E-Paper
Advertisement

ఓటీటీలోకి తమిళ సునామీ… ఈ కంటెట్ అస్సలు మిస్ అవ్వద్దు

ఓటీటీలోకి తమిళ సునామీ… ఈ కంటెట్ అస్సలు మిస్ అవ్వద్దు
Advertisement

Tamil OTT Releases: సౌత్ ఇండియన్ ఓటీటీ ఆడియన్స్‌కు ఈ వారం డిజిటల్ స్క్రీన్స్ పై ఒక భారీ తమిళ సినిమా సునామీ విరుచుకుపడింది. హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ బ్లాక్‌బస్టర్ దగ్గరి నుండి, అమర ప్రేమ కావ్యాలు, యూత్‌ఫుల్ రోమ్‌కామ్ సిరీస్, అజిత్ వింటేజ్ క్లాసిక్ వరకు ఏకంగా 6 క్రేజీ సినిమాలు, సిరీస్‌లు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో సందడి చేస్తున్నాయి. అందులో చాలా వరకు మన తెలుగు ఆడియో ఆప్షన్‌తో అందుబాటులో ఉండటం మరో స్పెషల్ అట్రాక్షన్. ఆ 6 క్రేజీ ప్రాజెక్ట్స్ ఏ ఓటీటీలో ఉన్నాయో ఓ లుక్ వేద్దాం పదండి.

1. జైలర్ 2 (Jailer 2)

ఈ వారంలో అందరికంటే బిగ్గెస్ట్ అట్రాక్షన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆల్టై మ్ బ్లాక్‌బస్టర్ ‘జైలర్ 2’ (Jailer 2). నెల్సన్ దిలీప్ కుమార్ మార్క్ డార్క్ హ్యూమర్, అనిరుధ్ బీజీఎం, తలైవా మాస్ స్వాగ్ తో థియేటర్లను షేక్ చేసిన ఈ చిత్రం, ఇప్పుడు Amazon Prime Video లో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

2. యెజు కడల్ యెజు మలై (Yezhu Kadal Yezhu Malai)

Advertisement

విలక్షణ దర్శకుడు రామ్ తెరకెక్కించిన ఫాంటసీ రొమాంటిక్ డ్రామా ‘యెజు కడల్ యెజు మలై’. నివిన్ పౌలీ, అంజలి, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ 8,000 ఏళ్ల అమర ప్రేమ కావ్యం విదేశీ ఓటీటీ అయిన Astro Movies లో అందుబాటులోకి వచ్చింది.

3. సందకారి (Sandakari)

విమల్, శ్రియ శరణ్ జంటగా నటించిన అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘సందకారి’. ఇంట్లో భార్య ఆఫీసులో బాస్ అయితే ఒక కుర్రాడు పడే తిప్పలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ చిత్రం కూడా Astro Movies లో స్ట్రీమింగ్ అవుతోంది.

4. సాయవనం (Saayavanam)

Advertisement

పల్లెటూరి నేపథ్యం, ప్రకృతిని కాపాడుకోవడానికి సామాన్యుడు చేసే పోరాటంతో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా ‘సాయవనం’. ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ Aha Video (ఆహా) వేదికగా తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

5. మస్ట్ డేట్ ది ప్లేబాయ్ (Must Date The PlayBoy)

నేటితరం యూత్ టేస్ట్ కి తగ్గట్టుగా బోల్డ్ రొమాన్స్, ఫన్నీ ఇగో క్లాషెస్ తో రూపొందిన తమిళ వెబ్ సిరీస్ ‘Must Date The PlayBoy’. ప్లేబాయ్ కి బుద్ధి చెప్పబోయి ప్రేమలో పడే అమ్మాయి కథతో సాగే ఈ సిరీస్ Netflix లో ట్రెండ్ అవుతోంది.

6. అమర్‌కళం రీమాస్టర్డ్ వెర్షన్ (Amarkkalam Remastered)

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కెరీర్ లోనే మైలురాయిగా నిలిచిన కల్ట్ క్లాసిక్ యాక్షన్ లవ్ స్టోరీ ‘అమర్‌కళం’ (Amarkkalam), సరికొత్త 4K రీమాస్టర్డ్ హంగులతో Prime Video, ఓవర్సీస్‌లో SimplySouth వేదికగా మళ్లీ కనువిందు చేస్తోంది. ఈ వీకెండ్‌లో ఎటువంటి బోర్ కొట్టకుండా విభిన్న జానర్లను ఎంజాయ్ చేయాలనుకునే వారు ఈ తమిళ కంటెంట్‌ను అస్సలు మిస్ అవ్వకండి.

Read Also: ఓటీటీలో మలయాళ విందు రెడీ… ఈ వీక్ మైండ్ బ్లాక్ చేసే క్రేజీ మూవీస్ ఇవే

Related News

ఓటీటీలోకి 20 చిత్రాలు..ఆ 2 డోంట్ మిస్!

తండ్రి ఇన్సూరెన్స్ డబ్బు కోసం స్కెచ్‌లు వేసే కొడుకులు… ఒకరి ఎత్తుకు మరొకరి పైఎత్తు.. చూస్తే నవ్వులే నవ్వులు

ఓటీటీలో మలయాళ విందు రెడీ… ఈ వీక్ మైండ్ బ్లాక్ చేసే క్రేజీ మూవీస్ ఇవే

ఇదేం తల్లి ప్రేమరా బాబూ… కొడుకు గెలుపు కోసం పాపనే లేపేసే ప్లాన్… ఓటీటీలోకి క్రేజీ స్పోర్ట్స్ థ్రిల్లర్

ప్రేమ జంటకు విలన్‌గా మారిన ఎమ్మెల్యే.. అప్పులు చేసి కొన్న ఇంటి కోసం ప్రాణాలతో చెలగాటం.. ఓటీటీలోకి రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్

బోర్ కొడుతోందా? అయితే ఈ ‘వైబ్’ ట్రై చేయండి… యూత్‌ని కట్టిపడేస్తున్న స్పై కామెడీ థ్రిల్లర్

ఓరి దేవుడో… ఆపదొస్తే ఆ దేవుడేం చేశాడో తెలుసా ? గుండెల్ని పిండేసే ఈ క్రిస్మస్ మాస్టర్‌పీస్‌ని ఇప్పుడే చూసేయండి

Big Stories

Advertisement
×