BigTV English

Oscar 2025: ఆస్కార్ నామినేషన్ కి ప్రియాంక చోప్రా ‘అనూజ’..స్టోరీ ఏంటంటే..?

Oscar 2025: ఆస్కార్ నామినేషన్ కి ప్రియాంక చోప్రా ‘అనూజ’..స్టోరీ ఏంటంటే..?

Oscar 2025: సినీ ఇండస్ట్రీ ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల కోసం నామినేషన్స్ పూర్తయ్యాయి. నిన్న ఈ నామినేషన్స్ లిస్టు ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.. ఈ నామినేషన్స్‌ ఎప్పుడో ప్రకటించాల్సి ఉండగా.. లాస్‌ ఏంజెలెస్‌ను చుట్టుముట్టిన కార్చిచ్చు కారణంగా వాయిదా పడటంతో గురువారం ఈ నామినేషన్స్ ను అనౌన్స్ చేశారు. ఈ నామినేషన్ లో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ‘అనూజ’ సినిమాకు బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో చోటు లభించింది.. ఈ షార్ట్ ఫిలిం స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్గా మాత్రమే పని చేసేది.. కానీ ఇప్పుడు ట్రెండ్ కు తగ్గట్లు ఆమె సినిమాలను పలు షార్ట్ ఫిలిం లను నిర్మిస్తున్నారు. ఆమె నిర్మించిన షార్ట్ ఫిలిం లలో అనూజ ఒకటి. ఈ షార్ట్ ఫిల్మ్‌ను ప్రియాంకా చోప్రా, గునీత్ మోంగా వంటి వారు నిర్మించగా ఆడమ్ జే గ్రావ్స్ దర్శకత్వం వహించారు.. ఈ విభాగంలో పరిశీలన కోసం ఏకంగా 180 సినిమాలు రాగా, వాటిలో కేవలం ఐదింటిని నామినేట్ చేశారు.. అందులో ఈ సినిమా ఒకటి.. వాటిలో ఏలియన్, ఐయామ్ నాట్ ఏ రోబో, ది లాస్ట్ రేంజర్, ఏ మ్యాన్ హు వుడ్ నాట్ రిమైన్ సైలెంట్ ఉన్నాయి.. ఈ ఐదేంటిలో అనుజకు కచ్చితంగా అవార్డు వస్తుందని చాలామంది నమ్ముతున్నారు. కాగా ప్రియాంకా చోప్రా బాలీవుడ్ పరిచయాలతో పాటు.. గునీత్ మోంగా సినిమాకు ఇది మూడో ఆస్కార్ ఎంట్రీ కానుండటంతో ఆయనకు ఈ అవార్డుల విషయంలో అన్ని తెలుసని, మళ్లీ ఆయన ప్రయత్నం ఫలిస్తుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.. మరి చూడాలి అదృష్టం ఎలా ఉంటుందో..

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. 


ఈ మూవీ స్టోరీ గుండెలకు హత్తుకునేలా ఉంటుంది. బాల కార్మికుల స్థితిగతుల గురించి ఈ మూవీలో చక్కగా చూపించారు. బట్టల ఫ్యాక్టరీలో పని చేసే అనూజ అనే 9 ఏళ్ల పాప, ఆమె అక్క పాలక్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. సహజసిద్ధంగా తెరకెక్కిన ఈ ఫిల్మ్ అందరినీ ఆకర్షించింది.. ఆమె తన జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు, అది ఆమె భవిష్యత్తుతో పాటు ఆమె కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది చూపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే గుండెల్ని పిండేస్తే కథ అని జనాలు అంటున్నారు.

అవార్డులు.. 

అనూజ మూవీ ప్రపంచ ప్రీమియర్ 8 జూన్ 2024న 24వ డెడ్సెంటర్ ఫిల్మ్ ఫెస్టివల్లో జరిగింది. ఈ చిత్రం ఆగస్టు 2024 లో జరిగిన హోలీషార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ అనే అవార్డును సొంతం చేసుకుంది. అక్టోబర్ 2024లో ఇది మాంట్క్లైర్ ఫిల్మ్ ఫెస్టివల్లో షార్ట్ ఫిల్మ్ కోసం ఆడియన్స్ అవార్డును గెలుచుకుంది. అలాగే అక్టోబర్ 2024 లో జరిగిన న్యూయార్క్ షార్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రాండ్ ప్రైజ్ని కూడా గెలుచుకుంది.. ఇలా వరుసగా అవార్డులను అందుకుంది. ఇన్ని అవార్డులు అందుకున్న ఈ మూవీ ఆస్కార్ ను అందుకుంటుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×