OTT Movie : చేతబడులను ఆధారంగా చేసుకుని చాలా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇటువంటి స్టోరీలు ఇప్పుడు బాగా ఆకట్టుకుంటున్నాయి. కథలో వచ్చే ట్విస్టులు సినిమాకి హైలెట్ గా నిలుస్తున్నాయి. చివరి వరకు సస్పెన్స్ ను క్రియేట్ చేస్తూ, ప్రేక్షకుల్ని కదలనీయకుండా చేస్తున్నాయి ఈ సినిమాలు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ స్టోరీ చేతబడి చుట్టూనే తిరుగుతుంది. సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ గత ఏడాది రిలీజ్ అయింది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది,? అనే వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) లో
ఈ సూపర్‌నాచురల్ కామెడీ థ్రిల్లర్ మూవీ పేరు ‘అవతార పురుష 2’ (Avatara Purusha 2). 2024 లో విడుదలైన ఈ కన్నడ సినిమాకు దర్శకుడు సుని కథను కూడా రాసి దర్శకత్వం వహించారు. 2022లో వచ్చిన ‘ అవతార పురుష పార్ట్ 1’ కి సీక్వెల్ గా ఈ మూవీ వచ్చింది. ఇందులో శరణ్, ఆశికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా శక్తివంతమైన త్రిశంకు మణి అనే రాయి చుట్టూ తిరుగుతుంది. ఇది త్రిశంకు లోకంలోకి ప్రవేశించడానికి కీలకం గా మారుతుంది. ఈ సినిమా 2024, ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
రామ జోయిస్ అనే ఆయుర్వేద పండితుడు, అతని భార్య సుశీలకి ఒక కొడుకు కర్ణ ఉంటాడు. రామ జోయిస్ సోదరి యశోద వల్ల, కర్ణ ఒక ఆలయ ఉత్సవంలో తప్పిపోతాడు. ఈ సంఘటన తర్వాత, రామ జోయిస్ తన సోదరి యశోదని దూషిస్తాడు. ఆమెతో సంబంధాలను తెంచుకుంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత, యశోద కూతురు సిరి తన తల్లి, మామయ్య మధ్య సంబంధాలను బాగు చేయాలని నిర్ణయించుకుంటుంది. దీని కోసం ఆమె ఒక జూనియర్ ఆర్టిస్ట్ అయిన అనిల్ ని కర్ణగా నటించమని అడుగుతుంది.అతడు కూడా ఒప్పుకుంటాడు. అయితే అతని గతం చాలా గందరగోళంగా ఉంటుంది. అతను చిన్న పిల్లాడి గా ఉన్నప్పుడే, క్షుద్ర పూజలు చేసే ధర్క అనే వ్యక్తి దగ్గర ఉంటాడు. అతని నేతృత్వంలో చేతబడుల గురించి తెలుసుకుంటాడు. అయితే అనిల్ ఆ చీకటి ప్రపంచం నుండి తప్పించుకుని, ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గర ఆశ్రయం పొందుతాడు.
ఇప్పుడు, ధర్క త్రిశంకు మణిని స్వాధీనం చేసుకోవడానికి జోయిస్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటాడు. ఎందుకంటే ఆ మణి జోయిస్ కుటుంబం వద్ద ఉంటుంది. ఇప్పుడు త్రిశంకు లోకంలోకి ప్రవేశించి అమరత్వం పొందాలనే ధర్క కుట్రను అడ్డుకునే పని అనిల్ మీద పడుతుంది. ఆ ఇంట్లో కర్ణ గా నటిస్తూ ధర్క ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు. చివరికి అనిల్ గతం ఎలా గడిచింది ? అతను నిజంగానే తప్పిపోయిన రామ జోయిస్ కొడుకేనా ? ధర్క ను వీళ్ళు ఎలా ఎదుర్కుంటారు ? ఇవన్నీ తెలియాలంటే, ఈ మూవీని చూసేయండి. మొత్తంగా ‘అవతార పురుష 2’ ఒక ప్రత్యేకమైన కథను అందించే ప్రయత్నం చేసిందనే చెప్పుకోవాలి.