BigTV English

Lalithaa jewellery Kiran Kumar : నేను మహానటి సావిత్రమ్మకు ఆ మాట చెప్పాను

Lalithaa jewellery Kiran Kumar : నేను మహానటి సావిత్రమ్మకు ఆ మాట చెప్పాను

Lalithaa jewellery Kiran Kumar : లలితా జ్యువెలరీ గురించి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. చాలామంది కుటుంబాలకి లలితా జ్యువెలరీ కి ఒక అవినాభావ సంబంధం ఉంది. లలితా జ్యువెలరీ కిరణ్ కుమార్ అంటే అంతమందికి తెలియకపోవచ్చు కానీ కొంతమందికి మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ ఆయనకి ఇంకొక పేరు ఉంది గుండు అంకుల్. వినడానికి ఇది ఫన్నీగా ఉన్నా కూడా ఇది వాస్తవం అని చెప్పుకోవాలి. ఒకప్పుడు డబ్బులు ఊరికే రావు అనే ఒక్క యాడ్ తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. బంగారం బిజినెస్ లో ఒక కొత్త ఒరవడి సృష్టించాడు. తన జీవితంలో ఎన్ని కష్టాలు పడి వచ్చాడు చాలామందికి తెలిసే ఉంటుంది. అలానే అతను నుంచి ఇన్స్పైర్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ కిరణ్ కుమార్ కి తెలుగు మహానటి సావిత్రమ్మకి కూడా కొద్దిపాటి బంధం ఉంది. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదా. అసలు ఏమైందో చూద్దాం.


కిరణ్ కుమార్ ప్రస్థానం

కిరణ్ కుమార్ మొదట తన తల్లి ఇచ్చిన కొద్దిపాటి బంగారంతో బిజినెస్ స్టార్ట్ చేసి అంచలంచెలుగా ఎదిగి ఈరోజు లలితా జ్యువెలరీ ను సొంతం చేసుకున్నారు. అయితే వీళ్ళకి చెన్నైలో ఒక షోరూమ్ ఉండేదట. ఆ షోరూం మరెవరిదో కాదు మహానటి సావిత్రి గారి బిల్డింగ్లో మొత్తం నాలుగు ఫ్లోర్లు ఉండేవి. ఆ నాలుగు ఫ్లోర్లలో మూడు ఫ్లోర్లు ఈ గోల్డ్ బిజినెస్ జరుగుతూ ఉండేది. చెన్నైలో ఉన్న ఆ నాలుగో ఫ్లోర్లో సావిత్రి గణేషన్ ఉండేవాళ్ళు.
అయితే ఒక సందర్భంలో తనతో పాటు ఉండే రాజేష్ అనే వ్యక్తిని పంపించి, షాపు ఖాళీ చేస్తున్నాము అని సావిత్రి గారికి చెప్పమని పంపించారట. వెంటనే సావిత్రి గారు కిరణ్ కుమార్ వచ్చాడా వస్తే ఒకసారి రమ్మని చెప్పు అని ఫోర్త్ ఫ్లోర్ కి పిలిచారట. షోరూమ్ ఎందుకు ఖాళీ చేస్తావు మేమే ఖాళీ చేస్తాము నువ్వు ఈ షో రూమ్ బిల్డింగ్ ను కంప్లీట్ గా తీసుకొని చెప్పారట.


ఈ షోరూం నువ్వే కొనుక్కో

కిరణ్ కుమార్ ముందు ఒక వ్యక్తికి ఫోన్ చేసి బిల్డింగ్ యొక్క లావాదేవీలు మాట్లాడారు. ఇప్పుడు నువ్వు దీనిని బట్టి ఎంతకు కొనుక్కుంటావో అనేది నీ ఇష్టం అంటూ బిల్డింగ్ను కిరణ్ కు అమ్మేశారు. ఆ తర్వాత ఒక ఆరు నెలల పాటు సావిత్రి గారు అదే బిల్డింగ్ లో ఉన్నా కూడా కిరణ్ కుమార్ కనీసం రెంట్ కూడా అడగలేదు. ఇకపోతే కొన్ని రోజులు తర్వాత షో రూమ్ లోకి ఎంట్రీ ఇస్తుంటే, అక్కడ ఉండాల్సిన సావిత్రి గారి ఫోటో కనిపించలేదు. వెంటనే కిరణ్ కుమార్ సావిత్రి గారికి ఫోన్ చేసి మీరు ఇక్కడి నుంచి మీ ఫోటోని ఎందుకు తీసుకెళ్లారు. మా వాళ్లు మీ ఇంటి బయట ఉన్నారు ఆ ఫోటోను అర్జెంటుగా పంపించండి ఆ ఫోటో నాకు ఇక్కడ కావాలి అని చెప్పుకొచ్చారు. రోజు షో రూమ్ లోకి ఎంట్రీ ఇస్తుంటే సావిత్రమ్మను నవ్వుతూ చూస్తున్న ఫోటో తనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అందుకే ఆ ఫోటో మళ్ళీ తెప్పించాను. అలానే ఇప్పటికీ ఆ బిల్డింగ్ కి సావిత్రి గణేషన్ అనే పేరు ఉంటుందట. ఈ విషయాన్ని స్వయంగా కిరణ్ కుమార్ ఒక పాడ్ కాస్ట్ లో తెలిపారు.

Also Read : నోరు జారిన సాయి పల్లవి.. మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుని మరి తిట్టిపోస్తున్న జనం

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×