OTT Movie : ఆడియన్స్ కి థ్రిల్ ఇచ్చే స్టోరీలు కావాలి, అవి ఏ భాషలో ఉన్నా చూసేస్తుంటారు. ఇప్పుడు థ్రిల్లర్ వెబ్ సిరీస్ లే ఎక్కువగా ట్రెండ్ కూడా అవుతున్నాయి. డిఫరెంట్ కంటెంట్ ని మూవీ లవర్స్ అస్సలు వదలటం లేదు. అలాంటి కంటెంట్ తో వచ్చిన ఒక సిరీస్ ఓటీటీలో దూసుకెళ్తోంది. ఈ కథలో ఒక అమ్మాయి థ్రిల్ కోసం ‘రెడ్ రూమ్’ అనే గేమ్‌లో పడి ప్రమాదాలను తెచ్చుకుంటుంది. మొదట రొమాంటిక్ గా మొదలయ్యే ఈ స్టోరీ, ఆ తరువాత థ్రిల్లర్ వైబ్ కి మారుతుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘రెడ్ సిన్’ (Red sin) 2025లో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. డీపాంకర్ ప్రకాష్ దీనికి దర్శకత్వం వహించారు. డైసీ షా లీడ్ రోల్ పోషించింది. 6 ఎపిసోడ్ ల ఈ సిరీస్, 2025 జూన్ 12 న ShemarooMe ఓటీటీలో విడుదల అయింది. IMDbలో ఈ కథకి 7.2/10 ఉంది.
తియా అనే యువతి ఒక సాధారణ అమ్మాయి. కానీ ఆమె జీవితంలో థ్రిల్, ఎక్సైట్‌మెంట్ కావాలని కోరుకుంటుంది. ఒక రోజు ఆమె ‘రెడ్ రూమ్’ అనే రహస్య గేమ్ గురించి తెలుసుకుంటుంది. ఈ గేమ్‌లో డబ్బున్న వాళ్లు, కొర్పొరేట్ వరల్డ్‌లోని పెద్ద వాళ్లు మాస్క్‌లు వేసుకుని, ప్రేమ ఆటలు ఆడతారు. తియా థ్రిల్ కోసం ఈ గేమ్‌లో చేరుతుంది. మొదట గేమ్ ఫన్‌గా, ఎక్సైటింగ్‌గా అనిపిస్తుంది. కానీ త్వరగా అది డేంజరస్ అవుతుంది. గేమ్‌లో మోసాలు బయటపడతాయి. దీంతో తియా అక్కడ ఇబ్బందిలో చిక్కుకుంటుంది.
Read Also : మెడికల్ కాలేజీలో వరుస మరణాలు… అమ్మాయిల టార్గెట్… గుండె జారిపోయే సీన్లు ఉన్న హర్రర్ మూవీ
తియా గేమ్ ఆడుతూ కొందరితో ప్రేమలో పడుతుంది. కానీ అది మోసమని తెలుస్తుంది. గేమ్ వెనుక పెద్ద కుట్ర ఉందని, అది కొర్పొరేట్ వరల్డ్‌లోని చెడు వాళ్లతో ముడిపడి ఉందని తెలుస్తుంది. తియా గేమ్‌లోని రహస్యాలను కనుక్కోవడానికి ట్రై చేస్తుంది. కానీ కొంతమంది ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తారు. గేమ్‌లో డేంజర్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు తియా తన తెలివితో బతకడానికి, బయటకు రావడానికి పోరాడుతుంది. చివరికి తియా రెడ్ రూమ్ గేమ్ వెనుక ఉన్న కుట్రను కనుక్కుంటుందా ? తియా ఆ గేమ్ నుంచి బయటకు వస్తుందా ? అసలు ఆ గేమ్ లో తియా పడ్డ నరకం ఏమిటి ? అనే విషయాలను, మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.