OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి, చివరి దాకా ప్రేక్షకుల్ని కట్టిపడేసే ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. ప్రేక్షకుల్ని ఈ సినిమాలు థియేటర్లలో, కార్నర్ ఎడ్జ్ వరకు తీసుకెళ్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే తమిళ్ మూవీ లో, హీరో శ్యామ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టాడు. అక్కడక్కడ కొన్ని మైనస్ పాయింట్లు తప్ప ఎక్కడా బోర్ కొట్టదు. రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఈ నెల చివర్లో ఓటీటీ లోకి స్ట్రీమింగ్ కు రానుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ కు వస్తుంది ? అనే వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
స్టోరీలోకి వెళితే
ఒక ఆత్మహత్య కేసును ఇన్స్పెక్టర్ అకిలన్ ను ఇన్వెస్టిగేషన్ చేయమని పై అధికారులు అప్పగిస్తారు. ఈ కేసులో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి తనకు తానుగా గుండెల్లో పోచుకుని చనిపోయి ఉంటాడు. ఇదే రీతిలో మరో ఇద్దరు వ్యక్తులు కూడా అలాగే ఆత్మహత్య చేసుకుని చనిపోతారు. ఈ వరుస ఆత్మహత్యల వెనక ఏదో బలమైన కారణం ఉందని అనుకుంటాడు అకిలన్. ఇతనికి తోడుగా సుమంత్ అనే ఆఫీసర్ కూడా ఇన్వెస్టిగేషన్లో సహాయపడతాడు. ఈ హత్యలు జపనీస్ ఆత్మహత్య ఆచారాలను పాటించే ఒక రహస్యమైన పుస్తకానికి సంబంధం ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఈ ఆత్మహత్యలు కూడా చెస్ గేమ్ ఆడుతున్న వారి మధ్యనే జరుగుతాయి. లోతుగా ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు, ఈ హత్యలకు కారణం మార్టిన్ అని తెలుసుకుంటాడు. ఇతడు చెస్ గేమ్ బాగా ఆడుతుంటాడు.
ఒకరోజు ఇతని తమ్ముడు కూడా మార్టిన్ ను ఓడించడంతో, ఓర్చుకోలేక అతన్ని చంపేస్తాడు. ఆ తర్వాత ఇతడు ఒక సైకోలా బిహేవ్ చేస్తాడు. చెస్ గేమ్ లో గెలిచిన వాళ్ళను మార్టిన్ హిప్నటైజ్ చేసి చంపుతుంటాడు. ఇన్స్పెక్టర్ అకిలన్, మార్టిన్ ను పట్టుకోవడానికి నానా తంటాలు పడతాడు. స్టోరీ ముందుకు వెళ్లే కొద్ది ఇందులో ఉండే ట్విస్టులు అనూహ్యంగా బయటపడుతూ షాకింగ్ కు గురి చేస్తుంటాయి. చివరికి ఇన్స్పెక్టర్ అకిలన్ ఈ వరుస ఆత్మహత్యలకు కారణమైన మార్టిన్ ను పట్టుకుంటాడా? ఆ సైకో చెస్ కి బానిసవ్వడమే ఇందుకు కారణమా ? ఆ రహస్య పుస్తకంలో ఏమీఉంది ? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని చూడండి.
Read Also : పెళ్ళిరోజే పెళ్ళికొడుక్కి షాక్ … ప్రియుడితో పెళ్ళికూతురు జంప్ … ఫ్యూజులు అవుటయ్యే ట్విస్ట్ తో ఫస్ట్ నైట్