Gold Rate Today : గోల్డ్ రేట్ ఆల్ టైమ్ హై కి చేరింది. తులం రూ.98 వేలు దాటేసింది. 10 గ్రాముల మేలిమి బంగారం ఒక్క రోజులో 16వందల 50 రూపాయల మేర పెరిగింది. అమెరికా-చైనా మధ్య టారిఫ్ వార్ పుత్తడిని పరుగు పెట్టిస్తోంది. అంతర్జాతీయ పరిణామాలతో బంగారం ధర పైపైకి ఎగబాకుతోంది. పది గ్రాముల గోల్డ్ లక్ష రూపాయలకు సమీపంలోకి చేరింది. నేడో, రేపో లక్ష రూపాయల తాకడం ఖాయంగా కనిపిస్తోంది.
బంగారమే సో బెటర్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయం నుంచి బంగారం పరుగులు పెడుతోంది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న టారిఫ్స్, ఇతర నిర్ణయాల కారణంగా మార్కెట్‌లో అనిశ్చితి నెలకొంది. స్టాక్ మార్కెట్లు భారీగా పతనమై, కొద్దిగా కోలుకుంటున్నాయి. దీంతో సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా బంగారానికి గిరాకీ పెరిగింది. వెండి ధర సైతం బంగారాన్ని ఫాలో అవుతోంది. కిలో వెండి ధర ఒక్క రోజులో 19 వందలు పెరిగింది. ప్రస్తుతం 99 వేల 500 రూపాయల దగ్గర ఉంది.
గోల్డ్ రేట్ పెరగడానికి కారణం..
డాలర్ ఇండెక్స్ బలహీన పడడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించ వచ్చనే అంచనాలు కూడా బంగారం ధర పెరగడానికి కారణంగా కనిపిస్తున్నాయి. సాధారణంగా స్టాక్ మార్కెట్లు పెరుగుతున్నప్పుడు బంగారం రేటు కాస్త తగ్గుతుంటుంది. లేదంటే నిలకడగా ఉంటుంది. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది.
Also Read : చాట్ జీపీటీలో పుచ్చకాయలు, మామిడిపండ్లు కొనడం ఎలాగంటే..
బంగారం ఇప్పుడు కొనొచ్చా?
బంగారం కొనడానికి ఏది సరైన సమయం? ఇది అత్యంత కష్టమైన ప్రశ్న. సమాధానం చెప్పడం అంత ఈజీ కాదు. గోల్డ్ రేట్ ఇప్పుడు 98 వేలకు చేరిందని వామ్మో అనుకోవడానికి లేదు. ఇప్పటికే భారీగా పెరిగిందని కొనకుండా ఉంటే.. ముందుముందు మరింత పైపైకి దూసుకుపోవడం ఖాయం. అందులో నో డౌట్. ఈ వారంలోనే లక్ష రూపాయలు దాటేయొచ్చు. వచ్చే ఏడాదికల్లా రూ.2 లక్షలు కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలా ఎప్పటికప్పుడు బంగారం ధర పెరుగుతుందే కానీ తగ్గే ఛాన్సెస్ ఇప్పట్లో కనిపించడం లేదని విశ్లేషిస్తున్నారు. ఒకవేళ తగ్గినా.. అది రెండు, మూడు వేలకు మించి తగ్గకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఏదైనా కారణంతో గోల్డ్ రేట్ కాస్త తగ్గినా కూడా.. మళ్లీ భారీగా పెరగడం ఖాయమని అంటున్నారు. ముందుముందు పెళ్లిళ్ల సీజన్. కొనకుండా ఉండలేరు. అంత రేట్ పెట్టేందుకు మనస్సు ఒప్పుకోకపోవడం కామనే కానీ.. కొనకుండా ఉన్నారో.. ఫ్యూచర్లో మరింత పెరిగితే అప్పుడు బాధపడాల్సింది కూడా మీరే అంటున్నారు. అందుకే, డబ్బులుంటే ధరతో పని లేకుండా బంగారం కొనుక్కొని దాచుకోండి. ఏదైనా అనుకోని అవసరం వస్తే.. గోల్డ్‌ను తనఖా పెట్టి ఈజీగా డబ్బులు సమకూర్చుకోవచ్చు. అందుకే, రియల్ ఎస్టేట్ కంటే కూడా బంగారమే బెస్ట్ ఇన్వెస్టిమెంట్ అని సలహాలు ఇస్తున్నారు మార్కెట్ ఎక్స్‌పర్ట్స్. స్థలం ఉంటే అప్పటికప్పుడు అమ్మడం సాధ్యం కాకపోవచ్చు. కబ్జాల భయం కూడా ఉండొచ్చు. అదే గోల్డ్ అయితే ఎనీ టైమ్ అమ్మొచ్చు.. కుదవ పెట్టొచ్చు. సో, గోల్డ్ రేట్ పెరిగిందని టెన్షన్ పడకుండా.. కొనాలనుకుంటే కొనేయడమే మంచి ఆలోచన అంటున్నారు.