E-Paper
Advertisement

20 ఏళ్ల క్రితం మిస్సయిన ఫ్రెండ్… సడన్ ఎంట్రీతో షాకింగ్ ట్విస్ట్… ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా

20 ఏళ్ల క్రితం మిస్సయిన ఫ్రెండ్… సడన్ ఎంట్రీతో షాకింగ్ ట్విస్ట్… ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా
Advertisement

Fantasy Adventure OTT: చిన్ననాటి జ్ఞాపకాలు, స్నేహానికి సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ జోడిస్తే వచ్చే ఎమోషనల్ ఫీల్ వేరే లెవెల్ లో ఉంటుంది. చిన్నప్పుడు మనకు పరిచయమైన ఓ స్నేహితుడు ఇరవై ఏళ్ల తర్వాత ముందుకు వస్తే ఎలా ఉంటుంది? పైగా అతడు మనిషి కాకుండా మరో గ్రహం నుంచి వచ్చిన గ్రహాంతరవాసి అయితే ఆ అనుభూతి ఇంకెంత వింతగా ఉంటుంది. ఇదే కాన్సెప్ట్ తో ఆస్ట్రేలియా నుండి వచ్చి వరల్డ్ వైడ్‌గా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న సరికొత్త సై-ఫై ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా మూవీ Allen (2026). డాలీ పియర్సన్, జెఫ్రీ వాకర్ కలసి దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్ ఇవాళ (నవంబర్ 12) నుండి ఓటీటీలో అఫీషియల్ గా స్ట్రీమింగ్ అవుతోంది. పిల్లలు, పెద్దలు కలిసి చూడాల్సిన ఒక బ్యూటిఫుల్ ఫాంటసీ ఎంటర్‌టైనర్ ఇది.

కథలోకి వెళ్తే…

పీటీ అనే పదేళ్ల బాలుడికి ఒకరోజు అలెన్ అనే గ్రహాంతరవాసి పరిచయమవుతాడు. ఇద్దరి మధ్య కొద్దిరోజుల్లోనే మంచి స్నేహం ఏర్పడుతుంది. కలిసి ఆటలు ఆడుకుంటూ, సరదాగా గడుపుతూ ఆ ఇద్దరూ మంచి స్నేహితులుగా మారిపోతారు. అయితే అనుకోని పరిస్థితుల్లో అలెన్ ఎలాంటి వీడ్కోలు చెప్పకుండానే అదృశ్యమవుతాడు. ఆ సంఘటన పీటీ మనసులో బలంగా ముద్రపడుతుంది. కాలం గడిచిపోయినా, తన చిన్ననాటి స్నేహితుడు తిరిగి వస్తాడనే ఆశను మాత్రం అతడు వదులుకోలేకపోతాడు.

Advertisement

ఇరవై ఏళ్లు గడిచిన తర్వాత కూడా పీటీ ఆ జ్ఞాపకాల నుంచి బయటపడలేకపోతుంటాడు. పెద్దవాడైనప్పటికీ చిన్ననాటి స్నేహం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. చివరకు ఎలాగైనా తన పాత స్నేహితుడిని మళ్లీ కలవాలనే ఆశతో అంతరిక్షంలోకి సంకేతాలు పంపించే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో అనూహ్యంగా అలెన్ తిరిగి భూమిపైకి వస్తాడు. ఇన్నాళ్లకు తన స్నేహితుడిని కలుసుకున్న ఆనందంలో పీటీ మునిగిపోతాడు.

కానీ అలెన్ తిరిగొచ్చిన తర్వాత పరిస్థితులు అనుకున్నట్లుగా ఉండవు. అతడి రాక వెనుక ప్రపంచాన్నే మార్చగలిగే ఒక పెద్ద రహస్యం దాగి ఉంటుంది. ఆ రహస్యం ఏంటి? ఇరవై ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన అలెన్‌కు పీటీ సాయం ఎందుకు అవసరమైంది? ప్రపంచాన్ని కాపాడటానికి ఈ ఇద్దరు స్నేహితులు ఎలాంటి సాహసం చేయాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా అసలు కథ.

ఎక్కడ చూడచ్చు అంటే ?

Advertisement

Allen (2026)లో పీటీ పాత్రలో టీ.జే. పవర్ నటించగా, కార్లీగా షార్లెట్ నిక్డావో, జేడెన్‌గా జోష్ హెల్మన్, సారా పాత్రలో ఎమిలీ బార్క్లే, రోరీగా బెనెడిక్ట్ హార్డీ కనిపిస్తారు. డేలీ పియర్సన్, జెఫ్రీ వాకర్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ‘Bluey’ యానిమేటెడ్ సిరీస్‌తో గుర్తింపు పొందిన ఆస్ట్రేలియాకు చెందిన Ludo Studio ఈ చిత్రాన్ని నిర్మించింది. 2026 నవంబర్ 12న Netflixలో విడుదలైన ఈ ఆస్ట్రేలియన్ సినిమా నిడివి సుమారు గంటా 45 నిమిషాలు. ఇంగ్లీష్ ఒరిజినల్‌తో పాటు హిందీ ఆడియోలోనూ వీక్షించవచ్చు.

Read Also: ప్రపంచంతో సంబంధం లేని ద్వీపం… ఖాళీ చేయించడానికి వచ్చిన వ్యక్తికి పట్టపగలే చుక్కలు… ఫుల్ ఫన్

Tags

Related News

లిఫ్ట్ ఎక్కితే పదేళ్లు వెనక్కి… గతాన్ని మారిస్తే గతి తప్పే వర్తమానం… ఈ కొత్త సిరీస్ లో టైమ్ ట్రావెల్‌తో ఫుల్ ఫన్

సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘జైలర్ 2’ వచ్చేసిందోచ్… ఓటీటీలో తలైవా మాస్ జాతర షురూ

అమ్మలా కనిపించే వింత ఆకారం… ఏడేళ్ల చిన్నారిని వెంటాడుతూ కుటుంబంలోకి… వెన్నులో వణుకు పుట్టించే హారర్

ప్రపంచంతో సంబంధం లేని ద్వీపం… ఖాళీ చేయించడానికి వచ్చిన వ్యక్తికి పట్టపగలే చుక్కలు… ఫుల్ ఫన్

ఇదెక్కడి సినిమారా నాయనా… బెస్ట్ ఫ్రెండ్ గర్ల్‌ఫ్రెండ్‌తోనే ప్రేమలో పడితే… ట్రయాంగిల్ రొమాంటిక్ కామెడీ

బాంబుల వర్షం కురుస్తున్న గాజాలోకి ముగ్గురు డాక్టర్లు… ప్రాణాలు కాపాడేందుకు చేసిన సాహసం చూస్తే షాక్ అవ్వాల్సిందే

క్రిస్మస్‌కి ముందే చర్చి మూతపడే పరిస్థితి… ఫాదర్ కి పరీక్ష… క్లైమాక్స్ అదుర్స్

Big Stories

Advertisement
×