OTT Movie : ఎక్కడ చూసినా నేరాలు పెరిగిపోతున్నాయి. ఏ వార్త చూసినా, ఏ ఛానల్ మర్చినా ఇవే కథలు. దీనికి తోడు ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. సినిమాలతో పాటు, వెబ్ సిరీస్ లు కూడా పొటా, పోటీగా నడుస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 7 ఎపిసోడ్‌లతో మైండ్ ని బెండ్ చేస్తోంది. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఇక క్లైమాక్స్ మాత్రం మరో లెవెల్ లో ఉంటుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాళ్ళకి వెళ్తే …
‘క్రైమ్ నెక్స్ట్ డోర్’ (Crime next door) 2021లో వచ్చిన హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. డీపాంకర్ ప్రకాష్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో అనుప్రియా గోయింకా, మోహన్ కపూర్, త్రిష్నా సింగ్, గాగన్ పరీక్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌లో 7 ఎపిసోడ్‌లతో 2021 మే 28న డిస్నీ+ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. దీనికి IMDbలో 6.9/10 రేటింగ్ ఉంది.
క్రైమ్ నెక్స్ట్ డోర్ అనేది, చిన్న చిన్న హత్యా మిస్టరీ కథల సిరీస్. ప్రతి ఎపిసోడ్‌లో ఒక కొత్త కేసు ఉంటుంది. ఇన్‌స్పెక్టర్ షేకవత్ అనే మహిళా పోలీసు ఈ కేసులను ఇన్వెస్టటిగేషన్ చేసి సాల్వ్ చేస్తుంటుంది. మొదటి ఎపిసోడ్‌లో ఆమెకు ఒక హత్య కేసు వస్తుంది. ఈ కేసు సాధారణంగా కనిపిస్తుంది, కానీ దాని వెనుక పెద్ద మోసం ఉందని తెలుస్తుంది. షేకవత్ తన తెలివితో కేసును విచారిస్తుంది. ఫైనల్లీ హంతకులను చాకచక్యంగా పట్టుకుంటుంది. ఈ సిరీస్ హత్యలు, మోసాలతో సస్పెన్స్‌గా మొదలవుతుంది. ప్రతి ఎపిసోడ్‌లో కొత్త కేసు వస్తుంది. ఉదాహరణకు, ఒక ఎపిసోడ్‌లో గాగన్ అనే వ్యక్తి హత్య కేసులో ఇరుక్కుంటాడు. దాని వెనుక పెద్ద కుట్ర ఉంటుంది.
షేకవత్ ప్రతి కేసును తెలివిగా, ధైర్యంగా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ప్రతి కేసులో ట్విస్ట్‌లు వస్తాయి. నిజం కనుక్కోవడం అంత తేలిగ్గా ఉండదు. ఒక్కో సారి ప్రాణాలకు తెగించి ఆమె కష్టమవుతుంది. ఇక క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. షేకవత్ విచారించిన అన్ని కేసులను కలిపి చూస్తే, వాటి వెనుక ఒక పెద్ద కుట్ర ఉందని తెలుస్తుంది. ఈ కేసులన్నీ ఒక గ్రూప్‌తో కనెక్ట్ అయి ఉంటాయి. ఇది తెలుసుకుని షేకవత్ షాక్ అవుతుంది. చివరికి ఈ కిల్లింగ్ గ్రూప్ ని ఆమె అరెస్ట్ చేస్తుందా ? ఆ గ్రూప్ ఎందుకు మర్డర్లు చేస్తున్నారు ? అనే విషయాలను, ఈ సిరీస్ ని చూసి తెలుసుకోండి.