OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి రకరకాల కథలతో సినిమాలు వస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా నచ్చిన సినిమాలను చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నారు మూవీ లవర్స్. ఇందులో మరాఠీ సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ పై కొంతమంది రౌడీలు దారుణంగా అఘాయిత్యం చేస్తారు. ఆమె వాళ్లపై రివేంజ్ ఎలా తీర్చుకుంది అనేదే ఈ స్టోరీ. ఈ మరాఠీ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
జి ఫైవ్ (Zee 5) లో
ఈ మరాఠీ మూవీ పేరు ‘బండిషాలా’ (Bandishala). ఈ మరాఠీ మూవీ నిజ జీవిత సంఘటన ఆధారంగా సంజయ్ పాటిల్ రచించగా, మిలింద్ లేలే దర్శకత్వం వహించారు. ఒక పోలీస్ ఆఫీసర్ అఘాయిత్యానికి గురి అవుతుంది. కొంతమంది ఆమె పై కక్ష గట్టి ఇలా చేస్తారు. స్వాతి పాటిల్ నిర్మించిన ఈ మూవీలో ముక్తా బార్వే మాధవి, సావంత్‌గా నటించింది. ఇందులో శరద్ పోంక్షే, ఉమేష్ జగ్తాప్, ఆనంద్ అల్కుంటే, ఆనంద కరేకర్, పంకజ్ చెంబుర్కర్, కృతికా గైక్వాడ్ తదితరులు సహాయక పాత్రల్లో నటించారు. శాంతై మోషన్ పిక్చర్స్, శ్రీ మౌళి మోషన్ పిక్చర్స్ ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీ వివిధ విభాగాల్లో ఏడు మహారాష్ట్ర రాష్ట్ర చలనచిత్ర అవార్డులను అందుకుంది. ఈ మరాఠీ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ జి ఫైవ్ (Zee 5) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
మాధవి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తుంటుంది. ఈమె ఒక జైలుకు అధికారిగా ఉంటుంది. అందులో ఒకసారి ఖైదీల మధ్య బాగా గొడవలు జరుగుతాయి. అందులో రఘు అని రౌడీషీటర్ మరొక వ్యక్తిని చంపేస్తాడు. అతన్ని కంట్రోల్లో పెట్టడానికి చూస్తుంది మాధవి. అతనికి బయట పెద్ద వాళ్ళతో బాగా సంబంధాలు ఉంటాయి. ఒకసారి మాధవిని నువ్వు పిల్లలు పుట్టని గొడ్రాలివి అంటూ నీచంగా నిందిస్తాడు. దానితో రఘుని బాగా కొడుతుంది పోలీస్ ఇన్స్పెక్టర్ మాధవి. ఆమె మీద చాలా మంది కక్ష పెంచుకుంటారు. మరోవైపు జైలును రెనోవేషన్ చేయడానికి వచ్చిన కాంట్రాక్టర్ ని కూడా వర్క్ లో తేడా రాకూడదని బెదిరిస్తుంది. ఇంతలోనే భర్తతోపాటు ఒక ఫంక్షన్ కి వెళ్లి తిరిగి వస్తూ ఉంటుంది మాధవి. భర్తను భయపెట్టి ఐదుగురు వ్యక్తులు ఆమెను బలాత్కారం చేస్తారు. ఈ న్యూస్ మీడియా వరకు వెళ్తుంది. అయితే అయిదుగురు వ్యక్తులను కొద్ది రోజుల్లోనే పోలీసులు పట్టుకుంటారు. వాళ్లకు శిక్ష పడకుండా ఒక పెద్ద లాయర్ అడ్డుపడతాడు. చివరికి మాధవి ఆ కేసును ఎలా ఎదుర్కొంటుంది? తనకు ఇలా చేసిన పెద్ద మనుషులను ఎలా శిక్షిస్తుంది? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ప్లాట్ ఫామ్ జి ఫైవ్ (Zee 5) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘బండిషాలా’ (Bandishala) అనే ఈ మరాఠీ మూవీని మిస్ కాకుండా చూడండి.