Budhaditya Raja Yoga: ఈ సంవత్సరం మే 7వ తేదీన బుధాదిత్య రాజయోగం ఏర్పడనుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. ఈ రాజయోగం ఏర్పడటం వల్ల ఐదు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందని ఇంకా వారి జీవితంలో ఉన్న సమస్యలు తీరడమే కాకుండా వారికి ఉజ్వల భవిష్యత్తు రాబోతుందంటున్నారు. ఇంతకీ ఆ ఐదు రాశులేవీ వారికి రాబోయే అదృష్టమేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మనిషి భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలను అంచనా వేస్తారు పండితులు. అలాగే గ్రహస్థితులు ప్రభావాన్ని బట్టి రాబోయే మంచి చెడులను కూడా క్యాలికులేట్ చేస్తారు. అయితే ఈ మే 7 తేదీన గ్రహ స్థితులలో అద్బుతం జరుగుతుందని జ్యోతిష్య పండితులు అంటున్నారు. అదే బుధాదిత్య రాజయోగం ఏర్పడనుందని ఈ రాజయోగం వల్ల ముఖ్యంగా ఐదు రాశుల జాతకుల జీవితాలు మారిపోన్నాయని.. వారి ఊహించని పెను మార్పులు వారి జీవితంలో జరగబోతున్నాయని చెప్తున్నారు. ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్కాటక రాశి:
కర్కాటక రాశికి పదవ ఇంట్లో రాజయోగం ఉందని బుధాదిత్య రాజయోగం ఏర్పడటం వల్ల వృత్తి పరమైన సమస్యలు తొలగిపోనున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సంఘంలో మంచి గుర్తింపు లభించే అవకాశం ఉన్నట్టు పండితులు చెప్తున్నారు. అలాగే కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. రాజకీయ పదవులు వచ్చే అవకాశం ఉంది. శత్రువులే మిత్రులుగా మారి మీ ఉన్నతికి సాయం చేస్తారు. మీ సీనియర్లతో ఉన్న విభేదాలు సమసిపోతాయి. వారితో అభివృద్దికి కావాల్సిన రిలేషన్ ఏర్పడుతుంది.
సింహ రాశి:
సింహరాశికి తొమ్మిదో ఇంట్లో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీని వల్ల ఈ రాశి విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. ఉన్నత విద్య కోసం అవసరమైన స్కాలర్‌షిప్పులు మంజూరు అవుతాయి. విదేశాలలో చదువుకోవాలనే కోరిక నెరవేరుతుంది. ధార్మిక ప్రయాణాలు చేస్తారు. గురువుల అనుగ్రమం పొందుతారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. మీరు కోరుకున్న కోరికలు అన్ని నెరవేరే సమయం ఇది.
తుల రాశి:
తులారాశికి ఏడవ ఇంట్లో బుధాదిత్య రాజయోగం ఏర్పడనున్న కారణంగా వ్యాపార ఒప్పందాలు లాభదాయకంగా మారతాయి. ఇంట్లో వివాహ చేస్తున్న వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. విడిపోయిన దంపతులు మళ్లీ కలిసే అవకాశాలు ఉన్నాయి. కౌన్సిలింగ్, లా మీడియా రంగాల్లో ఉన్న వారికి ఈ రాజయోగం వల్ల అన్ని పనులు అనుకూలంగా మారిపోతాయి.
ధనస్సు రాశి:
ధనస్సు రాశికి ఐదవ ఇంట్లో రాజయోగం ఏర్పడటం వల్ల చదువు, ప్రేమ, సంతానం విషయాల్లో శుభవార్తలు వింటారు. విద్యార్థులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రేమ విషయంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అపోహలు తొలగిపోయి ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. సంతానాన్ని కోరుకునే వారు ఈ రాజయోగం తర్వాత శుభవార్తలు వింటారు. క్రియేటివ్, స్టార్టప్ రంగాలలోని వారికి యోగకాలం. మీ ప్రాజెక్టుల్లో విజయం సాధిస్తారు.
మీన రాశి:
మీనరాశికి రెండవ ఇంట్లో బుధాదిత్య రాజయోగం ఏర్పడటం వల్ల సంపద పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపార, వాణిజ్య రంగాలలోని వారికి అఖండ లాభాలు వస్తాయి. కుటుంబంలో గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. ఆర్థికపరమైన స్థిరత్వానికి ఈ రాజయోగం కారణమవుతుంది. తమ మాటలతో ఇతరులను ఇట్టే ఆకర్షిస్తారు. మీలోని నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి. మీ ఉజ్వల భవిష్యత్తుకు ఈ టైం ఎంతో ఉపయోగపడుతుంది.
ALSO READ: జన్మజన్మల్లోవెంటాడేకర్మలుఅవేనట – మీరు ఏ కర్మలుచేశారోతెలుసా..?