Vennela Kishore: అసలు టాలీవుడ్‌లో కామెడియన్స్ అనగానే చాలామందికి బ్రహ్మానందుకు, అలీ పేర్లే గుర్తొస్తాయి. హీరో అవ్వాలనే కోరికతో కామెడీని బయటపెట్టేసినా కూడా కామెడియన్‌గా సునీల్ నటించిన సినిమాలు ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్‌గా నిలిచిపోయాయి. ఇదంతా ఒక తరంలో ఉన్న కామెడియన్స్ అంతా ప్రేక్షకులను తెగ ఇంప్రెస్ చేయడం వల్ల జరిగింది. మరి వారి తర్వాత తెలుగు ప్రేక్షకులను కామెడియన్‌గా అలరించేది ఎవరు అనే ప్రశ్న ఎదురయితే.. చాలామందికి గుర్తొచ్చే పేరు వెన్నెల కిషోర్. తాజాగా వెన్నెల కిషోర్ చేసిన ఒక పని వల్ల బ్రహ్మానందం కుమారుడికి లాభం జరిగిందనే విషయం బయటపడింది.
బ్రహ్మానందం సినిమా
బ్రహ్మానందం మునుపటి లాగా సినిమాలు చేయడం లేదు. వయసు పెరుగుతున్నాకొద్దీ ఎక్కువగా రెస్ట్ తీసుకోవడానికే ఇష్టపడుతున్నారు. కానీ చాలా తక్కువ సందర్భాల్లోనే ఆయన ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కథ నచ్చి లేదా అందులో ఆయన పాత్ర నచ్చితే తప్పా ఒక మూవీని చేయడానికి అంగీకరించడం లేదు బ్రహ్మానందం. అలాంటి ఆయన త్వరలోనే ‘బ్రహ్మా ఆనందం’ (Brahma Anandam) అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నారు. ఇందులో బ్రహ్మానందంతో పాటు ఆయన కుమారుడు రాజా గౌతమ్ (Raja Gautham), వెన్నెల కిషోర్ కూడా లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఒక ఆసక్తికర విషయం బయటపడింది.
రికమెండ్ చేశాడు
‘‘గౌతమ్ చేసిన పాత్ర ముందుగా వెన్నెల కిషోర్ చేస్తే బాగుంటుందని తనను అప్రోచ్ అయ్యాడు నిర్మాత రాహుల్. కానీ ఈ సినిమాకు తాను కరెక్ట్ ఛాయిస్ కాదని వెన్నెల కిషోర్ గ్రహించాడు. అందుకే గౌతమ్ పేరును రికమెండ్ చేశాడు. అలా ఈ ప్రాజెక్ట్ మా వరకు వచ్చింది’’ అని బయటపెట్టారు బ్రహ్మానందం (Brahmanandam). అంటే వెన్నెల కిషోర్ (Vennela Kishore) చేసిన త్యాగం వల్ల చాలాకాలం తర్వాత బ్రహ్మానందం కుమారుడు గౌతమ్‌ను వెండితెరపై చూడబోతున్నారు ప్రేక్షకులు. దీంతో వెన్నెల మనసు చాలా మంచిది అని, తనకు సూట్ అవుతుందని నమ్మితేనే ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంటాడని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: 600 మంది డ్యాన్సర్స్ తో చిరు స్టెప్పులు .. డైరెక్టర్ ప్లాన్ మాములుగా లేదు..
లక్ కలిసిరాలేదు
ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన చిత్రమే ‘బ్రహ్మా ఆనందం’. బ్రహ్మానందం కుమారుడు రాజా గౌతమ్ హీరో అయినప్పటి నుండి ఈ ఇద్దరూ తండ్రీకొడుకులు పూర్తిస్థాయిలో కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇది. రాజా గౌతమ్‌కు హీరోగా అంతగా లక్ కలిసి రాలేదు. అయినా కూడా తన కెరీర్ ఇంతే అనుకొని వెండితెరపై పదేపదే కనిపించడానికి కూడా ప్రయత్నించలేదు. ఫనీంద్ర నర్సెట్టి దర్వకత్వంలో తెరకెక్కిన ‘మను’ అనే మూవీతో చివరిసారిగా ప్రేక్షకులను పలకరించాడు గౌతమ్. ఈ మూవీకి ఎన్నో అవార్డులు వచ్చినా కమర్షియల్‌గా మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మొత్తానికి ఇన్నాళ్ల తర్వాత ఈ తండ్రీకొడుకులు కలిసి ‘బ్రహ్మా ఆనందం’ ప్రేక్షకులను ఆనందింపజేస్తుందేమో చూడాలి.