OTT Movies : ప్రతి నెల సినిమాలు ఎలాగా రిలీజ్ అవుతున్నాయో.. ఓటీటీ ల్లోకి ప్రతి వారం కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి. ఇక వారంలో శుక్రవారం బోలెడు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతాయి. ఈమధ్య రిలీజ్ అవుతున్న సినిమాలకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఓటీటీ సంస్థలు కూడా ఆసక్తికర సినిమాలను రిలీజ్ చేస్తున్నాయి. అయితే ఈమధ్య ఓటీటీలో ఎక్కువగా హారర్ సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఎప్పటిలాగే ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈవారం కూడా బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేసాయి. ఆలస్యం ఎందుకు ఏ ఓటీటీ లో ఏ సినిమా వచ్చేస్తుందో? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
మనోరమ మ్యాక్స్..
కుమ్మట్టికలి (మలయాళం క్రైమ్ యాక్షన్ డ్రామా మూవీ)- ఏప్రిల్ 25
కల్లం (మలయాళం డ్రామా చిత్రం)- ఏప్రిల్ 25
నెట్‌ఫ్లిక్స్..
మ్యాడ్ స్క్వేర్ (తెలుగు కామెడీ మూవీ)- ఏప్రిల్ 25
జువెల్ థీఫ్- ది హీస్ట్ బిగిన్స్ (హిందీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం)- ఏప్రిల్ 25
వీక్ హీరో క్లాస్ 2 (కొరియన్ స్కూల్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 25
హావోక్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- ఏప్రిల్ 25
జీ5..
అయ్యన మనే (కన్నడ హారర్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 25
ఆహా..
యాత్తి సాయి (తెలుగు యాక్షన్ వార్ డ్రామా సినిమా)- ఏప్రిల్ 25
అమెజాన్ ప్రైమ్..
నిరమ్ మారుమ్ ఉలగిల్ (తమిళ అంథాలజీ క్రైమ్ ఎమోషనల్ డ్రామా చిత్రం)- ఏప్రిల్ 25
యాపిల్ ప్లస్ టీవీ..
వోండ్లా (ఇంగ్లీష్ యానిమేషన్ ఫాంటసీ అడ్వెంచర్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 25
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 10 సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అయ్యాయి. వీటిలో ఇదివరకే కొన్ని ప్రసారం అవుతున్నాయి. మరికొన్ని వేరే ఓటీటీలోకి ఇవాళ వచ్చేసాయి. వీటిలో కొన్ని సినిమాలు వెరీ స్పెషల్.. ఆరు సినిమాలు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయని అంటున్నారు. అందులో ముఖ్యంగాతెలుగు సూపర్ హిట్ కామెడీ మూవీ మ్యాడ్ స్క్వేర్, వార్ డ్రామా యాత్తి సాయి, నేరుగా ఓటీటీ రిలీజ్ కానున్న హిందీ చిత్రం జువెల్ థీఫ్, తెలుగు డబ్బింగ్ యాక్షన్ థ్రిల్లర్ హావోక్ సినిమాలను మిస్ అవ్వకుండా చూడండి.
Also Read :ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..
ఇక థియేటర్లో ఈ మధ్య ఇంట్రెస్టింగ్ సినిమాలు ఏవి లేవు.. ఇవాళ సారంగపాణి జాతకం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరో ప్రియదర్శి ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మరి కలెక్షన్స్ ఏమాత్రం వసూలు చేస్తుందో చూడాలి..
అదేవిధంగా సమ్మర్ స్పెషల్ గా మేలో బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. మార్చ్ కి రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు అన్నీ కూడా మేకి షిఫ్ట్ అయ్యాయి. అందులో ప్రభాస్ నటించిన రాజా సాబ్ మూవీ కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు.