E-Paper
Advertisement

OTT Movie: పెళ్లికాని అర్చన పాట్లు.. కడుపుబ్బా నవ్వించే ఈ మలయాళం మూవీ అస్సలు మిస్ కావద్దు!

OTT Movie: పెళ్లికాని అర్చన పాట్లు.. కడుపుబ్బా నవ్వించే ఈ మలయాళం మూవీ అస్సలు మిస్ కావద్దు!
Advertisement

OTT  Movie: పెళ్లి సబ్జెక్ట్ ఎత్తితే చాలు.. బోలెడన్ని జోకులు పుట్టుకొస్తాయి. కానీ, ‘పెళ్లి’ అనే పదం వ్యక్తులపై చాలా ప్రభావం చూపుతుంది. ఎంత ప్రయత్నించినా పెళ్లికానివారికి ఫ్రస్ట్రేషన్ కలిగిస్తుంది. కావాలని పెళ్లి చేసుకునేవారికి.. ఎందుకురా ఈ ఊబిలో పడ్డాం అనేలా చేస్తుంది. మలయాళంలో వచ్చిన ‘అర్చన 31 నాట్ ఔట్’ (Archana 31 Not Out) మూవీ కూడా అలాంటిదే. అయితే, ఇది పెళ్లికాని వ్యక్తులు సమాజంలో ఎదుర్కొనే సవాళ్లు చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా ఇంట్లో ఒక పెళ్లికాని అమ్మాయి ఉందంటే.. బయట వ్యక్తులు ఎలా చూస్తారు. ఆమెకు ఎదురయ్యే సవాళ్లు ఎలాంటివి అనే విషయాలను కామెడీ టచ్‌తో చూపించాడు దర్శకుడు అఖిల్ అనిల్ కుమార్. మరి ఇక కథ ఏంటో చూసేద్దామా?

ఇదీ కథ:

పలక్కాడ్‌లోని ఒక చిన్న గ్రామంలో అర్చన (ఐశ్వర్య లక్ష్మి) అనే 28 ఏళ్ల యువతి ఉంటుంది. ఆమె ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా పనిచేస్తుంది. తండ్రి మాధవన్ (జేమ్స్ వర్గీస్) అనారోగ్యంతో మంచాన్న పడతాడు. తల్లి (ఎస్.కె. మిని) కుటుంబాన్ని చూసుకుంటుంది. అర్చన చెల్లి అను (ఆర్చా) చదువుకుటుంది. దీంతో కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుని జీవిస్తోంది. ప్రేమించడం ఇష్టంలేక.. పెద్దల ద్వారా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటుంది. అయితే, ఏ సంబంధమూ కుదరదు. అలా 30 సంబంధాలు విఫలమవుతాయి. దీంతో బంధువులు, ఊరి ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటుంది. అదే సమయంలో ఆమె ప్రైవేట్ టీచర్ జాబ్ కాంట్రాక్ట్ కూడా ముగిసిపోతుందనే వార్త ఆమెను మరింత బాధలో ముంచేస్తుంది.

ఎట్టకేలకు 31వ సంబంధం ఒకే అవుతుంది, కానీ..

Advertisement

అర్చనాకు క్రికెట్ అంటే ఆసక్తి. కానీ ఇంటి బాధ్యతల వల్ల ఆమె తన ఇష్టాలను చంపుకుంటుంది. ఆమెకు వచ్చిన 30 సంబంధాలు వివిధ కారణాల వల్ల విఫలమవుతాయి. ఆ కారణాలన్నీ ఆమె స్టిక్కీ నోట్స్‌పై రాసి గుర్తుపెట్టుకుంటుంది. చివరికి 31వ సంబంధం ప్రసాద్ (లుక్మాన్ అవరాన్) అనే ఎన్‌ఆర్‌ఐ వ్యక్తితో కుదురుతుంది. అతను గల్ఫ్‌లో పనిచేస్తుంటాడు. అతని కుటుంబం అర్చన కుటుంబాన్ని కలిసి సంబంధం ఖాయం చేస్తారు. ఎంగేజ్‌మెంట్, పెళ్లి ఏర్పాట్లు జోరుగా సాగుతాయి. అర్చన కూడా చాలా సంతోషిస్తుంది. పెళ్లికి ముందు రోజు రాత్రి.. ప్రసాద్ బావమరిది నుండి ఒక ఊహించని ఫోన్ కాల్ వస్తుంది. ప్రసాద్ తన ప్రియురాలితో పారిపోయాడని తెలుస్తుంది. ఈ వార్త విని అర్చనాకు గుండె పగిలినంత పనవుతుంది.

అర్చనలో వచ్చే మార్పు చూసి.. అంతా షాక్

31వ పెళ్లి విఫలం తర్వాత.. అర్చన మానసికంగా కుంగిపోతుంది. ఆత్మహత్య చేసుకోవాలని లేదా ఇంటి నుంచి పారిపోవాలనే మానసిక సంఘర్షణతో బాధపడుతుంది. చివరికి ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది. అది ఏమిటనేది బుల్లితెరపై చూస్తేనే బాగుంటుంది. ఈ మూవీ ప్రస్తుతం Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడవచ్చు.

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×