OTT Movie : భూమిమీద వినాశనం జరిగి, ఈ యుగం అంతం అవుతుందని చాలామంది నమ్ముతున్నారు. ఈ జనర్ లో సినిమాలు కూడా వచ్చాయి. ఇవి బ్లాక్ బస్టర్ హిట్లు కూడా అందుకున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా లో మనుషులు హఠాత్తుగా చనిపోతుంటారు. దేవుని మీద విశ్వాసం ఉన్న వాళ్ళు స్వర్గానికి, విశ్వాసం లేని వాళ్ళు నరకానికి వెళ్తుంటారు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది. అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ అమెరికన్ అపోకలిప్టిక్ హారర్ మూవీ పేరు ‘The Remaining’. 2014లో విడుదలైన ఈ సినిమాకు కేసీ లా స్కాలా దర్శకత్వం వహించారు.ఇందులో అలెక్సా పెనావెగా (స్కైలార్), బ్రయాన్ డెచార్ట్ (డాన్), జానీ పాకర్ (టామీ), షాన్ సిపోస్ (జాక్), ఇటాలియా రిక్కీ (అలిసన్), లిజ్ ఇ. మోర్గాన్ (సామ్) వంటి నటులు నటించారు. ఈ సినిమా బైబిల్‌లోని బుక్ ఆఫ్ రివిలేషన్‌ను ఆధారంగా చేసుకుని, రాప్చర్ (Rapture) అనే క్రైస్తవ విశ్వాస సంఘటన చుట్టూ తిరుగుతుంది. Prime Video, Apple TV లలో ఈ సినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ స్కైలార్, డాన్ ల వివాహ వేడుకతో ప్రారంభమవుతుంది. ఇది ఒక ఆనందకరమైన వేడుకగా జరుగుతుంది. వీళ్ళ మిత్రులు టామీ, జాక్, అలిసన్ కూడా ఈ వేడుకలో పాల్గొంటారు. టామీ, డాన్ కోసం వివాహాన్ని డాక్యుమెంట్ చేస్తూ, వీడియో కెమెరాతో రికార్డ్ చేస్తుంటాడు.ఈ వివాహం జరుగుతున్న సమయంలో, స్కైలార్ తల్లిదండ్రులు ఎలివేటర్‌లో ఉన్నప్పుడు, అకస్మాత్తుగా కళ్ళు తెల్లగా మారి చనిపోతారు. టామీ ఎలివేటర్ నుండి బయటకు వచ్చినప్పుడు, వివాహ వేదిక అంతా గందరగోళంలో ఉంటుంది. కొందరు పిల్లలు, పెద్దలు అదే విధంగా తెల్లటి కళ్ళతో చనిపోతారు. ఈ సంఘటనను “ఇన్‌స్టంట్ డెత్ సిండ్రోమ్” అని వార్తల్లో చెబుతారు. కానీ స్కైలార్ దీనిని ఒక రాప్చర్‌గా గుర్తిస్తుంది. దీని గురించి బైబిల్‌లోని రివిలేషన్ పుస్తకంలో క్లియర్ గా చెప్పబడి ఉంటుంది.
రాప్చర్ తర్వాత ప్రపంచం విపత్తులతో నిండిపోతుంది. విమానాలు ఆకాశం నుండి కూలిపోతాయి. భూకంపాలు సంభవిస్తాయి. రివిలేషన్ లో చెప్పినట్లు భారీ వడగళ్ళు కూడా పడతాయి. ఈ సమయంలో స్కైలార్, డాన్, టామీ, జాక్, అలిసన్ ఒక సమీప చర్చిలో ఆశ్రయం కోసం పరుగెత్తుతారు. అక్కడ సామ్ అనే యువతిని వీరి తో కలసిపోతుంది. ఈ క్రమంలో స్కైలార్ ఒక దాడిలో గాయపడుతుంది. ఆమె గాయాలు సాధారణ యాంటీబయాటిక్స్‌తో నయం కావు. ఇది డెమోనిక్ విషం వల్ల సమస్య తీవ్రం అవుతుంది. చర్చిలో ఒక పాస్టర్ వీళ్ళకు రాప్చర్ గురించి వివరిస్తాడు. అంతే కాకుండా ఆధ్యాత్మికంగా ఉండటం సరిపోదని, నీవు దేవునితో సరైన సంబంధంలో ఉండాలని చెబుతాడు. ఈ సమయంలో టామీ, అలిసన్ ను ప్రేమిస్తుంటాడు. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ ట్రాక్ లో నడుస్తుంది. ఇంతలో స్కైలార్ గాయాలు తీవ్రమవడంతో, ఇతని ఫ్రెండ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటారు. కానీ బయట డెమన్‌లు, ప్రకృతి విపత్తులు వారిని వెంటాడతాయి.
ఇక స్కైలార్ తనకు తగిలిన గాయాల కారణంగా చనిపోతుంది. డాన్ దేవునిపై కోపంతో అరవడంతో, ఒక డెమోనిక్ టెంటకిల్ ద్వారా చంపబడతాడు. సామ్ తన విశ్వాసాన్ని దేవుడిపై ఉంచి, తనకు తానే ప్రాణాలను వదిలేస్తుంది. ఆ తరువాత టామీ కూడా చనిపోతాడు. ఆకాశం నుండి ఫాలెన్ ఏంజెల్స్ భారీ సంఖ్యలో దిగివస్తాయి. మానవజాతిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటాయి. చివరికి ఫాలెన్ ఏంజెల్స్ మానవ జాతిని అంతం చేస్తాయా ? భూమి మీద ఎలాంటి మనుషులు మిగులుతారు ? ఈస్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి ?
Read Also : మంచానికే పరిమితమయ్యే భర్త… ఆ భార్య చేసే పనికి ఫ్యూజులు అవుట్