BigTV English

OTT Movie : ఇది లేడీ కాదు మావా కిలాడీ… టిల్లు కన్నా తోపు వీడు… బుర్ర బ్లాస్ట్ చేసే కొరియన్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఇది లేడీ కాదు మావా కిలాడీ… టిల్లు కన్నా తోపు వీడు… బుర్ర బ్లాస్ట్ చేసే కొరియన్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie  : ఓటీటీలో ఒక కొరియెన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో చివరిదాకా ట్విస్టులే ఉంటాయి. ఆర్థిక కష్టాలలో ఉన్న కొంతమంది, ఒక డబ్బు బ్యాగ్ ను కొట్టేయడానికి ప్లాన్ చేస్తారు. ఆ తరువాత స్టోరీ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ కొరియెన్ బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘బీస్ట్స్ క్లాయింగ్ అట్ స్ట్రాస్’ (Beasts Clawing at Straws). 2020లో విడుదలైన ఈ సినిమాకి కిమ్ యాంగ్-హూన్ దర్శకత్వం వహించారు. ఇది 2011 జపనీస్ నవల “Wara ni mo sugaru kemonotachi” ఆధారంగా రూపొందింది. ఇందులో జియాన్ డో-యియాన్ (యియాన్-హీ), జంగ్ వూ-సంగ్ (టే-యంగ్), బే సంగ్-వూ (జూంగ్-మాన్), షిన్ హ్యున్-బిన్ (మీ-రాన్), యౌన్ యుహ్-జంగ్, జంగ్ మాన్-సిక్ (మిస్టర్ పార్క్) ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా 2020 లో 49వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రీమియర్‌గా ప్రదర్శించబడింది. ఈ సినిమా రోటర్డామ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్పెషల్ జ్యూరీ అవార్డ్‌ను గెలుచుకుంది. ఈ సినిమా నాన్-లీనియర్ కథనం, ట్విస్ట్‌లతో కూడిన ప్లాట్, జియాన్ డో-యియాన్ నటన కోసం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. IMDbలో 7.0/10 రేటింగ్ కలిగి ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

ఈ సినిమా స్టోరీ లూయిస్ విట్టన్ బ్యాగ్‌లో భారీ మొత్తంలో ఉన్ననగదు చుట్టూ తిరుగుతుంది. ఈ డబ్బును దక్కించుకోవడం కోసం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కొన్ని పాత్రలు పోటీ పడతాయి. ముందుగా ఒక రెస్టారెంట్ బిజినెస్ లో ఫెయిల్ అయిన జూంగ్-మాన్. ఇతనికి ఆర్థికంగా నష్టాలు కూడా వస్తాయి. తన అనారోగ్యంతో ఉన్న తల్లిని కూడా చూసుకోవాల్సిఉంటుంది. అతను ఒక లాకర్‌లో లూయిస్ విట్టన్ కు చెందిన బ్యాగ్‌ను చూస్తాడు. దానిలో భారీ మొత్తంలో డబ్బు ఉంటుంది. ఈ డబ్బు తన జీవితాన్ని మార్చగలదనే ఆశతో, అతను బ్యాగ్‌ను దాచిపెడతాడు. కానీ దాని యజమాని గురించి బయపడుతూనే ఉంటాడు. ఆతరువాత అతని జీవితం ఊహించని మలుపులు తీసుకుంటుంది.

ఒక కస్టమ్స్ ఆఫీసర్ అయిన టే-యంగ్, మిస్టర్ పార్క్ కు భారీగా అప్పు ఉంటాడు. అతని స్నేహితురాలు యియాన్-హీ, చెల్లించాల్సిన డబ్బును తీసుకొని కనిపించకుండా పోతుంది. దీని వల్ల అతని లైఫ్ ప్రమాదంలో పడుతుంది. టే-యంగ్ ఇక దేశం విడిచి వెళ్లాలని అనుకుంటాడు. కానీ అతని ప్లాన్‌లు ఫైల్ అవుతాయి. అతను లూయిస్ విట్టన్ బ్యాగ్‌లో నగదు ఉన్నట్టు తెలుసుకుంటాడు, దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు.

మీ-రాన్ స్టాక్ మార్కెట్‌లో డబ్బు పెట్టి నష్ట పోతుంది. ప్రస్తుతం తన శాడిస్ట్ భర్తతో జీవితాన్ని కష్టంగా గడుపుతోంది. అయితే ఆమెకు బార్ ఫ్రెండ్ అయిన ఒక యువకుడు, ఆమె భర్తను చంపి, ఇన్సూరెన్స్ డబ్బును పంచుకుందామని ఐడియా ఇస్తాడు.  ఈ ప్లాన్ కూడా ఫైల్ అవుతుంది. ఆ తరువాత మీ-రాన్ తన బాస్ యియాన్-హీతో కలిసి కొత్త జీవితం కోసం ప్రయత్నిస్తుంది. అయితే యియాన్-హీ ఒక క్రూరమైన మహిళ. మీ-రాన్‌ను మోసం చేసి, ఆమెను దారుణంగా చంపి, ఆమె శరీరాన్ని సరస్సులో పడేస్తుంది. యియాన్-హీ ఒక రూత్‌లెస్ సాడిస్టిక్. డబ్బు కోసం ఎటువంటి హద్దులను దాటడానికైనా సిద్ధంగా ఉంటుంది. ఆమె టే-యంగ్‌ను మోసం చేసి, డబ్బు బ్యాగ్‌ను స్వాధీనం చేసుకోవడానికి అనేక మార్గాలను ప్లాన్ చేస్తుంది.

ఈ సినిమాలోని పాత్రల జీవితాలు, ఒక జిగ్సా పజిల్ లాగా మారుతాయి. ఆ డబ్బు బ్యాగ్ ఒకరి నుండి మరొకరికి మారుతూ , ప్రతి పాత్ర దానిని స్వాధీనం చేసుకోవడానికి మోసం, హింస, హత్యలకు పాల్పడతారు. అయితే ఈ డబ్బు ఎవరికీ నిజమైన ఆనందం ఇవ్వకుండా చేస్తుంది. చివరికి ఈ డబ్బు ఎవరికి దక్కుతుంది ? వీళ్ళంతా ఎటువంటి సమస్యలను ఎదుర్కుంటారు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : మనుషుల్ని లేపేసే దేవుడు, దెయ్యం… ఇదెక్కడి దిక్కుమాలిన సినిమారా అయ్యా

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×