BigTV English

OTT Movie : రాజకీయాలలో అబద్ధాల హరిశ్చంద్రుడు … పొట్ట చెక్కలయ్యేలా ఉందయ్యా ఈ సిరీస్ ని చూస్తే

OTT Movie : రాజకీయాలలో అబద్ధాల హరిశ్చంద్రుడు … పొట్ట చెక్కలయ్యేలా ఉందయ్యా ఈ సిరీస్ ని చూస్తే

OTT Movie : ఇప్పుడు సినిమాలకన్నా, వెబ్ సిరీస్ ల గొడవ ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా ఈ వెబ్ సిరీస్ లను చూడటం అలవాటు చేసుకుంటున్నారు మూవీ లవర్స్. సినిమాలకు ధీటుగా ఇవి పోటీ పడుతున్నాయి. వీటిలో కామెడీ, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ వంటివి బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోపోయే వెబ్ సిరీస్, కామెడీ కంటెంట్ తో పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే….


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ కామెడీ టెలివిజన్ సిరీస్ పేరు ‘చాచా విధాయక్ హై హుమారే’ (Chacha Vidhayak Hain Humare). దీనిని జాకీర్ ఖాన్ రూపొందించారు. ఇందులో అతనే ప్రధాన పాత్రలో కూడా నటించారు. అల్కా అమీన్ జాకీర్ హుస్సేన్ సహాయక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ రోనీ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతని జీవితంలో చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో, గొప్పలు చెప్పుకోవడానికి తన మామ MLA అని అబద్ధం చెప్పుకుంటాడు. ఈ అబద్ధం గొప్పగా చెప్పుకోవడంవలన, అతని జీవితంలో అనేక సంఘటనలకు దారితీస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది. మొదటి సీజన్ 2018, మే,18, రెండవ సీజన్ 2021, మార్చి, 26, మూడవ సీజన్ 2024, ఏప్రిల్, 25లో విడుదలైంది.


స్టోరీలోకి వెళితే

సీజన్ 1 : 26 సంవత్సరాల యువకుడు రోనీ ఇండోర్‌లో నివసిస్తుంటాడు.అతని కి ఉద్యోగం లేకపోవడంతో,గౌరవం కోసం తన స్నేహితులకు, స్థానికులకు తన మామ MLA అని అబద్ధం చెప్తాడు. వాళ్ళ మధ్య ఉండే చిన్న చిన్న సమస్యలను పరిష్కరించే నాయకుడిగా అవతారం ఎత్తుతాడు. అవంతిక అనే అమ్మాయిని కూడా ఇలా అబద్ధాలు చెప్పి ప్రేమిస్తుంటాడు. ఈ అబద్ధాలు అతన్ని అనేక గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టివేస్తాయి. చివరికి అతని అబద్ధాలు బయటపడతాయి. కానీ ఆశ్చర్యకరంగా, నిజమైన MLA అశ్వినీ పాఠక్ (చాచాజీ) అతన్ని తన పార్టీ యువజన విభాగంలో చేరమని ఆహ్వానిస్తాడు.

సీజన్ 2: రోనీ ఇప్పుడు నిజంగా చాచాజీతో కలిసి పనిచేస్తూ, కౌన్సిలర్ ఎన్నికల్లో పోటీ చేయాలనే కలను కంటాడు. అయితే చాచాజీ టికెట్‌ను మరొకరికి ఇస్తానని స్పష్టం చేయడంతో, రోనీ మరో అబద్ధాన్ని సృష్టిస్తాడు. ఈ సమయంలో, విక్కీ అనే లండన్ నుండి వచ్చిన బలమైన వ్యక్తి, రోనీ రాజకీయ ఆశలను, వ్యక్తిగత సంబంధాలను కలవరపరుస్తాడు. ఈ సీజన్‌లో రోనీ తన స్నేహితులు అన్వర్, క్రాంతితో కలిసి రాజకీయ, ప్రేమ సమస్యలను ఎదుర్కొంటాడు.

సీజన్ 3 : రోనీ రాజకీయాల నుండి దూరంగా ఉండి, తన తల్లిదండ్రుల కోరిక మేరకు అవంతికతో స్థిరపడాలని ప్రయత్నిస్తాడు. అయితే, రోనీ కుటుంబ సభ్యులను, స్నేహితులను చాచాజీ బెదిరిస్తాడు. దీంతో చాచాజీతో రోనీ ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఆ తరువాత చాచాజీకి రోనీ సహాయం అవసరమవుతుంది. రోనీ తన కుటుంబం, స్నేహితుల కోసం చాచాజీ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో పాల్గొంటాడు. ఈ సిరీస్ మధ్యతరగతి కుటుంబాలు, యువత జీవితాలను హాస్యాస్పదంగా చూపిస్తుంది.

Read Also : హాస్టల్‌లో రూమ్ లో అమ్మాయిలను వణికిస్తున్న పిశాచి … ఒళ్ళు జలదరించే సీన్స్ ఉన్నాయిరా అయ్యా

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×