E-Paper
Advertisement

ఇదెక్కడి సినిమారా నాయనా… బెస్ట్ ఫ్రెండ్ గర్ల్‌ఫ్రెండ్‌తోనే ప్రేమలో పడితే… ట్రయాంగిల్ రొమాంటిక్ కామెడీ

ఇదెక్కడి సినిమారా నాయనా… బెస్ట్ ఫ్రెండ్ గర్ల్‌ఫ్రెండ్‌తోనే ప్రేమలో పడితే… ట్రయాంగిల్ రొమాంటిక్ కామెడీ
Advertisement

Romantic Comedy OTT: యూత్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ట్రయాంగిల్ రొమాంటిక్ కామెడీ సినిమాలకు ఓటీటీ ఆడియన్స్ ఎప్పుడూ క్రేజీగా చూస్తుంటారు. ఫ్రెండ్షిప్, లవ్ మధ్య ఉండే ఆ సన్నటి గ్యాప్ ని, ఇగో క్లాషెస్ ని చాలా హిలేరియస్‌గా చూపించడం జరిగింది ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో. బెస్ట్‌ ఫ్రెండ్‌ ప్రేమించిన అమ్మాయిపైనే మరో స్నేహితుడికి మనసు పడితే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. ఇలాంటి చిక్కుముడితో తెరకెక్కిన అమెరికన్‌ లేటెస్ట్ రొమాంటిక్‌ కామెడీ డ్రామానే ‘Falling’. ప్రస్తుతం ఈ అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ఓటీటీలో రెంట్ బేసిస్ లో అందుబాటులోకి వచ్చింది. అమెరికన్ హ్యూమర్ ఇష్టపడే వారికి ఇదొక పర్ఫెక్ట్ వీకెండ్ ట్రీట్.

కథలోకి వెళ్తే…

ఇది ఒక మామూలు లవ్ స్టోరీ లా కాకుండా, నిజ జీవితంలో జరిగే సంఘటనల లాగా సహజంగా ఉండే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇందులో జాక్  అనే అబ్బాయి ఎవరితోనూ సీరియస్‌గా ప్రేమలో పడకుండా సరదాగా ఉండే ఒక లాయర్. అతని బెస్ట్ ఫ్రెండ్ జానీ ఒక రచయిత, ఇతను నిజమైన ప్రేమను బాగా నమ్ముతాడు. ఒకరోజు జాక్ అనుకోకుండా ఒక కాఫీ షాప్‌లో జిలియన్ అనే అమ్మాయిని చూసి, మొదటి చూపులోనే ఆమెతో సీరియస్‌గా ప్రేమలో పడిపోతాడు. తన ప్రేమ గురించి జాక్ చాలా సంతోషంగా తన బెస్ట్ ఫ్రెండ్ జానీకి చెప్తాడు. కానీ జిలియన్‌ని కలిశాక జానీకి కూడా ఆమె మీద ఇష్టం మొదలవుతుంది. జాక్‌కి ఏమాత్రం తెలియకుండానే జిలియన్, జానీ ఒకరికొకరు దగ్గరై రహస్యంగా ప్రేమించుకుంటారు. ఈ విషయం ఒకరోజు జాక్‌కి తెలిసిపోవడంతో వాళ్ళిద్దరి మధ్య ఉన్న మంచి స్నేహం, జాక్ ప్రేమ అన్నీ ఒక్కసారిగా ముక్కలైపోతాయి.

Advertisement

ఈ నిజం బయటపడ్డాక జిలియన్, జానీ కొన్నాళ్ళు కలిసి ఉండాలని ట్రై చేస్తారు కానీ, తప్పు చేశామనే బాధతో వాళ్ళ బంధం ఎక్కువ కాలం నిలబడదు. చివరికి ఈ ముగ్గురూ పాత విషయాలన్నీ మర్చిపోయి, ఎవరి దారిలో వాళ్ళు ముందుకు వెళ్ళిపోవడంతో ఈ సినిమా కథ ముగుస్తుంది.  ఇందులో కేవలం ఒక అమ్మాయి కోసం ఇద్దరు స్నేహితులు పోటీపడటమే కాకుండా, ప్రేమలో ఉండే బాధ్యత, నమ్మకం, నిజాయితీ వంటి విషయాలను కూడా చూపించారు. ఇందులో డైలాగ్స్ చాలా ట్రెండింగ్ గా ఉంటూ నేటితరం యూత్‌కి పక్కాగా కనెక్ట్ అవుతాయి. వీకెండ్‌లో ఫ్రెండ్స్ తో కలిసి బాగా నవ్వుకోవడానికి ఇదొక బెస్ట్ ఛాయిస్.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ 

ఇందులో జాక్‌ పాత్రలో కేజే అపా నటించగా, జిలియన్‌గా ఇసాబెల్‌ మే, జానీగా ఆర్చీ రెనాక్స్‌ కనిపించారు. జేమ్స్‌ క్రిసెల్‌, కోలిన్‌ క్రిసెల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు కథను కూడా అందించారు. విల్‌ బ్లూమ్‌ఫీల్డ్‌ సంగీతం అందించారు. 107 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా 2026 అక్టోబర్‌ 9న థియేటర్లలో విడుదలైంది. నవంబర్‌ 10 నుంచి Prime Videoలో రెంట్‌ ఆప్షన్‌ తో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది  ఇంగ్లీష్ భాషలోనే రెంట్ ఆప్షన్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి ఇంకా తెలుగు డబ్బింగ్ లేదా సబ్‌టైటిల్స్ రాలేదు.

Advertisement

Read Also: నిన్నటిదాకా స్టార్ హీరోయిన్… ఇప్పుడు ఉండటానికి ఇల్లు కూడా లేదు… ఎమోషనల్ కామెడీ డ్రామా

Related News

బాంబుల వర్షం కురుస్తున్న గాజాలోకి ముగ్గురు డాక్టర్లు… ప్రాణాలు కాపాడేందుకు చేసిన సాహసం చూస్తే షాక్ అవ్వాల్సిందే

క్రిస్మస్‌కి ముందే చర్చి మూతపడే పరిస్థితి… ఫాదర్ కి పరీక్ష… క్లైమాక్స్ అదుర్స్

ప్రపంచ ప్రఖ్యాత సెలబ్రిటీలను కెమెరాలో బంధించిన ఫోటోగ్రాఫర్‌… ఫ్యాషన్ ప్రపంచాన్నే మార్చేసిన రిచర్డ్ అవెడన్ రియల్ స్టోరీ

మూతబడిన వాటర్ పార్క్ లో స్టూడెంట్స్ ట్రిప్… దెయ్యం ఎంట్రీతో దిమాక్ కరాబ్… నవ్విస్తూనే భయపెట్టే హారర్ కామెడీ

జరగబోయే ప్రమాదాలు ముందే కనిపిస్తే… ఓటీటీలో దుమ్మురేపుతున్న సిరీస్… ఈ హారర్ చూస్తే మైండ్ బ్లాక్

విడిపోయిన రాక్‌ బ్యాండ్‌ రీఎంట్రీ… మేఘాలయలో జరిగిన విషాదంతో ఊహించని మలుపు… మ్యూజికల్‌ ఎమోషనల్‌ డ్రామా

ఉంగరం కోసం సౌరాన్‌ వేట… ఎల్వ్స్, ఓర్క్స్‌ మధ్య భీకర పోరు… ‘ది రింగ్స్ ఆఫ్ పవర్’ కొత్త సీజన్ వచ్చేసిందోచ్

Big Stories

Advertisement
×