E-Paper
Advertisement

తండ్రి ఇన్సూరెన్స్ డబ్బు కోసం స్కెచ్‌లు వేసే కొడుకులు… ఒకరి ఎత్తుకు మరొకరి పైఎత్తు.. చూస్తే నవ్వులే నవ్వులు

తండ్రి ఇన్సూరెన్స్ డబ్బు కోసం స్కెచ్‌లు వేసే కొడుకులు… ఒకరి ఎత్తుకు మరొకరి పైఎత్తు.. చూస్తే నవ్వులే నవ్వులు
Advertisement

Afratafri OTT: భారీ బడ్జెట్ హంగులు లేకపోయినా, కేవలం పదునైన స్క్రీన్‌ప్లే, నటీనటుల కామెడీ టైమింగ్‌తో బాక్సాఫీస్ వద్ద థియేటర్లను నవ్వులతో నింపేసిన మరాఠీ మూవీ అఫ్రాతఫ్రీ (Afratafri). డబ్బు కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తారు అనడానికి ఎన్నో ఉదాహరణలు చూశాం. అయితే మిలింద్ జుంబర్ కవ్డే దర్శకత్వం వహించిన ఈ మరాఠీ కామెడీ డ్రామాలో 1 కోటి డబ్బు కోసం అత్యాశకు పోయిన ముగ్గురు అన్నదమ్ములు తమ జీవితాలను ఎలా గందరగోళంలో పడేసుకున్నారనేది చాలా కామెడీగా చూపించారు. 2026 అక్టోబర్ 9న థియేటర్లలో ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించిన ఈ క్రేజీ కామెడీ థ్రిల్లర్ ఇప్పుడు ప్రముఖ ఓటీటీలో అఫీషియల్ గా స్ట్రీమింగ్ అవుతూ డిజిటల్ స్క్రీన్స్ పై సందడి చేస్తోంది.

కథ ఏమిటంటే ?

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ముగ్గురు సోదరులు తమ జీవితాలను ఎలాగైనా మార్చుకోవాలని అనుకుంటుంటారు. ఒక్కొక్కరికీ ఒక్కో అవసరం, ఆశయం ఉన్నప్పటికీ డబ్బు సంపాదించాలనే కోరిక మాత్రం అందరిలోనూ బలంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో వారి తండ్రి మరణిస్తాడు. దీంతో ఆయన పేరుతో ఉన్న భారీ ఇన్సూరెన్స్ డబ్బు గురించి వారికి తెలుస్తుంది. ఆ మొత్తం ఏకంగా కోటి రూపాయలు కావడంతో ముగ్గురి ఆశలు ఒక్కసారిగా పెరిగిపోతాయి.

Advertisement

అయితే ఆ డబ్బు ఎవరికి దక్కాలి? దాన్ని ఎలా సొంతం చేసుకోవాలి? అనే విషయంలో వారి మధ్య విభేదాలు మొదలవుతాయి. ఒక్కొక్కరు తమ స్వార్థం కోసం వేర్వేరు పథకాలు వేస్తుంటారు. ఒకరి ప్లాన్ మరొకరికి తెలియకుండా వ్యవహరించడంతో చిన్న చిన్న అబద్ధాలు, అపార్థాలు పెద్ద గందరగోళానికి దారితీస్తాయి. డబ్బు కోసం మొదలైన ఈ ఎత్తులు, పైఎత్తుల్లో కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు కూడా దెబ్బతింటాయి. ఈ ముగ్గురి అత్యాశ చివరికి ఎలాంటి పరిణామాలకు దారితీసింది? కోటి రూపాయల కోసం వేసిన ప్లాన్లు సక్సెస్ అయ్యాయా? లేక వారి పథకాలే వారిని చిక్కుల్లో పడేశాయా? అన్నదే ఈ సినిమా మిగతా కథ.

జీ5లో స్ట్రీమింగ్

ఈ సినిమాలో మోహన్ ఆగాషే, సంజయ్ నార్వేకర్, శశాంక్ షెండే, ఓంకార్ భోజనే, అసావరి జోషి, ప్రజక్తా హనమ్‌ఘర్, కిరణ్ మానే, నేహా ఖాన్, హేమంత్ పాటిల్ తదితరులు నటించారు. మిలింద్ జుంబర్ కవాడే కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. వరుణ్ లిఖాతే సంగీతం అందించారు. సుమారు 2 గంటల 5 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా అక్టోబర్ 9, 2026న మరాఠీలో థియేటర్లలో విడుదలైంది. నవంబర్ 13 నుంచి ZEE5లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. అయితే ఇది మరాఠీ ఆడియోలో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో లేదు. కుటుంబ సంబంధాలు, డబ్బు చుట్టూ తిరిగే గొడవలు, సిచ్యువేషన్ కామెడీని ఇష్టపడేవారికి ఈ సినిమా మంచి టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్.

Advertisement

Read Also: టార్చర్ పెట్టిన బాస్‌నే పెళ్లి చేసుకునే అసిస్టెంట్‌.. ఓటీటీలోకి నవ్వులు పూయించే రొమాంటిక్ కామెడీ

Tags

Related News

ఓటీటీలో మలయాళ విందు రెడీ… ఈ వీక్ మైండ్ బ్లాక్ చేసే క్రేజీ మూవీస్ ఇవే

ఇదేం తల్లి ప్రేమరా బాబూ… కొడుకు గెలుపు కోసం పాపనే లేపేసే ప్లాన్… ఓటీటీలోకి క్రేజీ స్పోర్ట్స్ థ్రిల్లర్

ప్రేమ జంటకు విలన్‌గా మారిన ఎమ్మెల్యే.. అప్పులు చేసి కొన్న ఇంటి కోసం ప్రాణాలతో చెలగాటం.. ఓటీటీలోకి రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్

బోర్ కొడుతోందా? అయితే ఈ ‘వైబ్’ ట్రై చేయండి… యూత్‌ని కట్టిపడేస్తున్న స్పై కామెడీ థ్రిల్లర్

ఓరి దేవుడో… ఆపదొస్తే ఆ దేవుడేం చేశాడో తెలుసా ? గుండెల్ని పిండేసే ఈ క్రిస్మస్ మాస్టర్‌పీస్‌ని ఇప్పుడే చూసేయండి

టార్చర్ పెట్టిన బాస్‌నే పెళ్లి చేసుకునే అసిస్టెంట్‌.. ఓటీటీలోకి నవ్వులు పూయించే రొమాంటిక్ కామెడీ

8,000 ఏళ్లుగా చావు లేకుండా బతుకుతున్న వ్యక్తి… రైలు ప్రయాణంలో బయటపడ్డ వింత ప్రేమకథ.. ఈ సినిమా ఓటీటీ ఎక్కడంటే?

Big Stories

Advertisement
×