Gaddar Awards: తెలుగు సినిమాను ప్రోత్సహించడానికి, తెలుగు మేకర్స్ మరింత ప్రోత్సహకరంగా మంచి సినిమాలు తెరకెక్కించడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. తెలుగు సినిమాలకు ఒక ప్రత్యేకమైన అవార్డ్ ఉంటే బాగుంటుందని భావించింది. అందుకే గద్దర్ అవార్డులు అనేది ప్రారంభించింది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డుల గురించి ప్రకటించారు. గత కొన్నాళ్లుగా ఈ అవార్డులను ఎలా అందించాలి, ఎప్పటినుండి ప్రారంభించాలి అనే చర్చలు సినీ పరిశ్రమలో జరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా గద్దర్ అవార్డులకు కావాల్సిన జ్యూరీ ఫైనల్ అయ్యింది. దీనికి ఛైర్మన్‌గా అలనాటి నటి జయసుధను ఎంపిక చేశారనే విషయం బయటపడింది.
జ్యూరీ ఫైనల్
గద్దర్ అవార్డుల కోసం 15 మంది సభ్యులతో జ్యూరీ ఏర్పాటయ్యింది. ఇప్పటికే ఈ అవార్డుల కోసం నామినేషన్స్ కూడా దరఖాస్తూ చేశారు మేకర్స్. ఆ దరఖాస్తుల పరిశీలన ఇంకా మొదలు కాలేదు. తాజాగా జ్యూరీ కూడా ఫైనల్ అయ్యింది. ఈ జ్యూరీ ఛైర్మన్ జయసుధతో పాటు ఇతర సభ్యులు కూడా ఈ నామినేషన్స్‌ను పరిశీలించి విన్నర్స్‌ను ఫైనల్ చేయనున్నారు. ప్రస్తుతం సౌత్ అంతటికి కలిపి సైమా అవార్డులు ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా సినిమాలను ఎంకరేజ్ చేయడానికి నేషనల్ అవార్డులు ఉన్నాయి. కానీ కేవలం తెలుగు సినిమాలను ఎంకరేజ్ చేయడానికి గద్దర్ అవార్డులు ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దాని గురించి రాజకీయ ప్రముఖులు మీటింగ్ కూడా ఏర్పాటు చేసి ప్రకటించారు.
14 ఏళ్ల తర్వాత
జయసుధ (Jayasudha), ఎఫ్‌డీసీ ఎండీ హరీశ్‌లతో సమావేశమైన ఎఫ్‌డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు కలిసి నామినేషన్లకు వచ్చిన దరఖాస్తులను నిష్పక్షపాతంగా పరిశీలించాలని సూచించారు. ఎంపిక ప్రక్రియను ఏ ఇబ్బంది లేకుండా పూర్తి చేయాలని కోరారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం చలన చిత్ర అవార్డులను ఇస్తున్నట్టు గుర్తుచేసిన దిల్ రాజు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చలన చిత్ర అవార్డులకు ఈ రేంజ్‌లో స్పందన రాలేదన్నారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల కోసం అన్ని విభాగాల్లో 1248 నామినేషన్లు రాగా వ్యక్తిగత కేటగిరీలో 1172, ఫీచర్ ఫిల్మ్, చిల్డ్రన్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు తదితర కేటగిరిల్లో 76 దరఖాస్తులు అందినట్టు వెల్లడించారు. ఇన్ని దరఖాస్తులను ఫిల్టర్ చేయడంలో త్వరలోనే నిమగ్నం కానుంది జ్యూరీ.
Also Read: తమన్నాకంటే నేనే బెటర్ అంటున్న ఊర్వశి.. ఆపై సైలెంట్‌గా పోస్ట్ డిలీట్
కొత్త కేటగిరిలు కూడా
ఇటీవల ప్రెస్ కాన్ఫిరెన్స్ ఏర్పాటు చేసి గద్దర్ అవార్డుల (Gaddar Awards) గురించి మరిన్ని వివరాలు ప్రకటించారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) ఈ అవార్డులకు సంబంధించి మరిన్ని వివరాలు బయటపెట్టారు. 2014 జూన్ నుండి 2023 డిసెంబర్ మధ్యలో విడుదలయిన సినిమాలు ఈ అవార్డులకు నామినేషన్ దరఖాస్తు చేయడం కోసం అర్హులని తెలిపారు. ప్రతీ ఏడాది బెస్ట్ ఫిల్మ్ కేటగిరిలో కొన్ని నామినేషన్స్ అందుకుంటారని అన్నారు. 2024 తర్వాత విడుదలయిన సినిమాల నామినేషన్స్ విషయంలో కాస్త మార్పులు ఉంటాయని చెప్పారు. గద్దర్ అవార్డుల విషయంలో బెస్ట్ ఫిల్మ్ ఉర్దు లాంటి కేటగిరిలు కూడా ప్రవేశపెట్టనున్నట్టుగా తెలిపారు దిల్ రాజు. ఈ నెల 21 నుండి సినిమాల స్క్రీనింగ్ ప్రారంభం కానుంది.