OTT Movie : హారర్ థ్రిల్లర్ సినిమాలు భయపెడుతూ, ఎంటర్టైన్ చేస్తుంటాయి. కొన్ని సినిమాలు సౌండ్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ప్రపంచమంతా ఒక విపత్తులో చాలా వరకు అంతమవుతుంది. కొంతమంది మాత్రమే మిగులుతారు. మిగిలిన వాళ్ళు అక్కడక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తుంటారు. అయితే ఒక ప్రేమ జంటని, కొంతమంది కల్ట్ మెంబర్స్ క్రియేచర్లకు బలి ఇస్తుంటారు. ఈ డిఫరెంట్ కథతో వచ్చిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘అజ్రెల్’ (Azrael). 2024లో విడుదలైన ఈ అమెరికన్ యాక్షన్ హారర్ మూవీకి E. L. కాట్జ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సమారా వీవింగ్, విక్ కార్మెన్ సోన్నె,నాథన్ స్టీవర్ట్జ నటించారు. సెప్టెంబర్ 27, 2024న యునైటెడ్ స్టేట్స్‌లో IFC ఫిల్మ్స్ ద్వారా ఈ మూవీ థియేటర్‌లలో విడుదల చేయబడింది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
భూమి మీద ఒక విపత్తు వచ్చి, చాలా వరకు నాశనం అయిపోతుంది. కొంతమంది మనుషులు మాత్రమే మిగులుతారు. అక్కడక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తూ ఉంటారు. అలా ఏర్పాటు చేసుకున్న స్థావరాల్లో ఒకచోట కొంతమంది దేవున్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. వీళ్ళంతా మాట్లాడటం నేరంగా భావించి, గొంతు పనిచేయకుండా చేసుకుంటారు. ఈ ప్రాంతంలోకి అజ్రెల, కేనన్ అనే ఇద్దరు ప్రేమికులు వస్తారు. వాళ్లని అక్కడ ఉన్న వింత మనుషులు బంధిస్తారు. ఒక్కొక్కరిని ఒకచోట బంధించి, క్రియేచర్లకి బలి ఇవ్వాలని చూస్తారు. అయితే అజ్రెల్ వాళ్ళ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది. ఆమెను వెంబడిస్తూ ఈ వింత మనుషులు కూడా వెళ్తారు. ప్రియుడ్ని కాపాడటానికి వెతుక్కుంటూ వెళ్తుంది అజ్రెల్. అయితే ఒక ప్రాంతంలో ప్రియుడి వస్తువులు కనపడతాయి. అక్కడికి వెళ్లి చూస్తే అతను ఘోరంగా అప్పటికే చనిపోయి ఉంటాడు.
తన పరిస్థితికి కారణమైన వాళ్ళ ని వదిలిపెట్టకూడదని అనుకుంటుంది అజ్రెల్. వాళ్లపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని, మళ్లీ వాళ్ళు ఉన్న ప్రాంతానికి వస్తుంది అజ్రెల్. ఆ ప్రాంతంలో ఒక అమ్మాయి మేక పిల్లకి జన్మనిస్తుంది. అక్కడికి క్రియేచర్స్ అంతా వచ్చి, అ మేక పిల్లాడిని తమ నాయకుడిగా గౌరవిస్తారు. చివరికి వాళ్లపై అజ్రెల్ పగ తీర్చుకుంటుందా? క్రియేచర్ల చేతిలో బలవుతుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘అజ్రెల్’ (Azrael) అనే ఈ హారర్ థ్రిల్లర్ మూవీని చూడాల్సిందే. ఈ సినిమాని ఒంటరిగా చూస్తే అంతే సంగతులు, పై ప్రాణాలు పైకే పోతాయి. చాలా సన్నివేశాలు భయంతో వణుకు పుట్టిస్తాయి. హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇస్టపడేవారికి ఈ మూవీ ఒక బెస్ట్ సజేషన్. మరెందుకు ఆలశ్యం ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పై ఓ లుక్ వేయండి.