OTT Movie : మలయాళం సినిమాలు ఓటిటి ప్లాట్ ఫామ్ లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. స్లోగా సాగిపోతూ ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా, ఈ సినిమాలను ప్రజెంట్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుంది. సినిమా మొత్తం ఎక్కడా బోర్ కొట్టకుండా చివరి వరకు ఆసక్తికరంగా సాగుతుంది. చనిపోయిన ఒక వ్యక్తి ఆత్మ, తండ్రి, ప్రియురాలు చుట్టూ తిరుగుతుంది. ఎమోషనల్ గా సాగే ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ మలయాళం మూవీ పేరు ‘అనుగ్రహితన్ ఆంటోని‘ (Anugraheethan Antony). 2021 లో విడుదలైన ఈ మలయాళ ఫాంటసీ మూవీకి ప్రిన్స్ జాయ్ దర్శకత్వం వహించాడు. ఇందులో సన్నీ వేన్, గౌరీ జి. కిషన్ ప్రధాన పాత్రల్లో నటించగా, సిద్దిక్, ఇంద్రన్స్, సూరజ్ వెంజరమూడు, బైజు సంతోష్ సహాయక పాత్రల్లో నటించారు. లెక్ష్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రెట్‌కన్‌సినిమాస్‌తో కలిసి ఎం. షిజిత్, తుషార్ ఎస్ ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఆంటోని బాధ్యత లేకుండా, తండ్రి మాట లెక్కచేయకుండా తిరుగుతూ ఉంటాడు. ఈ విషయంపై తండ్రి అతనిపై కోపం పెంచుకుంటాడు. కొడుకు కన్నా కుక్కలు మేలు అంటూ, రెండు కుక్కల్ని కూడా ఇంటికి తీసుకొస్తాడు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా అలాగే తిరుగుతూ ఉంటాడు ఆంటోని. ఈ క్రమంలో ఆంటోని, సంజన అనే అమ్మాయిని లవ్ చేస్తుంటాడు. తన తండ్రి కుక్కలను ఎక్కువగా ఇస్టపడుతుండటంతో, ఇంట్లో ఉన్న రెండు కుక్కల్లో ఒకదానిని బయట దూరంగా తీసుకెళ్లి వదిలేస్తాడు. మరొక దానిని కూడా అలా తీసుకొని వదిలేద్దామనుకుంటాడు. ఈ ప్రయత్నంలో అనుకోకుండా ఒక రోజు యాక్సిడెంట్ లో ఆంటోని చనిపోతాడు. అప్పటినుంచి అతడు ఆత్మగా మారి ఇంటి దగ్గరికి వస్తాడు. సంజన కూడా అతని అడ్రస్ తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆంటోని ఆత్మ కుక్కలకు మాత్రమే కనబడుతూ ఉంటుంది. ఆంటోని బ్రతికున్నప్పుడు ఎన్నోసార్లు కుక్కను తిట్టేవాడు. ఇప్పుడు ఆ కుక్క ఆంటోనీకి సహాయం చేస్తుంది.
ఆంటోని చనిపోయినట్టు సంజనకి, ఆంటోనీ శ్రద్ధాంజలి ఫోటోను చూపిస్తుంది. భూమి మీద ఏడు రోజులు మాత్రమే ఆత్మ ఉంటుందని తెలుసుకున్న ఆంటోనీ, దూరంగా తీసుకెళ్లిన కుక్క ఎక్కడ ఉందో మరో కుక్కకి చూపిస్తాడు. అప్పుడు ఆ రెండు కుక్కలు చాలా సంతోషంగా ఉంటాయి. ఇంతలోనే తన తండ్రిని, ప్రియురాలిని చూస్తూ ఆంటోనీ ఆత్మ సమయం అయిపోవడంతో వెళ్ళిపోతుంది. ఎమోషనల్ గా సాగే ఈ ‘అనుగ్రహితన్ ఆంటోని’ (Anugraheethan Antony) మూవీ, ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది. మరెందుకు ఆలశ్యం ఈ వీకెండ్ ఈ మూవీపై ఓ లుక్ వెయ్యండి.