BigTV English

OTT Movie : తవ్వకాల్లో బయటపడే శవపేటిక… దుష్ట శక్తి విడుదలవ్వడంతో దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు డోంట్ వాచ్

OTT Movie : తవ్వకాల్లో బయటపడే శవపేటిక… దుష్ట శక్తి విడుదలవ్వడంతో దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు డోంట్ వాచ్

OTT Movie : అడ్వెంచర్ సినిమాలు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, హారర్ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కింది. ఈ కథ 1956లో ఫ్రాన్స్‌లోని బొగ్గు గనిలో చిక్కుకున్న గని కార్మికుల చుట్టూ తిరుగుతుంది. గనిలో ఒక రక్తపిపాసి జీవి వీళ్ళను వేటాడటంతో కథ ఉత్కంఠంగా నడుస్తుంది. ఈ సినిమాలో క్రీచర్ డిజైన్ ని చూస్తేనే వణికిపోతారు. మరి దీని విన్యాసాలను చూడాలనుకుంటే, ఈ హారర్ అడ్వెంచర్ సినిమాని చూసేయండి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘ది డీప్ డార్క్’ (The Deep Dark) 2023లో విడుదలైన ఫ్రెంచ్ హారర్ అడ్వెంచర్ మూవీ. మాథ్యూ తురి డైరెక్ట్ చేసిన చిత్రంలో సామ్యూల్ లే బిహాన్, అమీర్ ఎల్ కాసెమ్, జీన్-హ్యూగ్స్ అంగ్లాడ్, థామస్ సోలివెరెస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2023 నవంబర్ 15న థియేటర్లలో విడుదలై, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోసినిమాలో స్ట్రీమ్ అవుతోంది. 1 గంట 43 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా IMDbలో 5.6/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా ఫ్రెంచ్ ఒరిజినల్‌తో పాటు హిందీ, ఇంగ్లిష్, తెలుగు డబ్బింగ్‌లతో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళితే

ఈ కథ 1956లో అమీర్ అనే గని కార్మికుడితో మొదలవుతుంది. అతను ఆర్థిక అవసరాల కారణంగా ఫ్రాన్స్‌లోని “డెవిల్స్ ఐలాండ్” అని పిలిచే అత్యంత ప్రమాదకరమైన బొగ్గు గనిలో పనిచేయడానికి వస్తాడు. ప్రొఫెసర్ బెర్తియర్ ను 1,000 మీటర్ల లోతుకి తీసుకెళ్తే అదనపు బోనస్ ఇస్తామని చెప్పడంతో, అమీర్ తన బృందంతో కలిసి ఈ పని చేయడానికి ఒప్పుకుంటాడు. అతను అక్కడ శాంపిల్స్ సేకరించడానికి వస్తున్నానని చెప్తాడు. ఈ బృందంలో రోలాండ్, లూయిస్, మిగ్యూల్ తో పాటు ఇతర గని కార్మికులు ఉంటారు. వీరిని ఫ్యాక్టరీ యజమాని ఫౌసియర్ నియమిస్తాడు.గనిలోకి లోతుగా వెళ్లిన తర్వాత, ప్రొఫెసర్ బెర్తియర్ నిజమైన ఉద్దేశం బయటపడుతుంది. అతను ఒక పురాతన సమాధిని కనుగొనడానికి అక్కడికి వచ్చాడు. ఇది ఒక అంతరించిపోయిన సంస్కృతికి సంబంధించిన సాక్ష్యాలను కలిగి ఉందని అతను నమ్ముతాడు.


గని కార్మికులు వంద సంవత్సరాల క్రితం మూసివేయబడిన ఒక పాత గ్యాలరీని డైనమైట్‌తో పేల్చడం ద్వారా ఈ సమాధిని యాక్సెస్ చేస్తారు. కానీ ఈ చర్య ఒక భయంకరమైన లాండ్‌స్లైడ్‌కు దారితీస్తుంది. ఆ తరువాత బయటికి వెళ్ళే దారి మూసుకుపోతుంది. అక్కడ సమాధి రత్నాలతో నిండి ఉంటుంది. ఈ సమాధి ఒక పురాతన సంస్కృతికి సంబంధించినదని సూచనలు ఉన్నాయి. అయితే, గని కార్మికులు ఆ సమాధిని తెరిచినప్పుడు, ఒక భయంకరమైన రాక్షసుడు బయటికి వస్తాడు. ఈ జీవి, దాని ఎముకలు మరియు కండరాల రూపంతో భయంకరంగా ఉంటుంది. కార్మికులపై దాడి చేయడం ప్రారంభిస్తుంది.

రాక్షసుడు ఒక్కొక్కరిని హతమార్చడంతో, టన్నెల్స్‌లో ఉద్రిక్తత పెరుగుతుంది. అమీర్, రోలాండ్, లూయిస్ బతికి బయటపడడానికి పోరాడతారు. క్లైమాక్స్‌లో ఆ రాక్షసుడు ఒక పురాతన దైవంమని తెలుస్తుంది. ఈ జీవి ఆత్మలను తినడం ద్వారా బలం పొందుతుంది, ప్రొఫెసర్ అజ్ఞానం వల్ల ఇప్పుడు సమస్య పెద్దదిగా మారింది. ఇప్పుడు అమీర్ అక్కడ ఉన్న వాళ్ళకి ఏకైక ఆశాకిరణంగా మారతాడు. రాక్షసుడిని ఎదుర్కోవడానికి తన ధైర్యాన్ని ఉపయోగిస్తాడు. చివరి ప్రయత్నంలో అమీర్ బృందం రాక్షసుడిని ఓడించడానికి, గనిలోని డైనమైట్‌ను ఉపయోగించి ఆలయాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నం ఫలిస్తుందా ? ఆ రాక్షసుడు అంతమవుతాడా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : పిల్లోడిని చంపి సూట్ కేసులో… మైండ్ బెండయ్యే కొరియన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

Related News

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

OTT Movie : పెళ్ళైన ట్యూషన్ టీచర్ పై ప్రేమ… సీక్రెట్ లెటర్ తో బండారం బట్టబయలు… IMDbలో 7.5 రేటింగ్

OTT Movie : బాబోయ్ చావడానికెళ్లి ఇలా బుక్కయ్యాడేంటి… 12 జన్మలు, 12 సార్లు చావు… కల్లో కూడా చావు గురించి ఆలోచించరు

OTT Movie : బీచ్ ఒడ్డున బట్టల్లేకుండా… రెండేళ్ల పాటు రెస్ట్ లేకుండా… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

OTT Movie : వరుడిని కోమాలోకి పంపే పెళ్లి కూతురు కోరిక… అంతలోనే మరో పెళ్ళికి సిద్ధం… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

OTT Movie : ఈ దెయ్యానికి అమ్మాయిలే కావాలి… ఒక్కో సీన్ కు గుండె జారిపోద్ది… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

OTT Movie : గర్ల్స్ వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరా… విషయం తెలిసిందని అమ్మాయిపై అరాచకం… మెంటలెక్కించే ట్విస్టులు

Big Stories

×