల తర్వాత నవ్వించేందుకు వచ్చేస్తున్న కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Comedy Movie OTT : నాలుగు నెలల తర్వాత నవ్వించేందుకు వచ్చేస్తున్న కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Malayalam Comedy Movie OTT:  మలయాళ ఇండస్ట్రీ పంట ఈ ఏడాది పండింది. జనవరి నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రతి మూవీ మంచి హిట్ టాక్ ను అందుకుంది.. ఇక భారీగా వసూల్ రాబట్టి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సూపర్ హిట్ సినిమాలు పలకరించాయి. చిన్న కాన్సెప్ట్ తో వచ్చి ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి ఇండస్ట్రీ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.. అందులో కొన్ని కామెడీ మూవీస్ కూడా ఉన్నాయి. మలయాళంలో ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకుల మనసు దోచుకున్న మూవీ ఇప్పుడు ఓటీటిలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఆ మూవీ ఏంటో? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం..


ఈ ఏడాది ఆగస్టు 23 న థియేటర్లలో వచ్చిన మూవీ తానారా.. కామెడీ జోనర్ లో వచ్చిన ఈ మూవీ థియేటర్ల లో వచ్చి యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.. దాంతో ఏ ఓటీటి ప్లాట్ ఫామ్ కూడా ఈ మూవీని స్ట్రీమింగ్ చెయ్యలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు మూవీ రాలేదు.. మొత్తానికి ఈ సినిమా ప్రముఖ మలయాళ ఓటీటీ మనోరమా మ్యాక్స్ లోకి అడుగుపెడుతోంది.. కామెడీ సినిమాల స్పెషలిస్టు డైరెక్టర్ హరిదాస్ చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ తానారా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ యావరేజ్ టాక్ ను అందుకుంది.

తానారా మూవీ ప్రేక్షకుల నుంచి యావరేజ్ టాక్ ను అందుకున్న కూడా బాగా నవ్వించేసింది. అయితే నాలుగు నెలల తర్వాత మలయాళ ఓటీటి సంస్థ మనోరమ మ్యాక్స్ లోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడించింది. షైన్ టామ్ చాకో, విష్ణు ఉన్నికృష్ణన్ లాంటి వాళ్లు నటించిన ఈ సినిమా మలయాళం ఆడియోలోనే రానుంది. కాకపొతే ఈ మూవీకి సబ్ టైటిల్స్ ఇంగ్లిష్ లో రాబోతుంది..


ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. ఈ మూవీ స్టోరీ మొత్తం రాజకీయ నాయకుడు అతని చుట్టూ జరిగే సన్నీవేశాల చుట్టూ తిరుగుతుంది.. ఆదర్శ్ శ్రీవరాహం అనే ఓ యువ పొలిటీషియన్, అతని భార్య అంజలి చుట్టూ తిరుగుతుంది. ఈ ఇద్దరూ గొడవపడుతూ ఉంటారు. తన భర్తపై ఓ కన్నేసి ఉంచడానికి అంజలి ఒక పోలీస్ ఆఫీసర్ ను అపాయింట్ చేస్తుంది. వీళ్ళ ఫామ్ హౌస్ లో ఒక దొంగ పడతాడు. ఆ తర్వాత మొగుడు పెళ్ళాల మధ్య మనస్పర్థలు తొలగి పోతాయి. ఆ తరువాత ఇద్దరు సంతోషంగా ఉంటారా? లేదా ఇద్దరి మధ్య గొడవలు పెరుగుతాయా అనేది ఈ మూవీ స్టోరీ. థియేటర్ల లో ఆకట్టుకొని ఈ మూవీ ఓటీటీ లో అయిన మంచి టాక్ ను సొంతం చేసుకుంటుందేమో చూడాలి.. ఇక మలయాళం లో చిన్న సినిమా ఓటీటీ లో మంచి వ్యూస్ ను రాబాట్టాయి.

Tags

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×