Agastya Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో.. హార్దిక్ పాండ్యాకు ఊహించని షాక్ తగిలింది. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో… తన తండ్రికి వ్యతిరేకంగా… ప్రత్యర్థి జెర్సీ వేసుకున్నాడు హార్దిక్ పాండ్యా కొడుకు అగస్త్య పాండ్యా (Agastya Pandya). ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో భాగంగా… సోమవారం రోజున ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో… ఈ బిగ్ ఫైట్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన… ముంబై ఇండియన్స్ బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్ చేయబోతోంది.
Also Read: Ashwin YouTube Channel: CSK లో ముసలం… నూర్ అహ్మద్ పరువు తీసిన అశ్విన్ యూట్యూబ్ ఛానల్
అయితే ఈ మ్యాచ్ కంటే ముందు ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కు ఊహించని షాక్ ఇచ్చాడు అతని కొడుకు అగస్త్య పాండే. హార్దిక్ పాండ్యా ప్రత్యర్థి జట్టు అయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జెర్సీని ధరించాడు అగస్త్య పాండే. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి. వాస్తవంగా… హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా… ఈసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
గతంలో పాండ్యా బ్రదర్స్ ఇద్దరు ముంబై ఇండియన్స్ లోనే ఉన్నారు. ఆ తర్వాత లక్నో సూపర్ జెంట్స్ కు ( Lucknow Super Giants ).. కృనాల్ పాండ్యా వెళ్ళాడు. అటు ముంబైని వీడి హార్దిక్ పాండ్యా… గుజరాత్ టైటాన్స్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత గత సీజన్లో… గుజరాత్ జట్టు నుంచి మళ్లీ ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చాడు హార్దిక్ పాండ్యా. ఇక మొన్న 2024 సంవత్సరం చివర్లో… జరిగిన మెగా వేలంలో కృనాల్ పాండ్యాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది. దీంతో హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
Also Read: Ashleigh Gardner-Monica Marriage: ఏంట్రా ఈ దారుణం.. మహిళల క్రికెటర్లు పెళ్లి చేసుకున్నారు
ఈ నేపథ్యంలోనే తాజాగా హార్దిక్ పాండ్యా కొడుకు అగస్త్య పాండ్యాకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించిన జెర్సీని వేశాడు కృనాల్ పాండ్యా. ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ కంటే ముందు ఈ సంఘటన జరిగింది. దీంతో తండ్రికి వ్యతిరేకంగా అగస్త్య పాండే వ్యవహరిస్తున్నాడని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. మొదట భార్యదూరం కాగా.. ఇప్పుడు కొడుకు కూడా దూరం అవుతున్నాడని పాండ్యాను ట్రోలింగ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా గత సంవత్సరంలోనే… ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అలాగే ఆయన భార్య నటాషా ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. పరస్పర ఒప్పందం ప్రకారం ఇద్దరు విడాకులు తీసుకోవడం జరిగింది.
Lad Is RCB Supporter 😅 pic.twitter.com/U8pZLkqy4L
— RVCJ Media (@RVCJ_FB) April 6, 2025