Horror OTT Movies : హిందీ హారర్ సినిమాలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఎన్నో చిత్రాలు ఆడియన్స్ ను భయపెట్టాయి. గతంలో హిందీలో చోరీ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ మూవీకి సీక్వెల్ గా చోరీ 2 మూవీ వస్తున్నా సంగతి తెలిసిందే. ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఇది థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు నుష్రత్.. ఈ మూవీ స్టోరీ గురించి ఆయన చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఓటీటీ డీటైల్స్..
గతంలో బాలీవుడ్ లో వచ్చిన చోరీ మూవికీ జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీకి సీక్వెల్ గా ఇప్పుడు మరో మూవీ రాబోతుంది. చోరీ 2 టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలే క్రియేట్ అయ్యాయి. ఏప్రిల్ 11వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా ఓటీటీలోకి ఈ చిత్రం వచ్చేస్తోంది. హిందీలో రూపొందిన ఈ మూవీ తెలుగుతో పాటు మరిన్ని భాషల్లోనూ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.. ఇందులో నుష్రత్, సోహా అలీ ఖాన్‍తో పాటు గష్మీర్ మహాజాని, సౌరభ్ గోయల్, పల్లవి అజయ్, కుల్దీప్ సరన్ కీలకపాత్రలు పోషించారు. విశాల్ ఫురియా దర్శకత్వం వహించారు. టీ సిరీస్, అబుందాతియా ఎంటర్‌టైన్‍మెంట్, సైక్ అండ్ తమారిస్క్ లేన్ పతాకాలు సంయుక్తంగా నిర్మించాయి.
చిత్రం స్టోరీ విషయానికొస్తే..
నిజానికి ఈ మూవీ స్టోరీ బలంగా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. అయితే పాటలు ఇందులో లేవని తెలుస్తుంది. భయపెట్టే హారర్ ఎలిమెంట్లతో పాటు కథ అద్బుతంగా ఉంటుందని చెప్పారు. ఒక్క పాట కూడా లేకుండా స్టోరీని తీసినట్లు నుష్రత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఒక యువతి గర్భవతిగా ఉంటుంది. దెయ్యాల బారి నుంచి తన బిడ్డను కాపాడుకోవడానికి ఆమె చేసే ప్రయత్నంగా ‘చోరీ 1’ కథ సాగుతుంది. దీనికి కంటిన్యూ గా చోరీ 2 ఉండబోతుంది. ఆమెకి బిడ్డ పుట్టిన తరువాత అదే దెయ్యాల నుంచి ప్రమాదం ఎదురవుతుంది. అప్పుడు ఆమె ఆ బిడ్డను రక్షించుకోవడం కోసం ఏం చేస్తుంది? అనేది ‘చోరీ 2’లో చూపించనున్నారు.. ఈ మొత్తం దెయ్యాల తో ముడిపడిన కథ అని ట్రైలర్ ని చూస్తే అర్థమవుతుంది. భయంకరమైన సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయని తెలుస్తుంది మరి సినిమా మొత్తం ఎలాంటి వణుకు పుట్టించే సీన్లు ఉంటాయో తెలియాలంటే సినిమాను మిస్ అవ్వకుండా చూడాల్సిందే…
గత ఏడాది నుంచి బాలీవుడ్ లో రిలీజ్ అవుతున్న హారర్ సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. చోరీ మూవీ సైతం మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కూడా హిట్ అవుతుందని ట్రైలర్ ను చూస్తే అర్థమవుతుంది. మరి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి..