American Doctor OTT: యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లో సైనికులే కాదు.. వైద్యులు కూడా ప్రతిరోజూ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుంది. నిజ జీవితంలో జరిగే కొన్ని యుద్ధ సంఘటనలు వింటేనే మనకు ఒళ్ళు గగుర్పొడుస్తుంది. చుట్టూ బాంబుల వర్షం కురుస్తున్నా, ప్రాణాలు పోతాయని తెలిసినా వేలాది మంది అమాయకుల ప్రాణాలను కాపాడటం కోసం కొందరు చేసే సాహసాలు రియల్ హీరోలనిపిస్తాయి. ఈ హార్ట్-రెంచింగ్ సర్వైవల్ వార్ డ్రామా మూవీ పేరే ‘American Doctor’. గాజా స్ట్రిప్ లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఇది రూపొందింది. ఈ పవర్‌ఫుల్ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.
ఈ డాక్యుమెంటరీలో ప్రధానంగా ముగ్గురు వైద్యుల ప్రయాణాన్ని చూపించారు. పాలస్తీనియన్-అమెరికన్ అత్యవసర వైద్య నిపుణుడు డాక్టర్ థాయర్ అహ్మద్, యూదు-అమెరికన్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మార్క్ పెర్ల్‌ముటర్, జొరాస్ట్రియన్ నేపథ్యానికి చెందిన ట్రామా సర్జన్ డాక్టర్ ఫెరోజ్ సిధ్వా.. ఈ ముగ్గురూ వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చినప్పటికీ, ప్రాణాలను కాపాడాలనే ఒకే లక్ష్యంతో గాజాకు వెళ్తారు.
అప్పటికే యుద్ధం కారణంగా గాజాలోని ఆసుపత్రులపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. బాంబుల దాడుల్లో గాయపడిన వారు పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు చేరుతుంటారు. వైద్య సదుపాయాలు సరిపోకపోవడం, మందుల కొరత, నిరంతరం పొంచి ఉండే ప్రమాదం.. ఇలా ప్రతి అడుగులోనూ సవాళ్లే ఎదురవుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ ముగ్గురు వైద్యులు తమకు సాధ్యమైనంతమందికి చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా చిన్నారులు, తీవ్రంగా గాయపడిన బాధితులకు వైద్యం అందించే క్రమంలో వారు తీసుకోవాల్సిన కఠిన నిర్ణయాలు మనసును కలచివేస్తాయి.
యుద్ధం మధ్యలో హాస్పిటల్ పైనే దాడులు జరుగుతున్న సమయంలో, ఆ డాక్టర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి పేషెంట్స్ ని ఎలా కాపాడారు అనేది చాలా ఎమోషనల్‌గా డిజైన్ చేశారు. ఆ ముగ్గురు డాక్టర్ల ధైర్యానికి, మానవత్వానికి ప్రతి ఒక్కరూ దండం పెట్టాల్సిందే. సినిమాటోగ్రఫీ చాలా రియలిస్టిక్ గా ఉంటూ, మిమ్మల్ని నేరుగా యుద్ధ క్షేత్రంలో కూర్చోబెడుతుంది. మానవత్వాన్ని చాటిచెప్పే ఈ గ్రిప్పింగ్ వార్ డ్రామాని అస్సలు మిస్ అవ్వకండి.
ఇది నటీనటులతో తెరకెక్కించిన కల్పిత సినిమా కాదు. డాక్టర్ థాయర్ అహ్మద్, డాక్టర్ మార్క్ పెర్ల్‌ముటర్, డాక్టర్ ఫెరోజ్ సిధ్వా తమ నిజ జీవిత అనుభవాలతో ఇందులో కనిపిస్తారు. ఎమ్మీ అవార్డు పొందిన ఫిల్మ్‌మేకర్ పోహ్ సీ టెంగ్ ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించారు. కిర్‌స్టీన్ బార్ఫోడ్, రీమ్ హద్దాద్, పోహ్ సీ టెంగ్ నిర్మించారు. సాద్ బుష్నాక్ సంగీతం అందించారు. 93 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం 2026లో విడుదలైంది. అమెరికాలో ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. నవంబర్ 10 నుంచి Prime Video Rent ద్వారా అందుబాటులోకి వచ్చింది. ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం తెలుగులో అందుబాటులో లేదు.
Read Also: అణు యుద్ధం జరిగి 200 ఏళ్లు… ముఖం లేని హీరో మాస్ జాతర… ‘మీర్జాపూర్’ను మించిన డైలాగులు