E-Paper
Advertisement

లిఫ్ట్ ఎక్కితే పదేళ్లు వెనక్కి… గతాన్ని మారిస్తే గతి తప్పే వర్తమానం… ఈ కొత్త సిరీస్ లో టైమ్ ట్రావెల్‌తో ఫుల్ ఫన్

లిఫ్ట్ ఎక్కితే పదేళ్లు వెనక్కి… గతాన్ని మారిస్తే గతి తప్పే వర్తమానం… ఈ కొత్త సిరీస్ లో టైమ్ ట్రావెల్‌తో ఫుల్ ఫన్
Advertisement

Time Travel Fantasy Thriller: ఓటీటీ ప్రపంచంలో ఈ మధ్య రొటీన్ కథలకు భిన్నంగా కొత్త కాన్సెప్టులతో వచ్చే సిరీస్‌లకు ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ అంశాలతో వస్తున్న కంటెంట్ కు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. సరిగ్గా అలాంటి వినూత్నమైన కాన్సెప్ట్‌తో ఒక తెలుగు వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. వినూత్నమైన టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సరికొత్త తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ పేరు Pushpaka Vimanam. ఒక సాధారణ లిఫ్ట్‌లో ప్రయాణిస్తే పదేళ్లు వెనక్కి వెళ్లే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? గతంలో చేసిన తప్పులను సరిచేసుకుంటే ప్రస్తుత జీవితం మరింత బాగుంటుందా? లేక కొత్త సమస్యలు మొదలవుతాయా? అనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ కథ సాగుతుంది. మరి ఈ సిరీస్‌లో టైమ్ ట్రావెల్ ఎలాంటి మలుపులు తీసుకువచ్చిందో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ సిరీస్ కథ పుష్పక్ రావు (సాయి రోనక్) అనే ఇన్సూరెన్స్ ఏజెంట్ చుట్టూ తిరుగుతుంది. జీవితంలో డబ్బు సంపాదించాలని, అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ఆశపడే పుష్పక్‌కు గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ఎప్పుడూ బాధ కలిగిస్తుంటాయి. చిన్నప్పుడు స్కూల్లో తక్కువ మార్కులు రావడం వల్ల తండ్రి చేతిలో తిట్లు తినడం, కాలేజీలో ప్రేమ విషయంలో ఎదురైన చేదు అనుభవం… ఇలా తన జీవితంలో జరిగిన తప్పులను గుర్తుచేసుకుంటూ ఉంటాడు. ఒక్కసారి గతంలోకి వెళ్లి ఆ పొరపాట్లను సరిచేసుకునే అవకాశం వస్తే బాగుంటుందని అనుకుంటాడు.

Advertisement

అలాంటి సమయంలో పుష్పక్‌కు ఒక వింత వ్యక్తి ఎదురవుతాడు. అతను చేసే ఒక్క చిటికెతో చుట్టూ ఉన్న ప్రపంచమే ఒక్కసారిగా ఆగిపోతుంది. ఆ తర్వాత పుష్పక్‌ను ఒక పాత బిల్డింగ్‌లోని వింత లిఫ్ట్ దగ్గరకు తీసుకెళ్తాడు. అది సాధారణ లిఫ్ట్ కాదు.. కాలంలో వెనక్కి తీసుకెళ్లే టైమ్ మిషన్. దాని సాయంతో 2026 నుంచి 2016లోకి వెళ్లే అవకాశం పుష్పక్‌కు దొరుకుతుంది.

ఇక తనకు దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకుని గతంలో జరిగిన తప్పులను సరిచేసుకోవడం మొదలుపెడతాడు. మొదట్లో తన నిర్ణయాలతో జీవితం బాగుపడుతుందని భావించినా, గతంలో చేసే చిన్న మార్పులు వర్తమానంలో ఊహించని పరిణామాలకు దారితీస్తాయి. అంతేకాదు తనను వెంటాడుతున్న సమస్యలు మరింత పెద్దవవుతాయి. నలుగురు వెంటపడే పరిస్థితి కాస్తా నలభై మంది వెంటపడే స్థాయికి చేరుతుంది. అసలు పుష్పక్ గతాన్ని ఎందుకు మార్చాలనుకున్నాడు? ఆ వింత లిఫ్ట్ వెనుక ఉన్న రహస్యం ఏంటి? అతను చేసిన మార్పుల వల్ల తన జీవితంలో ఎలాంటి ప్రమాదాలు ఎదురయ్యాయి? అనేదే మిగతా కథ.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే ?

Advertisement

ఈ సిరీస్‌లో పుష్పక్ రావు పాత్రలో సాయి రోనక్ నటించారు. మధూ దామరాజు, వడ్లమాని శ్రీనివాస్, భరణి, రఘు కుమార్ కారుమంచి, శ్రీధర్ రెడ్డి నల్లా, బిందు తదితరులు కీలక పాత్రల్లో ఉన్నారు. దీనికి సతీష్ రెడ్డి మల్లిడి దర్శకత్వం వహించగా, గ్లోబల్ క్రియేషన్స్ నిర్మించింది. ఇది Hotstar Specials ఒరిజినల్ సిరీస్. 2026 నవంబర్ 12 నుంచి JioHotstarలో తెలుగు భాషలో స్ట్రీమింగ్ అవుతోంది.

Read ALso: తప్పుల్ని సరిచేసుకోవడానికి ఏడాది వెనక్కి వెళ్లే అద్భుతమైన అవకాశం… కొరియన్‌ టైమ్‌ ట్రావెల్‌ మిస్టరీ థ్రిల్లర్‌ సిరీస్‌

Tags

Related News

సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘జైలర్ 2’ వచ్చేసిందోచ్… ఓటీటీలో తలైవా మాస్ జాతర షురూ

అమ్మలా కనిపించే వింత ఆకారం… ఏడేళ్ల చిన్నారిని వెంటాడుతూ కుటుంబంలోకి… వెన్నులో వణుకు పుట్టించే హారర్

ప్రపంచంతో సంబంధం లేని ద్వీపం… ఖాళీ చేయించడానికి వచ్చిన వ్యక్తికి పట్టపగలే చుక్కలు… ఫుల్ ఫన్

ఇదెక్కడి సినిమారా నాయనా… బెస్ట్ ఫ్రెండ్ గర్ల్‌ఫ్రెండ్‌తోనే ప్రేమలో పడితే… ట్రయాంగిల్ రొమాంటిక్ కామెడీ

బాంబుల వర్షం కురుస్తున్న గాజాలోకి ముగ్గురు డాక్టర్లు… ప్రాణాలు కాపాడేందుకు చేసిన సాహసం చూస్తే షాక్ అవ్వాల్సిందే

క్రిస్మస్‌కి ముందే చర్చి మూతపడే పరిస్థితి… ఫాదర్ కి పరీక్ష… క్లైమాక్స్ అదుర్స్

ప్రపంచ ప్రఖ్యాత సెలబ్రిటీలను కెమెరాలో బంధించిన ఫోటోగ్రాఫర్‌… ఫ్యాషన్ ప్రపంచాన్నే మార్చేసిన రిచర్డ్ అవెడన్ రియల్ స్టోరీ

Big Stories

Advertisement
×