E-Paper
Advertisement

ఓటీటీలో మలయాళ విందు రెడీ… ఈ వీక్ మైండ్ బ్లాక్ చేసే క్రేజీ మూవీస్ ఇవే

ఓటీటీలో మలయాళ విందు రెడీ… ఈ వీక్ మైండ్ బ్లాక్ చేసే క్రేజీ మూవీస్ ఇవే
Advertisement

Malayalam OTT Releases: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కంటెంట్ పరంగా ఎప్పుడూ ఒక అడుగు ముందుండేది మలయాళ చిత్ర పరిశ్రమ. తక్కువ బడ్జెట్‌తో, అత్యంత సహజమైన కథనంతో, మైండ్ బ్లాక్ చేసే ట్విస్టులతో మలయాళ మేకర్స్ తీసే సినిమాలకు మన తెలుగు ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. వీకెండ్ వచ్చేసిందంటే చాలు, ఏదైనా కొత్త మలయాళం థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చిందా అని సెర్చ్ చేసే ఆడియన్స్ కోసం ఈ వారం డిజిటల్ స్క్రీన్స్ పై ఒక అదిరిపోయే విందు రెడీ అయింది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా దగ్గరి నుండి, వెన్నులో వణుకు పుట్టించే సీరియల్ కిల్లర్ మిస్టరీ, ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ వరకు మూడు క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ రచ్చ చేస్తున్నాయి. ఆ మూడు సినిమాలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో ఓ లుక్ వేద్దాం పదండి.

1. బాంద్రా (Bandra) 

మలయాళ స్టార్ హీరో దిలీప్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా జంటగా నటించిన హై-వోల్టేజ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘బాంద్రా’ (Bandra). అరుణ్ గోపీ దర్శకత్వంలో 1990ల నాటి ముంబై అండర్ వరల్డ్, బాలీవుడ్ గ్లామర్ ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కింది. తెరపై దేవతల్లా కనిపించే హీరోయిన్ల జీవితాల వెనుక మాఫియా డాన్లు నడిపే చీకటి దందాలను ఇందులో షాకింగ్‌గా చూపించారు. తమన్నాను కాపాడటానికి ముంబై డాన్ ఆలా (దిలీప్) చేసే యాక్షన్ విన్యాసాలు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. ప్రస్తుతం ఈ చిత్రం నవంబర్ 13 నుండి ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

2. ది థర్డ్ మర్డర్ (The Third Murder) 

Advertisement

సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఇదొక పర్ఫెక్ట్ ట్రీట్. ఒక ప్రశాంతమైన నగరంలో ఎటువంటి ఆధారాలు వదలకుండా ఒక సైకో సీరియల్ కిల్లర్ చేసే వరుస హత్యల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. పోలీసులకు సవాల్ విసురుతూ జరిగే ఆ మూడో హత్య వెనుక దాగి ఉన్న దిమ్మతిరిగే రహస్యం క్లైమాక్స్‌లో మైండ్ బ్లాక్ చేస్తుంది. ముఖ్య విశేషం ఏంటంటే.. ఈ సినిమా నవంబర్ 13 నుండి ManoramaMAX, ఓవర్సీస్‌లో SimplySouth వేదికగా మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది.

3. డీఎన్ఏ (DNA) – Sun NXT

ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన మరో గ్రిప్పింగ్ మూవీ ‘డీఎన్ఏ’ (DNA). ఒక క్లిష్టమైన మర్డర్ కేసును ఛేదించే క్రమంలో ఫోరెన్సిక్ ఆధారాలు, డీఎన్ఏ రిపోర్టులు ఎలాంటి సంచలన నిజాలను బయటపెట్టాయి అనేదే ఈ సినిమా అసలు కథ. ప్రతీ సీన్ ఉత్కంఠభరితంగా సాగుతూ ఆడియన్స్‌ను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది. ఈ చిత్రం ప్రముఖ సౌత్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ Sun NXT (సన్ నెక్స్ట్) లో నవంబర్ 13 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. టి.ఎస్. సురేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘డీఎన్ఏ’ (DNA) లో మమ్ముట్టి మేనల్లుడు అస్కర్ సౌదాన్ (ఆనంద్), రాయ్ లక్ష్మి (ఐపీఎస్ ఆఫీసర్ రాచెల్ పున్నూస్) ప్రధాన పాత్రల్లో నటించగా, హన్నా రెజీ కోషి, బాబు ఆంటోనీ, అజు వర్గీస్, జానీ ఆంటోనీ, రెంజీ పనిక్కర్, ఇంద్రన్స్, గౌరీ నంద, ఇర్షాద్ అలీ, అన్సార్ కళాభవన్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో మెరిశారు.

Advertisement

Read Also: పెళ్లైన మొదటి రాత్రే షాకింగ్ ట్విస్ట్… కుడివైపు ఉండాల్సిన గుండె ఎడమవైపుకు మారితే? ఓటీటీలోకి క్రేజీ మెడికల్ థ్రిల్లర్

Tags

Related News

ఇదేం తల్లి ప్రేమరా బాబూ… కొడుకు గెలుపు కోసం పాపనే లేపేసే ప్లాన్… ఓటీటీలోకి క్రేజీ స్పోర్ట్స్ థ్రిల్లర్

ప్రేమ జంటకు విలన్‌గా మారిన ఎమ్మెల్యే.. అప్పులు చేసి కొన్న ఇంటి కోసం ప్రాణాలతో చెలగాటం.. ఓటీటీలోకి రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్

బోర్ కొడుతోందా? అయితే ఈ ‘వైబ్’ ట్రై చేయండి… యూత్‌ని కట్టిపడేస్తున్న స్పై కామెడీ థ్రిల్లర్

ఓరి దేవుడో… ఆపదొస్తే ఆ దేవుడేం చేశాడో తెలుసా ? గుండెల్ని పిండేసే ఈ క్రిస్మస్ మాస్టర్‌పీస్‌ని ఇప్పుడే చూసేయండి

టార్చర్ పెట్టిన బాస్‌నే పెళ్లి చేసుకునే అసిస్టెంట్‌.. ఓటీటీలోకి నవ్వులు పూయించే రొమాంటిక్ కామెడీ

8,000 ఏళ్లుగా చావు లేకుండా బతుకుతున్న వ్యక్తి… రైలు ప్రయాణంలో బయటపడ్డ వింత ప్రేమకథ.. ఈ సినిమా ఓటీటీ ఎక్కడంటే?

సినిమా చరిత్రపై కడుపుబ్బా నవ్వించే సెటైర్లు… ఓటీటీలోకి నవ్వుల పటాకా… మూవీ లవర్స్ డోంట్ మిస్

Big Stories

Advertisement
×